- Home
- Entertainment
- `కూలీ` అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్.. రజనీకాంత్ సినిమా ఓవర్సీస్‌లో ఎంత వసూలు చేసిందో తెలిస్తే మతిపోవాల్సిందే
`కూలీ` అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్.. రజనీకాంత్ సినిమా ఓవర్సీస్‌లో ఎంత వసూలు చేసిందో తెలిస్తే మతిపోవాల్సిందే
రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా ప్రీ-బుకింగ్స్ ఓవర్సీస్‌లో ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

`కూలీ` సినిమా ప్రీ-బుకింగ్ కలెక్షన్లు
రజనీకాంత్ 'కూలీ' ఆగస్టు 14న విడుదల కానుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, షోభిన్ షాకీర్, సత్యరాజ్, రెబా మోనికా జాన్, మోనిషా బ్లెస్సీ నటించారు. అమీర్ ఖాన్, పూజా హెగ్డే అతిధి పాత్రల్లో కనిపించనున్నారు.
నాలుగు వందలకోట్ల బడ్జెట్‌తో `కూలీ`
రూ.350 కోట్ల నుంచి 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మితమైంది. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది. 'కూలీ డిస్కో', 'మోనికా', 'పవర్‌హౌస్' పాటలు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. మాస్ ఆడియెన్స్ లో మంచి ఊపుని తీసుకొచ్చాయి.
ఆగస్ట్ 2న `కూలీ` ట్రైలర్
`కూలీ` సినిమా ట్రైలర్ డేట్ వచ్చింది. ఆగస్ట్ 2న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. కానీ ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ ఉంది. భారీ కాస్టింగ్ కావడం, పైగా లోకేష్ కనగరాజ్ మూవీ కావడం, ఆయన రజనీకాంత్‌తో తొలి సారి చేస్తున్న చిత్రం కావడంతో మంచి హైప్ ఉంది.
ఈ చిత్రం గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. దర్శకుడు లోకేష్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇది ఇప్పుడు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపుతున్న `కూలీ`
ఓవర్సీస్‌లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సమాచారం. 'కూలీ' విడుదలకు ముందే కోట్లలో వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టిస్తుందని అంచనా.
ఇప్పటివరకు ఏ సినిమా సాధించని వసూళ్ల రికార్డును ఈ చిత్రం బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్‌లోనే కాదు, ఇండియన్ మూవీస్‌లోనూ ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ని రాబడుతుందని అంటున్నారు.
కాకపోతే ఈ చిత్రానికి `వార్ 2` పెద్ద దెబ్బ కొట్టబోతుందని చెప్పొచ్చు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

