- Home
- Entertainment
- రాజేంద్రప్రసాద్ ని వెంటాడుతున్న వివాదాలు.. నోరు జారి అడ్డంగా దొరికిపోయిన నటకిరీటి
రాజేంద్రప్రసాద్ ని వెంటాడుతున్న వివాదాలు.. నోరు జారి అడ్డంగా దొరికిపోయిన నటకిరీటి
తనదైన నవ్వులతో ఐదు దశాబ్దాలుగా నవ్వులు పూయించిన నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. మరి ఆయన కాంట్రవర్సీలేంటో ఓ సారి చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

నవ్వులతో నటకిరీటిగా వెలుగుతున్న రాజేంద్రప్రసాద్
నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఓ వైపు చిరంజీవి, బాలయ్య లాంటి బిగ్ స్టార్స్ మాస్ యాక్షన్ సినిమాలు చేస్తుండగా, వారికి పోటీగా కామెడీ ప్రధాన చిత్రాలు చేసి మెప్పించారు.
ఫ్యామిలీ ఎమోషన్స్ ని అంతర్జీనంగా మేళవిస్తూనే హాస్యాన్ని మెయిన్ గా చేసుకుని సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. నటకిరీటిగా పేరు తెచ్చుకున్నారు. గత ఐదు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్నారు.
కామెడీ ఇమేజ్ నుంచి వివాదాలకు కేరాఫ్‌గా రాజేంద్రప్రసాద్
హీరో అనే ట్యాగ్‌కే పరిమితం కాలేదు రాజేంద్రప్రసాద్. సమయాన్ని బట్టి, వచ్చే అవకాశాలను బట్టి తనని తాను మలుచుకుంటూ ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు, సెకండ్ లీడ్ రోల్స్ చేశారు. అందుకే ఆయన విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు.
ఇటీవల విభిన్నమైన పాత్రలు, వయసుకి తగ్గ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ మధ్య రాజేంద్రప్రసాద్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు, కాకపోతే అది వివాదాలతో కావడం గమనార్హం.
రాజేంద్రప్రసాద్ పలు ప్రెస్ మీట్లలో చేసిన కామెంట్లు వివాదాలుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో అవి పెద్ద రచ్చ అవుతున్నాయి. మరి రాజేంద్రప్రసాద్ నోరి జారి దొరికిపోయిన సందర్భాలేంటి? ఆయన ఏమన్నాడనేది చూస్తే.
`పుష్ప 2`లోని అల్లు అర్జున్‌పై రాజేంద్రప్రసాద్ కామెంట్
గతంలో ఎప్పుడూ రాజేంద్రప్రసాద్ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోలేదు. కానీ ఆ మధ్య `హరికథ` అనే వెబ్ సిరీస్ ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హీరోల లెక్కలు మారిపోయాయని, ఎర్రచందనం దొంగ వాడు హీరో అంటూ వ్యాఖ్యానించారు.
హీరోలకు మీనింగ్‌లు మారిపోయానని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి. ఆ తర్వాత మరో ప్రెస్ మీట్‌లో ఆయన వివరణ ఇచ్చారు.
బన్నీతో తనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని, ఆయన్ని అలా అనను అని, పాత్రలను ఉద్దేశించిచేసిన కామెంట్ అని, వాటిని బన్నీ పట్టించుకోరని తెలిపారు. తాను సరదాగా ఇలా మాట్లాడుతుంటానని చెప్పారు.
డేవిడ్ వార్నర్‌పై దారుణమైన పదజాలం
ఆ తర్వాత `రాబిన్‌హుడ్` ప్రెస్ మీట్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్‌పై దారుణంగా కామెంట్ చేశారు. `నితిన్, వెంకీ కలిసి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఆయన క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్పలోని మ్యానరిజం చేస్తున్నాడ`ని చెప్పి ఒక అసభ్యకరమైన పదజాలం వాడారు. అది కూడా పెద్ద వివాదం అయ్యింది. ఆ తర్వాత దానికి సారీ చెప్పారు రాజేంద్రప్రసాద్.
అలీపై నోరు జారిన రాజేందప్రసాద్.. ఇంకా ఎప్పుడూ అలా మాట్లాడనని వివరణ
అయినా రాజేంద్రప్రసాద్ నోరుజారడం ఆగలేదు. ప్రముఖ దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు నటకిరీటి. ఇందులో మాట్లాడుతూ కమెడియన్ అలీపై దారుణమైన పదజాలం వాడారు. అరే అలీ ఇటు రారా.. అని అసభ్యపదజాలం ఉపయోగించారు.
అంతేకాదు పక్కనే ఉన్న సీనియర్ నటుడు మురళీమోహన్‌పై కూడా నీకు సిగ్గుండాలి అంటూ నోరు జారారు. అయితే అలీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగడంతో అలీనే స్పందించి ఈ వ్యాఖ్యలను వివాదం చేయోద్దని, ఆయన కూతురు చనిపోయిన బాధలో ఉన్నారు, ఆ బాధలో అలా మాట్లాడుతున్నారు, దీన్ని ఇంతటితో వదిలేయాలని తెలిపారు.
ఆ తర్వాత దీనిపై వివరణ ఇచ్చారు రాజేంద్రప్సాద్. ఇంకా ఎప్పుడూ ఇలాంటి కామెంట్స్ చేయను అని, చాలా జాగ్రత్తగా, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడతానని తెలిపారు రాజేంద్రప్రసాద్.
కామెడీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం రాజేంద్రప్రసాద్‌పై ఉంది.
స్టేజ్‌పై తనదైన చమత్కారాలతో నవ్వులు పూయించే రాజేంద్రప్రసాద్ ఇలా నోరు జారి వివాదాల్లో నిలవడం విచాకరం. అయితే అది ఇటీవలే ఎక్కువగా కావడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు ఆయన కామెడీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఏదేమైనా రాజేద్రప్రసాద్ అంటే వివాదాలు కాదు, తన అద్భుతమైన నటనతో పూయించిన నవ్వులు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఆ నవ్వులు జనాలకు కావాలి. కాబట్టి రాజేంద్రప్రసాద్ ఆ ఇమేజ్‌ని కాపాడుకుంటూ హుందాగా వ్వవహరించాల్సిన అవసరం ఉంది. జులై 19(శనివారం) రాజేంద్రప్రసాద్ తన 69వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు.