- Home
- Entertainment
- OTT Movie: థియేటర్లలో 20కోట్లు, ఓటీటీలో 100 మిలియన్స్ మినిట్స్ తో దుమ్మురేపుతున్న రియల్ లవ్ స్టోరీ
OTT Movie: థియేటర్లలో 20కోట్లు, ఓటీటీలో 100 మిలియన్స్ మినిట్స్ తో దుమ్మురేపుతున్న రియల్ లవ్ స్టోరీ
OTT Movie: థియేటర్లలో విశేష ఆదరణ పొందిన `రాజు వెడ్స్ రాంబాయి` మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ఏకంగా వంద మిలియన్స్ వ్యూస్ మినిట్స్ దాటి దూసుకుపోతుంది.

రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీలో రచ్చ
ఇటీవల కాలంలో చాలా సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలో బాగా ఆడుతున్నాయి. కొన్ని మూవీస్ రెండు చోట్ల గట్టిగానే రచ్చ చేస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియెన్స్ ముందుకు వచ్చిన `రాజు వెడ్స్ రాంబాయి` థియేటర్లలో విశేష ఆదరణ పొందింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.
నవంబర్‌లో విడుదలైన `రాజు వెడ్స్ రాంబాయి`
కొత్త నటీనటులు అఖిల్ రాజ్, తేజస్విని రావ్ జంటగా నటించిన `రాజు వెడ్స్ రాంబాయి` చిత్రంలో శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనితా చౌదరీ ప్రధాన పాత్రలు పోషించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. ఆయనకిది తొలి చిత్రం. ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈటీవీ విన్ సమర్పణలో రూపొందిన ఈ మూవీని నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీవాసు థియేటర్లలో గత నెలలో విడుదల చేశారు.
బాక్సాఫీసు వద్ద రూ.20కోట్ల వసూళ్లు
తెలంగాణలో జరిగిన ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీతో దీన్ని రూపొందించారు. పరువు హత్యల నేపథ్యంలో చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. దీంతో యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. క్రిటిక్స్ ప్రశంసించారు. దీంతో చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ. 20కోట్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ములేపుతుంది.
ఓటీటీలో దుమ్ములేపుతున్న రాజు వెడ్స్ రాంబాయి
`రాజు వెడ్స్ రాంబాయి` మూవీ ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. గత వారం నుంచే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. టాప్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్ మినిట్స్ ని దాటేయడం విశేషం. ఇంకా టాప్‌లోనే రాణిస్తూ సరికొత్త సంచలనాల దిశగా స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

