- Home
- Entertainment
- రాజేంద్రప్రసాద్ కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా?.. ఆ ఘటనతో ఇండస్ట్రీపై విరక్తి
రాజేంద్రప్రసాద్ కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా?.. ఆ ఘటనతో ఇండస్ట్రీపై విరక్తి
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ విషయాలు ఎప్పుడూ పెద్దగా చర్చకు రాలేదు. కానీ ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? సినిమాల్లోకి ఎందుకు రాలేదు?
- FB
- TW
- Linkdin
Follow Us

48ఏళ్లుగా నవ్వులు పూయిస్తున్న రాజేంద్రప్రసాద్
నటకిరీటి రాజేంద్రప్రసాద్ నేడు శనివారం తన 69వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. మాస్, యాక్షన్ సినిమాల జోరు నడుస్తున్న సమయంలో హాస్యాన్ని ఎంచుకుని అందులో సక్సెస్ అయ్యారు రాజేంద్రప్రసాద్.
బిగ్ స్టార్స్ చిరు, బాలయ్య, ఎన్టీఆర్, కృష్ణ వంటి వారికి పోటీగా కామెడీ సినిమాలు చేస్తూ రాణించారు. నటకిరీటిగా ప్రశంసలందుకున్నారు. గత 48ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్నారు రాజేంద్రప్రసాద్.
ఇప్పటికీ తన కామెడీని వదల్లేదు. ఎంతటి సీరియస్ రోల్స్ చేసినా ఎక్కడో చోట తన మార్క్ వినోదాన్ని యాడ్ చేస్తూ అలరిస్తున్నారు. ఆడియెన్స్ కి నవ్వులు పూయించడంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నారు.
వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న రాజేంద్రప్రసాద్
రాజేంద్రప్రసాద్ ఇటీవల తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వివాదాస్పద కామెంట్లతో ఆయన వార్తల్లో నిలవడం గమనార్హం. పలువురు ఆర్టిస్ట్ లపై అసభ్య పదజాలంతో కామెంట్ చేసి వివాదాల్లో ఇరుక్కున్నారు.
ఇప్పుడు వాటికి దూరంగా ఉండనున్నట్టు తెలిపారు. అయితే దీనికి కారణం తన కూతురు మరణమే అని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.
కూతురు చనిపోవడంతో రాజేంద్రప్రసాద్ కాస్త డిస్టర్బ్ అయ్యారని ఇటీవల అలీ తెలిపారు. తనపై అసభ్యపదజాలం ఉపయోగించిన నేపథ్యంలో దానికి వివరణ ఇస్తూ ఈ విషయాన్ని తెలిపారు అలీ.
రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ వివరాలు
ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుంటే. రాజేంద్రప్రసాద్, విజయ ఛాముండేశ్వరిలకు ఇద్దరు సంతానం. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు బాలాజీ ప్రసాద్. కూతురు గాయత్రి.
కూతురు ప్రేమ పెళ్లిచేసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ని ఎదురించి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయారు. దీంతో చాలా ఏళ్లు ఆమె దూరంగా ఉన్నారు. ఆ మధ్యనే దగ్గరయ్యారు. ఆ రిలేషన్ సెట్ అవుతున్న సమయంలోనే గాయత్రి కన్నుమూయడం అత్యంత విచారకరం.
ఆ తర్వాత నుంచే రాజేంద్రప్రసాద్ కాస్త డిస్టర్బ్ అయినట్టు తెలుస్తోంది. `మహానటి` వంటి పలు చిత్రాల్లో బాలనటిగా నటించిన సాయి తేజస్విని.. గాయత్రి కూతురు కావడం విశేషం.
రాజేందప్రసాద్ కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదు?
ఇదిలా ఉంటే రాజేంద్రప్రసాద్‌కి ఒక కొడుకు బాలాజీ ప్రసాద్ ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ఫారెన్‌లో సెటిల్ అయ్యారు. అయితే కొడుకుని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు రాజేంద్రప్రసాద్.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఓ మూవీని కూడా ప్రారంభించారు. నిధి ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమాని స్టార్ట్ చేశారు. రెండు మూడు షెడ్యూల్స్ కూడా షూటింగ్ చేశారు. కానీ బడ్జెట్ కారణాలతో ఆగిపోయిందట.
ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా స్టార్ట్ కాలేదు. దీంతో బాలాజీ ప్రసాద్‌కి సినిమాలపై విరక్తి కలిగిందని, ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ ఎంత చెప్పినా ఆయన వినలేదని తెలిసింది. మొత్తంగానే సినిమాలను వదిలేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది.
ఫారెన్‌లో సెటిల్ అయిన రాజేంద్రప్రసాద్ కొడుకు
ఈ సంఘటన తర్వాత ఫారెన్‌లో సెటిల్ అయ్యారు బాలాజీ ప్రసాద్. ప్రస్తుతం ఆయన ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నారట. బాగానే సంపాదిస్తున్నట్టు సమాచారం.
రాజేంద్రప్రసాద్ కూడా కొడుకు విషయంలో ఎప్పుడూ ఫోర్స్ చేయలేదని, ఆయన ఇష్టానికే వదిలేసినట్టు సమాచారం. బాలాజీకి శివ సంస్కారితో 2015లో మ్యారేజ్ జరిగింది. వీరికి ఒక కొడుకు ఉన్నట్టు సమాచారం. కొడుకు మనవడితో ఆ మధ్య తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు నటకిరీటి.
రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఈ టైమ్‌లో కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల ఆయన `షష్టిపూర్తి` చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.