- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి ప్లాన్ సక్సెస్ అవుతుందా.. ప్రియ చెప్పింది విని షాకైన తులసి!
Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి ప్లాన్ సక్సెస్ అవుతుందా.. ప్రియ చెప్పింది విని షాకైన తులసి!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. అత్తగారి దాష్టికానికి బలవుతున్న ఒక కొత్త కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీ అక్క చేసిన సౌండ్ కి అర్థం తెలుసు కానీ నేను చేసిన సౌండ్ కి అర్థం తెలియదా.. చెప్పను అని చెప్పుతో సమాధానం చెప్తున్నాను అంటుంది దివ్య. ఏం మాట్లాడుతున్నావ్ మా అక్క సహనంతో ఊరుకుంటుంది కానీ కోపంతో ఒక్కసారి జూలు విదిలించిందంటే వెళ్లి పుట్టింట్లో పడతావు అంటాడు బసవయ్య.
ఇప్పుడు నేను వెళ్ళేది పుట్టింటికే ఏది ఒక్కసారి జూలు విదిలించమనండి కనీసం క్యాబ్ డబ్బులు అయినా మిగులుతాయి అంటుంది దివ్య. ఇచ్చిన డోసు సరిపోలేదా అంటుంది రాజ్యలక్ష్మి. నాకు కూడా టైం వస్తుంది అప్పుడు నేను కూడా డబల్ డోస్ ఇస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దివ్య. దివ్య మాటలకి నవ్వుతున్న రాజ్యలక్ష్మి ని చూసి షాక్ అవుతాడు బసవయ్య.
కాళ్లు విరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టడం మానేసి ఎందుకలా నవ్వుతున్నావు అని రాజ్యలక్ష్మిని అడుగుతాడు. తను వెళ్ళటమే మనకి కావలసింది. వచ్చేటప్పటికి చూడు ఏం జరుగుతుందో అంటుంది రాజ్యలక్ష్మి. సీన్ కట్ చేస్తే సడన్గా తన ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి షాక్ అవుతుంది తులసి. తల్లిని చూసిన దివ్య తులసిని హత్తుకొని ఏడుస్తుంది.
తులసి కూడా ఎమోషనల్ అవుతుంది కానీ బయటపడకుండా నిన్ను రావద్దు అని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అంటూ మందలిస్తుంది. అంతలోనే నందు రావటంతో తండ్రిని హత్తుకొని అమ్మ చెప్పిందని నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తావా అని అడుగుతుంది. అలా ఎందుకు చేస్తాను నువ్వు మీ అమ్మని అపార్థం చేసుకుంటున్నావు అంటూ తులసి వద్దంటున్నా వినకుండా జరిగిందంతా చెప్తాడు నందు.
మా అత్త రాక్షసి అయి ఉండవచ్చు కానీ మీ అల్లుడు దేవుడు అంటుంది దివ్య. అదే మా ధైర్యం అంటుంది తులసి. కానీ అదే ధైర్యం తల్లికి లొంగిపోతే మనం ఏమి చేయలేము అంటాడు నందు. మీరేమీ భయపడకండి నాన్న నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను అనే తండ్రికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తుంది దివ్య.
ఇదంతా చూస్తున్న లాస్య కోడల్ని అదుపులో పెట్టుకున్నాను అని చెప్పింది రాజ్యలక్ష్మి ఇదేనా పెట్టుకోవడం అని కోపంతో రగిలిపోతూ రాజ్యలక్ష్మి కి ఫోన్ చేస్తుంది. తను ఎక్కడికి వస్తే నాకు ఇబ్బంది అని చెప్పాను కదా అయినా తను నీకు చెప్పే వచ్చిందా అని అడుగుతుంది లాస్య. అవును చెప్పే వచ్చింది తను ఇంటికి వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాజ్యలక్ష్మి.
మరోవైపు విక్రమ్ మెట్లు దిగడం గమనించిన బసవయ్య రాజ్యలక్ష్మి చేతికి కట్టు కడుతూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. తల్లి చేతికి కట్టు చూసిన విక్రమ్ కంగారుపడుతూ ఏం జరిగింది అని అడుగుతాడు. బసవయ్య ఏదో చెప్పకపోతే తను చిన్నపిల్ల కావాలని ఏమి చేయలేదు అంటూ మంచితనాన్ని ఒలకపోస్తుంది రాజ్యలక్ష్మి. నువ్వు ఊరుకో అక్క అన్నివేళలా మంచితనం పనికిరాదు నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ కొడుక్కి అయినా నిజం చెప్పు అంటాడు బసవయ్య.
అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ కోప్పడతాడు విక్రమ్. ఈరోజు పనిమనిషి రాలేదు. వంట చేస్తున్న మీ అత్తగారికి సాయం చేయమ్మా అని దివ్యతో అంటే పుట్టింటికి వెళ్తుంటే నన్ను ఆపేస్తారా అంటూ కోపంతో చిందులు తొక్కింది. చేతిలో ఉన్న చాకుని విసిరేసింది నేరుగా వచ్చి అక్కకు తగిలి ఇంత పెద్ద గాయం అయింది అయినా ఆగలేదు పుట్టింటికి వెళ్ళిపోయింది అని చాడీలు చెప్తాడు బసవయ్య.
అది విని కోపంతో రగిలిపోయిన విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ల ప్లాన్ వర్క్ అవుట్ అయినందుకు సంతోషిస్తారు బసవయ్య, రాజ్యలక్ష్మి. మరోవైపు పని చేసుకుంటున్న అత్తగారి దగ్గరికి వచ్చి మీరైనా మీ అబ్బాయికి చెప్పండి తనను కూడా నాతోపాటు కేఫీకి రమ్మనండి అని చెప్తుంది లాస్య. తులసి వైపు చూస్తుంది అనసూయ.
దీనికి కూడా మీ రింగు మాస్టర్ పర్మిషన్ ఇవ్వాలా అని తులసి దగ్గరికి వెళ్లి నువ్వైనా నీ మాజీ మొగుడికి చెప్పు బుద్ధిగా నడుచుకోమని లేదంటే గృహహింస చట్టం అనేది మళ్లీ మళ్లీ పెట్టుకోవచ్చు. అనవసరంగా నేను టెన్షన్ పడి తర్వాత మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఇదంతా అవసరమా ఉంటుంది లాస్య. తరువాయి భాగంలో ప్రియ తులసికి ఫోన్ చేసి అనవసరంగా దివ్య మీద నిందలు వేస్తున్నారు బావగారైతే దివ్యని కొట్టడానికి చెయ్యెత్తారు అని చెప్తుంది.