MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Rajinikanth ID Card: బస్ కండక్టర్‌ గా రజినీకాంత్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సూపర్ స్టార్ పాత ఐడీ కార్డు లో ఏముంది?

Rajinikanth ID Card: బస్ కండక్టర్‌ గా రజినీకాంత్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సూపర్ స్టార్ పాత ఐడీ కార్డు లో ఏముంది?

ఒకప్పుడు బస్ కండక్టర్‌గా జీవితం మొదలుపెట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. చేతిలో చిల్లర పట్టుకుని బస్ ఎక్కిన ఆ కుర్రాడు, ఇప్పుడు భారత సినిమాకే అతిపెద్ద ఆస్తిగా మారారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 27 2026, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్‌స్టార్ 'శివాజీ' ఫ్లాష్‌ బ్యాక్
Image Credit : X

సూపర్‌స్టార్ 'శివాజీ' ఫ్లాష్‌ బ్యాక్

సినిమా అంటే హీరో ఉండాలి, అదిరిపోయే ఎంట్రీ ఉండాలి. కానీ, ఇండియన్ సినిమా కింగ్, 'తలైవా' రజినీకాంత్ రియల్ లైఫ్ స్టోరీనే ఒక అద్భుతమైన సినిమా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పాత ఐడీ కార్డు తెగ చక్కర్లు కొడుతోంది.  అది ఎవరితో కాదు.. ఇప్పటి తమిళ సూపర్ స్టార్.. ఒకప్పటి  'బెంగళూరు కుర్రాడు' శివాజీ రావ్ గైక్వాడ్.. బీఎంటీసీ బస్ కండక్టర్‌గా పనిచేసినప్పటి గుర్తింపు కార్డు!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైరల్ అవుతున్న ఐడీ కార్డులో ఏముంది?
Image Credit : X

వైరల్ అవుతున్న ఐడీ కార్డులో ఏముంది?

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఐడీ కార్డు నిజమైనదా లేక ఏఐ (AI) సృష్టించిందా అనే చర్చ పక్కన పెడితే, అందులోని సమాచారం మాత్రం రజినీ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఆ కార్డులో రజినీకాంత్ అసలు పేరు 'శివాజీ రావ్ గైక్వాడ్' అని స్పష్టంగా రాసి ఉంది. శ్రీనగర్ డిపో, రూట్ నంబర్ 10A బస్సులో పనిచేసిన ఈ 'మాస్' కండక్టర్‌కు 1971లో నెల జీతం ఎంతో తెలుసా? కేవలం 275 రూపాయలు! ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే రజినీ, అప్పట్లో వందల కోసం టికెట్లు కొట్టేవారంటే నమ్మశక్యంగా లేదు.

35
విజిల్ వేయడంలోనూ ఓ స్టైల్!
Image Credit : Instagram

విజిల్ వేయడంలోనూ ఓ స్టైల్!

అప్పట్లో బస్సులో టికెట్లు ఇచ్చేటప్పుడు రజినీ చూపించే స్పీడ్, ఆయన వేసే విజిల్ సౌండ్, ప్రయాణికులతో మాట్లాడే స్టైల్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారట. "ముందుకు జరగండి సార్...", "చిల్లర ఇవ్వండి..." అని చెప్పడంలో కూడా ఒక సూపర్‌ స్టైల్ కనిపించేదట.  ఈ శివాజీ కేవలం బస్సులకు పరిమితం అయ్యే వ్యక్తి కాదు, ప్రపంచాన్ని ఏలేవాడని.. ఆయన ప్రాణ స్నేహితుడు, డ్రైవర్ రాజ్ బహదూర్‌కు అప్పుడే అర్థమైంది, అందుకే రజినీకాంత్ ను హీరోగా ప్రయత్నాలు చేయడాని ప్రోత్సహించాడు.

45
పాత జ్ఞాపకాల బస్సెక్కిన రజినీ...
Image Credit : stockPhoto

పాత జ్ఞాపకాల బస్సెక్కిన రజినీ...

ఈ రోజు రజినీకాంత్ ఎంత ఎత్తుకు ఎదిగినా, తన మూలాలను మాత్రం మర్చిపోలేదు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని జయనగర్ డిపోకు సడెన్‌గా వెళ్లిన రజినీ, అక్కడి కండక్టర్లు, డ్రైవర్లతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఆ క్షణంలో ఆయన సూపర్‌స్టార్ రజినీలా కాకుండా, కండక్టర్ శివాజీలా మారిపోయారు. అంతేకాదు, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'కూలీ' సినిమా పోస్టర్‌లో కండక్టర్ బ్యాడ్జ్ నంబర్ 1421 కనిపించడంతో, అది రజినీదే అని అభిమానులు కూడా సంబరపడ్డారు. కానీ ఆ తర్వాత ఆ నంబర్ దర్శకుడి తండ్రిదని తెలిసింది.

55
స్ఫూర్తికి మారుపేరుగా 'కండక్టర్'!
Image Credit : X

స్ఫూర్తికి మారుపేరుగా 'కండక్టర్'!

ఒక సాధారణ కండక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రజినీ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. చేతిలో చిల్లర పట్టుకుని బస్ ఎక్కిన ఆ కుర్రాడు, ఇప్పుడు భారత సినిమాకే ఒక పెద్ద ఆస్తి. ఈ వైరల్ ఐడీ కార్డు ఒక్క విషయాన్ని మళ్లీ నిరూపించింది - "కష్టపడితే మనిషి ఏదైనా సాధించగలడు, కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా వచ్చిన దారిని మర్చిపోకూడదు." అని.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Recommended image2
Ram Charan బాడీ గార్డ్ ఎవరు..? అతని జీతం ఎంతో తెలుసా? మెగా పవర్ స్టార్ రక్షణకు అతను ఏం చేస్తాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved