- Home
- Entertainment
- Rajasekhar: యంగ్ హీరోకి తండ్రిగా రాజశేఖర్.. యాంగ్రీ హీరోకి ఏమైంది? భారీ రెమ్యూనరేషన్
Rajasekhar: యంగ్ హీరోకి తండ్రిగా రాజశేఖర్.. యాంగ్రీ హీరోకి ఏమైంది? భారీ రెమ్యూనరేషన్
Rajasekhar: హీరో రాజశేఖర్ సినిమాలు రావడం లేదు. దీంతో క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాలో బలమైన పాత్రలో కనిపించబోతున్నారట రాజశేఖర్.

Rajasekhar
Rajasekhar Father Role: తెలుగులో యాంగ్రీ యంగ్ మేన్‌గా పేరుతెచ్చుకున్నారు హీరో రాజశేఖర్. ఆయన సినిమాలు, ఆయన పాత్రలు అప్పట్లో ఆవేశంగా ఉండేవి. ఆయన ఎక్కువగా సీరియస్‌గా కనిపించేవారు. అందుకే ఆయనకు ఆ ట్యాగ్ ఇచ్చారు.
ఇటీవల హీరోగా ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఆదరణ పొందలేకపోతున్నాయి. దీంతో గ్యాప్ తీసుకుంటున్నారు రాజశేఖర్. బలమైన పాత్రలు వస్తే ఇతర హీరోల సినిమాల్లోనూ నటించేందుకు రెడీ అవుతున్నారు.
Rajasekhar
గతేడాది నితిన్‌తో `ఎక్ట్సా ఆర్డినరీమ్యాన్` సినిమాలో కీలక పాత్రలో నటించారు. పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించారు. యాక్షన్‌తోపాటు తనదైన కామెడీతో అలరించారు. కానీ సినిమా ఆడకపోవడంతో ఆయనకు మళ్లీ గ్యాప్ వచ్చింది. అలాంటి సాహసం చేయలేదు. ఇప్పుడు మరో యంగ్ హీరోతో సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారట. అయితే హీరోకి తండ్రి పాత్రలో రాజశేఖర్ కనిపిస్తుండటం విశేషం.
Sharwanand
యంగ్ హీరో శర్వానంద్ సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో ఆయనకు తండ్రి పాత్రలో కనిపిస్తారట. `మా నాన్న సూపర్ హీరో` సినిమాని రూపొందించిన అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
రేసింగ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా ఉంటుందని, ఇందులో రాజశేఖర్ పాత్ర చాలా స్టయిలీష్‌గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకి `జానీ` అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. అదే కంటిన్యూ చేస్తారా? టైటిల్ మారుస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
sharwanand, rajasekhar
ఇదిలా ఉంటే ఇందులో రాజశేఖర్ తండ్రి పాత్ర చేయడానికి భారీగా పారీతోషికం డిమాండ్ చేస్తున్నారట. పాత్ర డిమాండ్ మేరకు నిర్మాతలు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యారట. రాజశేఖర్‌కిది మంచి కమ్ బ్యాక్ అయ్యే మూవీ అవుతుందని సమాచారం.
ఇటీవల కాలంలో అటు శర్వానంద్‌కి, ఇటు రాజశేఖర్‌కి హిట్లు లేవు, సినిమాలు కూడా సరిగా చేయడం లేదు. ఈ క్రమంలో ఇద్దరికీ ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.
Rajasekhar, jeevitha
రాజశేఖర్‌కి హీరోగా సినిమాలు రావడం లేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. దీంతో ఇలా క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అయ్యారని సమాచారం. మరి ఇలానే కంటిన్యూ చేస్తారా? మళ్లీ హీరోగా సినిమాలు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగారు రాజశేఖర్. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబులకు దీటుగా సినిమాలు చేశారు.
అదే స్థాయిలో స్టార్ డమ్ పొందారు. ఆయన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద అదే రేంజ్‌లో వసూళ్లని రాబట్టాయి. కానీ గత పదిహేనేళ్ల నుంచి ఆయనకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సినిమాలు ఆడకపోవడంతో మరింత డౌన్ అయ్యారు రాజశేఖర్. ఇప్పుడు మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ రకంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్నారని చెప్పొచ్చు.
read more:
also read: