MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan బాడీ గార్డ్ ఎవరు..? అతని జీతం ఎంతో తెలుసా? మెగా పవర్ స్టార్ రక్షణకు అతను ఏం చేస్తాడంటే?

Ram Charan బాడీ గార్డ్ ఎవరు..? అతని జీతం ఎంతో తెలుసా? మెగా పవర్ స్టార్ రక్షణకు అతను ఏం చేస్తాడంటే?

బాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు.. మన సౌత్ హీరోలు కూడా బాడీగార్డుల కోసం భారీగా ఖర్చు పెడతారని మీకు తెలుసా? పాన్ ఇండియా హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాడీగార్డు ఎవరు? ఆయనకు చెర్రీ ఎంత జీతం ఇస్తున్నాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 27 2026, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రిలీజ్ కు రెడీగా ఉన్న పెద్ది సినిమా..
Image Credit : JioStudios youtube

రిలీజ్ కు రెడీగా ఉన్న పెద్ది సినిమా..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న ఈసినిమా జూన్ 04న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో..ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా నార్త్ మార్కెట్ ను ప్రభావితం చేసేందుకు అక్కడ ఎక్కువగా ఈవెంట్లను మూవీ టీమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో పాటు భోపాల్, బెంగళూరు నగరాల్లో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో రామ్ చరణ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హాట్ టాపిక్ గా రామ్ చరణ్ బాడీగార్డ్..
Image Credit : Asianet News

హాట్ టాపిక్ గా రామ్ చరణ్ బాడీగార్డ్..

ప్రమోషనల్  ఈవెంట్లలో రామ్ చరణ్ వెంట ఎప్పుడూ కనిపిస్తున్న ఓ భారీ వ్యక్తి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చరణ్‌కు రక్షణ కవచంలా కనిపిస్తున్న ఈ వ్యక్తి మరెవరో కాదు.. ఆయన కొత్త బాడీగార్డ్ కెవిన్ కుంట. సాధారణ సెక్యూరిటీ గార్డ్‌లా కాకుండా హాలీవుడ్ యాక్షన్ హీరోలా... భారీగా శారీరక దారుఢ్యం, సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపిస్తున్న కెవిన్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు.

34
గ్లోబల్ స్టార్ భద్రత కోసం అంతర్జాతీయ స్థాయి ఫైటర్‌
Image Credit : Asianet News

గ్లోబల్ స్టార్ భద్రత కోసం అంతర్జాతీయ స్థాయి ఫైటర్‌

గ్లోబల్ స్టార్ భద్రత కోసం అంతర్జాతీయ స్థాయి ఫైటర్‌ను నియమించడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, కెవిన్ కుంటకు చెల్లిస్తున్న రెమ్యూనరేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కెవిన్‌కు రోజుకు దాదాపు రూ.2 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంటే నెలకు దాదాపు రూ.60 లక్షల వరకు చెల్లిస్తున్నారన్న మాట.

44
సోషల్ మీడియాలో హల్‌చల్
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో హల్‌చల్

సినిమా ప్రమోషన్ల కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న రామ్ చరణ్ వెంట కెవిన్ ఎప్పుడూ కనిపిస్తూ ఉండటంతో, ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా కంటే ఎక్కువగా అతని వీడియోలే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సెలబ్రిటీల్లో ఇంత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునే బాడీగార్డ్స్ చాలా అరుదుగా ఉంటారని, ఇదే నిజమైతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న బాడీగార్డ్స్ జాబితాలో కెవిన్ కుంట పేరు టాప్‌లో నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Wild Card Entry: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చేది వీళ్లే.. ఇప్పుడే అసలు మజా
Recommended image2
NTR: జనాలు రాళ్ళతో కొడతారేమో అని ఎన్టీఆర్ భయం, 10 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్..
Recommended image3
Roja Selvamani: చిరంజీవి, రోజా, సురేఖ దొంగతనంగా మారువేషంలో చేసిన పనేంటో తెలుసా? వామ్మో అరాచకం
Related Stories
Recommended image1
Samantha: భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని, స్టార్ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?
Recommended image2
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved