- Home
- Entertainment
- Coolie Release Date: రజినీ సెంటిమెంట్ రోజునే 'కూలీ' రిలీజ్.. సన్ పిక్చర్స్ గ్రీన్ సిగ్నల్!
Coolie Release Date: రజినీ సెంటిమెంట్ రోజునే 'కూలీ' రిలీజ్.. సన్ పిక్చర్స్ గ్రీన్ సిగ్నల్!
Coolie Release Date: రజినీకాంత్ నటించిన 'కూలీ' సినిమాని తన సెంటిమెంట్ ప్రకారం, తనకు హిట్ ఇచ్చిన అదే రోజున విడుదల చేయాలని రజినీకాంత్ ప్లాన్ చేస్తున్నారు.

Rajinikanth, Coolie Release Date
Rajinikanth Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'వేటైయన్' గతేడాది విడుదలైంది. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ దీనికి దర్శకత్వం వహించారు. అంచనాలను అందుకోలేకపోయింది. యావరేజ్‌గానే ఆడింది. రజనీని ఇలా సెటిల్డ్ రోల్ లో ఆడియెన్స్ చూడలేకపోయారు. ఆయన మార్క్ మాస్, యాక్షన్ మిస్ అయ్యింది.
Rajinikanth, Coolie Release Date
దీంతో ఇప్పుడు మళ్లీ తన మార్క్ మాస్, యాక్షన్, ఎలివేషన్లు ఉండే సినిమా చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ'లో నటిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇందులో అమీర్ ఖాన్ కూడా కనిపిస్తారని సమాచారం.
Rajinikanth, Coolie Release Date
సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. గ్రీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అగ్ర సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించబోతుందట.
Rajinikanth, Coolie Release Date
రజినీ సెంటిమెంట్ ప్రకారం, 'జైలర్' విడుదలైన ఆగస్టు 10నే 'కూలి'ని విడుదల చేయాలని సన్ పిక్చర్స్ నిర్ణయించింది. 'జైలర్' ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు `కూలీ`తో వెయ్యి కోట్లు టార్గెట్ చేసినట్టు సమాచారం.
జైలర్ 2 సినిమా
'కూలీ' తర్వాత, రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2'లో నటిస్తారు. ఈ సినిమా పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.ఇందులో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ మరోసారి కనిపించబోతున్నారు. అలాగే తెలుగు నుంచి బాలకృష్ణ కూడా కనిపిస్తారనే పుకారు ఉంది. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
read more:Venkatesh: శ్రీవిష్ణుతో వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. డైరెక్టర్, జోనర్ డిటెయిల్స్ నిజంగా క్రేజీ
also read: Rajasekhar: యంగ్ హీరోకి తండ్రిగా రాజశేఖర్.. యాంగ్రీ హీరోకి ఏమైంది? భారీ రెమ్యూనరేషన్