Rajinikanth: రజినీకాంత్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన 5 చిత్రాలు
స్టార్స్ కి ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి స్టార్స్ కూడా ఫ్యాన్స్ గా ఉన్న హీరో రజినీకాంత్ (Rajinikanth). అందుకే ఆయన స్టార్స్ కే స్టార్. బాలీవుడ్ బాద్షాలు కూడా తలైవా అంటూ గొప్పగా చెప్పుకునే రేంజ్ ఆయన సొంతం. రజినీకాంత్ తన కెరీర్ లో సాధించిన విజయాలు, అందుకున్న బ్లాక్ బస్టర్స్ కి లెక్కేలేదు. క్రికెట్ లో సచిన్ ఎలాగో చిత్ర పరిశ్రమలో రజినీకాంత్ అలా.

రజినీకాంత్ అనేక గొప్ప సినిమాల్లో నటించారు. 1975లో విడుదలైన అపూర్వ రాగంగళ్ మూవీలో సపోర్టింగ్ రోల్ తో రజినీకాంత్ తన ప్రస్థానం మొదలుపెట్టి దేశంలోనే టాప్ స్టార్స్ గా ఎదిగారు. వంద కోట్ల పారితోషికం తీసుకున్న మొదటి హీరో రజినీకాంత్ అని చెప్పాలి. దేశవ్యాప్తంగా రజినీకాంత్ కి ఫ్యాన్స్ ఉన్నారు. కాగా రజినీకాంత్ కెరీర్ లో బెస్ట్ చిత్రాలుగా కొన్ని నిలిచిపోయాయి. నేడు రజినీకాంత్ తన 71వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా వాటిలో టాప్ ఫైవ్ ఏమిటో చూద్దాం.
కెరీర్ లో మొదటిసారి రజినీకాంత్ మణిరత్నం దర్శకత్వంలో దళపతి(1991) మూవీ చేశారు. మమ్ముటి మరో హీరోగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ లో వీరిద్దరూ స్నేహితులుగా నటించారు. యాక్షన్, సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన దళపతి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఏ ఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్.. మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
1995లో విడుదలైన బాషా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. సరికొత్త స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన బాషా, అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. దర్శకుడు సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజినీకాంత్ మాఫియా లీడర్ గా, ఆటో డ్రైవర్ గా రెండు భిన్నమైన రోల్స్ చేశారు. ఈ సినిమా స్పూర్తితో తెలుగులో కూడా అనేక చిత్ర్రాలు వచ్చి విజయం సాధించాయి. రజినీకాంత్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా బాషా నిలిచింది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పడయప్ప రజినీ కెరీర్ లో బెస్ట్ చిత్రాల్లో ఒకటని చెప్పవచ్చు. రజినీకాంత్ యూత్, అలాగే మిడిల్ ఏజ్ రోల్స్ చేశాడు. మిడిల్ ఏజ్ రోల్ లో ఆయన నెరిసిన గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తారు. సౌందర్య హీరోయిన్ గా నటించగా... రమ్యకృష్ణ విలన్ రోల్ చేశారు. శివాజీ గణేషన్ ఓ కీలక రోల్ చేయడం జరిగింది. కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ భారీ విజయాన్ని అందుకుంది. 1999లో విడుదలైన నరసింహ అనేక రికార్డ్స్ బద్దలు కొట్టింది.
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రజినీకాంత్ తో చేసిన చిత్రం శివాజీ. 2007లో విడుదలైన శివాజీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రజినీకాంత్ ఎన్నారై రోల్ చేశారు. అవినీతిపై తిరగబడే ఎన్నారై గా రజినీకాంత్ పవర్ ఫుల్ రోల్ చేశారు. శివాజీ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. శ్రీయా శరన్ హీరోయిన్ గా నటించారు.
ఇండియా సినిమా హిస్టరీతో అతిపెద్ద బడ్జెట్ తో తెరకెక్కిన మొదటి చిత్రం రోబో (2010). దర్శకుడు శంకర్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో రోబో తెరకెక్కించారు. రోబో చిట్టిగా, సైంటిస్ట్ వశీకర్ గా రెండు భిన్న పాత్రలు చేశాడు రజినీ. ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన రోబో... అనేక కొత్త రికార్డ్స్ నమోదు చేసింది. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. రోబోకి సీక్వెల్ గా వచ్చిన 2.0 సైతం భారీ వసూళ్లు అందుకుంది. అయితే రోబో స్థాయిలో విజయం సాధించలేదు.
Also read Rajinikanth: మొదటి చూపులోనే పడిపోయిన సూపర్ స్టార్... రజినీకాంత్ ప్రేమ వివాహం గురించి తెలుసా!