Asianet News TeluguAsianet News Telugu

Rajinikanth Birthday Special : రజనీ కాంత్ కు ఎన్ని అవార్డ్స్ వచ్చాయో తెలుసా..? రజనీ సంపాదన ఎంతుంటుంది..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంపాదన ఎంత ఉంటుంది.. ఇప్పటి వరకూ ఆయన ఎన్ని అవార్డ్స్ అందుకున్నారు. సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆ వివరాలు తెలుసుకుందాం.. 
 

ajinikanth remuneration details and luxurious and awards
Author
Hyderabad, First Published Dec 12, 2021, 3:43 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)..ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు  ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. కనిపిస్తే స్క్రీన్ చినిగిపోయేంత అభిమానం ఆయన  సొంతం. అలాంటి ఇమేజ్ ఒక్కసారైన జీవితంలో తెచ్చుకోవాలని చాలా మంది హీరోలు కలలు కంటుంటారు. ఒక్క తమిళంలోనే కాదు ఓవర్ ఆల్ ఇండియాలో ఆయన ఫ్యాన్స్ అన్ని భాషల్లో ఉన్నరు. అది రజినీ స్పెషల్.  ఏ హీరో చేయలేని సాహసం సూపర్ స్టార్ చేస్తున్నారు. 70 ఏళ్ళు దాటినా.. ఇంకా అదే ఫిట్ నెస్ తో.. అదే జోష్ తో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. రజనీ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా గా.. ఆయన ఆస్తులు.. రెమ్యూనరేషన్.. అవార్డ్స్ గురించి తెలసుకుందాం..  


చేసింది తమిళ సినిమాలే అయినా సౌత్ -నార్త్ అంతటా Rajinikanthకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. హిందీలోనూ రజినీ అంటే ఓ రెస్పెక్ట్ ఉంది. ఇక రెమ్యూనరేషన విషయానికి వస్తే.. ఇండియాలో ఏ స్టార్ అందుకోలేనంతగా.. ఈఏజ్ లో రజనీకాంత్ 100 కోట్ల వరకూ తీసుకుంటున్నట్ట తెలిసింది. అక్షయ్, ప్రభాస్ కూడా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కాని.. ఇండియాలో ఫస్ట్ 100 కోట్ల రెమ్యూనరేషన్ హీరో మాత్రం రజనీకాంతే.


ఇక ఆయన ఆస్తుల విషయానికి వస్తే.. సోషల్ మీడియా లెక్కల ప్రకారం చూస్తే 2021 వరకు రజినీకాంత్ ఆస్తులు దాదాపు 380 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సూపర్ స్టార్ కు సినిమాల నుంచి మాత్రమే ఆదాయం ఉంది. ఆయన రెగ్యూలర్ కమర్షయల్ యాడ్స్ చేయరూ... చేయడానికి ఇష్టపడరు. సినిమాల మీద వచ్చే సంపాదనతోనే సరిపెట్టుకుంటారు రజనీ. ముందు వరకూ సినిమాకు 60 కోట్ల వరకూ తీసకున్న స్టార్ హీరో.. ఆ మధ్య నుంచి సినిమాల్లో శేర్స్ తో కలుపుకుని 100 కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  
సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇంట్లో కార్లకు కొదవలేదు. ఆయన దగ్గర దాదాపు లగ్జరీ కార్లు అన్నీ ఉన్నాయి.  మొదట ప్రీమియర్ పద్మిని కారును రజినీ కొన్నాడు. అది ఇప్పటికీ  వాడుతూనే ఉన్నారు. దాంతో పాటు హోండా సివిక్, టయోటా ఇన్నోవా, BMX X5, రోల్స్ రాయల్స్ ఫాంటమ్, లిమోసైన్ కార్లు రజనీ గ్యారేజ్ లో ఉన్నాయి. వీటన్నింటి విలువ దాదాపు 25 కోట్లకు పైగానే ఉంటాయని అంచన.

Also Read : Rajendra Prasad Senapathi: ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న రాజేంద్ర ప్రసాద్.. కొత్త అవతారంలో నటకిరీటి.

 45 ఏళ్ళకు పైగా ఇండస్ట్రీలో ఉండి.. అది కూడా హీరోగా కొనసాగుతున్న రజనీకాంత్ టాలెంట్ కు దాసోహం అన్న అవార్డ్స్ ఎన్నో ఉన్నాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి  2021 లో అంటే ఈ ఏడాది అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సాధించారు ఇక 2016 పద్మ విభూషణ్, 2000 లో పద్మభూషన్ అవార్డ్స్ ను అందుకున్నారు సూపర్ స్టార్. ఇక తమిళ నాడు ప్రభుత్వం నుంచి లెక్కలేనన్ని అవార్డ్స్ ఆయన్ను వరించాయి. 2011 MGR-శివాజీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు, 2007 లో రాజ్ కపూర్  రాష్ట్ర అవార్డు,2007లో శివాజీ సినిమాకు తమిళనాడు బెస్ట్ యాక్టర్ అవార్డు,  2005లో చంద్రముఖి సినిమాకు తమిళనాడు బెస్ట్ యాక్టర్ అవార్డు,  1999 లో పడయప్పా( తెలుగు లో నరసింహా) సినిమాకు తమిళనాడు బెస్ట్ యాక్టర్ అవార్డు, 1995 లో ముత్తు సినిమాకు తమిళనాడు బెస్ట్ యాక్టర్ అవార్డు, 1989 లె తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి MGR అవార్డ్, 1984 కళైమణి తమిళనాడు రాష్ట్ర అవార్డు, 1982 లో  మూండ్రు ముగం తమిళనాడు బెస్ట్ యాక్టర్ అవార్డు ,1978 లో మలరుం తమిళనాడు బెస్ట్ యాక్టర్ అవార్డు  అందుకున్నారు రజనీకాంత్. 


ఇవి కాకుండా ఫిల్మ్ ఫేర్లు..లాంటి మరెన్నో ప్రైవేట్ అవార్డ్స్ కోకొల్లలు అందకున్నారు సూపర్ స్టార్. ఈ ఏజ్ లో కూడా కుర్ర హీరోలతో పోటీపుడతూ దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ తరం యాక్టర్లకు ఆదర్శంగా నిలిచారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios