MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `హరి హర వీరమల్లు` ఆర్టిస్ట్ ల పారితోషికాలు.. పవన్‌, నిధి అగర్వాల్‌, బాబీ డియోల్‌ ఎంత తీసుకున్నారంటే?

`హరి హర వీరమల్లు` ఆర్టిస్ట్ ల పారితోషికాలు.. పవన్‌, నిధి అగర్వాల్‌, బాబీ డియోల్‌ ఎంత తీసుకున్నారంటే?

`హరి హర వీరమల్లు` సినిమా మొదటి వీకెండ్‌ పూర్తి చేసుకుని వీక్‌ డేస్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో సినిమాలో ఆర్టిస్ట్ ల పారితోషికాల వివరాలు తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 29 2025, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొఘల్‌ చక్రవర్తి ఔరంగేజ్‌ ఆగడాల నేపథ్యంలో `హరి హర వీరమల్లు`
Image Credit : Asianet News

మొఘల్‌ చక్రవర్తి ఔరంగేజ్‌ ఆగడాల నేపథ్యంలో `హరి హర వీరమల్లు`

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన `హరి హర వీరమల్లు` మూవీ విజయవంతంగా రన్‌ అవుతుంది. 17వ శతాబ్దంలోని మొఘల్‌ పాలన నేపథ్యంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ ఆగడాలను ప్రధానంగా చేసుకుని కొహినూర్‌ వజ్రం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాని రూపొందించారు. 

నిజానికి ఈ మూవీని స్టార్‌ చేసింది దర్శకుడు క్రిష్‌. ఆయనే కొంత పార్ట్ షూటింగ్‌ చేశారు. కానీ ఆయన మధ్యలోనే తప్పుకున్నారు. సినిమా షూటింగ్‌ డిలే కావడంతోపాటు కొంత క్రియేటివ్‌ డిఫరెంట్స్ కారణంగానూ ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది.

DID YOU
KNOW
?
పవన్‌ కళ్యాణ్‌కి జీరో పారితోషికం
`హరి హర వీరమల్లు` సినిమాకి పవన్‌ తీసుకున్న పారితోషికం జీరో. సినిమా హిట్‌ అయితేనే ఆయనకు రెమ్యూనరేషన్‌ అందుకుంటారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సినిమాని పూర్తి చేసే బాధ్యతలు తీసుకున్న జ్యోతికృష్ణ
Image Credit : Facebook / Mega Surya Production

సినిమాని పూర్తి చేసే బాధ్యతలు తీసుకున్న జ్యోతికృష్ణ

ఇక సినిమా ఆగిపోయిందనుకునే సమయంలో ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ సినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. 

షూటింగ్‌ పూర్తి చేసి విడుదల చేశారు. సినిమా డిలే కావడం వల్ల బజ్‌ తగ్గింది. కానీ చివర్లో పవన్‌ కళ్యాణ్‌ తన భుజాలపై వేసుకున్నారు. గట్టిగా ప్రమోషన్‌ చేశారు. 

దీంతో దెబ్బకి మూవీ రేంజ్‌ మారిపోయింది. అది ఓపెనింగ్ కలెక్షన్లపై ప్రభావం చూపింది. పవన్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా `హరి హర వీరమల్లు` నిలిచింది.

35
`హరి హర వీరమల్లు` పవన్‌ కళ్యాణ్‌ పారితోషికం
Image Credit : X/Mega Surya Production

`హరి హర వీరమల్లు` పవన్‌ కళ్యాణ్‌ పారితోషికం

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి పారితోషికాల డిటెయిల్స్ బయటకు వచ్చాయి. మెయిన్‌గా ఆర్టిస్ట్ ల పారితోషికాలు ఎంతనేది చూస్తే, కాస్టింగ్‌ కి తక్కువ పారితోషికాలే ఇచ్చినట్టు తెలుస్తోంది. 

సాధారణంగా పాన్‌ ఇండియా చిత్రాలకు సంబంధించి హీరోలకే భారీగా రెమ్యూనరేషన్‌ ఉంటుంది. ఒక్కో హీరో వంద కోట్లకుపైగా తీసుకుంటారు.

కానీ ఇందులో పవన్‌ కళ్యాణ్‌ చాలా తక్కువగా తీసుకున్నారట. `బ్రో` సినిమాకి పవన్‌ యాభై కోట్లు తీసుకున్నట్టు సమాచారం.

45
పారితోషికం వదులుకున్న పవన్‌ కళ్యాణ్‌
Image Credit : Facebook /Mega Surya Production

పారితోషికం వదులుకున్న పవన్‌ కళ్యాణ్‌

కానీ `హరి హర వీరమల్లు` మూవీకి కేవలం రూ.20కోట్లు మాత్రమే కోట్‌ చేశారట. అయితే అందులో ఆయనకు ఎనిమిది కోట్ల వరకు అడ్వాన్స్ గా ఇచ్చారట. అది కూడా నిర్మాతకు రిటర్న్ చేసినట్టు సమాచారం. 

ఈ లెక్కన ఈ మూవీకి పవన్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇటీవల ప్రెస్‌ మీట్‌లో పవన్‌ మాట్లాడుతూ, సినిమా హిట్‌ అయితేనే పారితోషికం అని అన్నారు. 

ఆయన మాటలను బట్టి చూస్తే, ఈ సినిమాకి పవన్‌ ఫ్రీగానే పనిచేశారని చెప్పొచ్చు. అంతేకాదు ఇప్పుడు రిజల్ట్ ని, కలెక్షన్లని చూస్తుంటే పవన్‌ కి పారితోషికం దక్కుతుందా అనేది డౌటే.

55
`హరి హర వీరమల్లు` ఇతర కాస్టింగ్‌ రెమ్యూనరేషన్‌
Image Credit : X/@MegaSuryaProd

`హరి హర వీరమల్లు` ఇతర కాస్టింగ్‌ రెమ్యూనరేషన్‌

పవన్‌ కళ్యాణ్‌ని పక్కన పెడితే ఇందులో బాలీవుడ్‌ నటుడు `బాబీ` డియోల్‌ కీలక పాత్ర పోషించారు. ఔరంగజేబ్‌ పాత్రలో నటించారు. ఆయన ఈ సినిమా కోసం మూడు కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. 

మరోవైపు హీరోయిన్‌గా చేసిన నిధి అగర్వాల్‌కి రెండున్నర కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు టాక్‌. మిగిలిన ఆర్టిస్ట్ లు సునీల్‌, రఘుబాబు, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సచిన్‌ ఖేడ్కర్‌ వంటి వారు కాల్షీట్లని బట్టి లక్షల్లో, వేలల్లో అందుకున్నారు. 

ఈ లెక్కన పారితోషికాల పరంగా సినిమాకి పెద్దగా బడ్జెట్‌ ఏం కాలేదు. కానీ ప్రొడక్షన్‌ పరంగానే ఎక్కువ బడ్జెట్ అయ్యిందని, ఈ మూవీ బడ్జెట్ సుమారు రూ.200కోట్లు అయి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమా వంద కోట్ల కలెక్షన్లని రాబట్టినట్టు సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Related Stories
Recommended image1
బాలకృష్ణకి చెమటలు పట్టించిన లవర్‌ బాయ్‌.. బాలనటుడేగా అని వదిలేస్తే కోలుకోలేని దెబ్బ
Recommended image2
చిరంజీవి, రాజశేఖర్ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? మెగాస్టారే రిజెక్ట్ చేశాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved