MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajinikanth: మొదటి చూపులోనే పడిపోయిన సూపర్ స్టార్... రజినీకాంత్ ప్రేమ వివాహం గురించి తెలుసా!

Rajinikanth: మొదటి చూపులోనే పడిపోయిన సూపర్ స్టార్... రజినీకాంత్ ప్రేమ వివాహం గురించి తెలుసా!

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)... ఆ పేరు వింటే చాలు ఫ్యాన్స్ గుండెల్లో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. స్టార్ డమ్ కి కేరాఫ్ ఆఫ్ అడ్రస్, స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆయన సృష్టించిన చరిత్ర అలాంటిది మరి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 12 2021, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


ఎంత వారలైన కాంత దాసులే...  అని మహా కవులు చెప్పినట్లు.. రజినీకాంత్ కూడా... ఒక చూపులో ఫ్లాట్ అయిపోయాడు. లత రజినీకాంత్ ఆయనను తొలిచూపులోనే పడేసింది. స్టార్ హీరోగా పదుల సంఖ్యలో అందాల తారలతో ఆడిపాడిన రజినీకాంత్... ఓ సాధారణ స్టూడెంట్ అందానికి దాసోహం అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


రజినీకాంత్ లవ్ స్టోరీ కూడా సినిమాటిక్ గానే జరిగింది. ఎతిరాజ్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న లత ఓ ఇంటర్వ్యూ కోసం రజినీకాంత్ ని కలిశారు. తమ కాలేజ్ మ్యాగజైన్ లో రజినీకాంత్ పై ఆర్టికల్ రాయాలనేది లత ఉద్దేశం. లతకు చిత్ర పరిశ్రమలో బంధువులు ఉన్నారు. దానితో రజినీకాంత్ ని ఈజీగా కలిసే అవకాశం ఆమెకు దక్కింది. 


 

38

ఇంటర్వ్యూ సమయంలో రజినీకాంత్ లత పట్ల ఆకర్షితుడు అయ్యాడు. ఆమె మాటతీరు, ప్రవర్తన, అందం.. ఆయనను  కట్టిపడేశాయి. ఓ పక్క లత ప్రశ్నలకు సమాధానం చెబుతూనే... ఆమెను మనసులో ఆరాధిస్తూ ఉన్నాడు. 

48

ఇంటర్వ్యూ ముగిసే సమయానికి ఆమెను పెళ్లి చేసుకోవాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు. దీనితో వెంటనే ఆలస్యం చేయకుండా లతకు ప్రపోజ్ చేశాడు. నాకు మీరు నచ్చారు. మీకు కూడా ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం... అని ఓపెన్ గా చెప్పేశాడు.
 

58

 
రజినీకాంత్ ప్రపోజల్ కి లత షాక్ అయ్యారు. ఊహించని ఆ పరిణామంతో ఆమె నోటి వెంట మాట రాలేదు. కాసేపటికి తేరుకున్న లత రజినీకాంత్ కి సమాధానం చెప్పారు. పెద్ద వాళ్లకు అడిగి, తర్వాత నిర్ణయం చెబుతా అన్నారు. 

68


లత సమాధానం కోసం రజినీకాంత్ చాలా ఆతృతగా ఎదురు చూశారట. మొదట్లో కొంచెం సంశయించిన లత పేరెంట్స్ తర్వాత... అనుమతి ఇచ్చారట. దానితో లత రజినీకాంత్ కి విషయం చెప్పారట. దానితో సంతోషంగా రజినీకాంత్ తక్కువ వ్యవధిలోనే పెళ్ళికి ఏర్పాట్లు చేశారట. 

78

1981 ఫిబ్రవరి 26న లత మెడలో రజినీకాంత్ తాళి కట్టారు. వీరి పెళ్ళికి శ్రీవేంకటేశ్వరుడి సన్నిధి తిరుమల వేదిక కావడం విశేషం. రజినీకాంత్-లత వివాహం తిరుపతిలో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కాగా.. ఐశ్వర్య, సౌందర్య అనే పేర్లు పెట్టారు. 

Also read Pushpa: సమంత ఐటెం సాంగ్ కి బ్రహ్మానందం వర్షన్... చూస్తే మతిపోవాల్సిందే

Also read Nitya Menen:ప్రభాస్ ఇష్యూతో నిజాయితీగా ఉండకూడని నాకు అర్థమైంది... నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

88

ఓ స్టార్ హీరో భార్యగానే కాకుండా లత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లత నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించారు. అలాగే ఆమె ప్రొఫెషనల్ సింగర్ కూడా. ది ఆశ్రమ్ పేరుతో ఓ స్కూల్ స్థాపించి, దానిని సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajith Kumar: అజిత్ ఇంట మరో విషాదం.. ముందు తండ్రి తర్వాత తల్లిని కోల్పోయిన స్టార్ హీరో
Recommended image2
Toxic Movie: హాయ్, హలో చెప్పొద్దు.. 'టాక్సిక్' సెట్‌లో కియారాకు డైరెక్టర్ వింత కండిషన్!
Recommended image3
Drishyam 3: 9 రోజుల్లో 200 కోట్లు.. బాక్సాఫీస్ ను మాయచేసిన మోహన్ లాల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved