MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ తో రాజశేఖర్ నటించాలనుకున్న సూపర్ హిట్ మూవీ.. చిరంజీవికి చెబితే జరిగింది ఇదే..

రాంచరణ్ తో రాజశేఖర్ నటించాలనుకున్న సూపర్ హిట్ మూవీ.. చిరంజీవికి చెబితే జరిగింది ఇదే..

యాంగ్రీ హీరో రాజశేఖర్ ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవి కి మధ్య ఉన్న విభేదాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో చాలా సందర్భాల్లో రాజశేఖర్ చిరంజీవిని విమర్శించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 17 2025, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan, Rajasekhar

Ram Charan, Rajasekhar

యాంగ్రీ హీరో రాజశేఖర్ ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవి కి మధ్య ఉన్న విభేదాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో చాలా సందర్భాల్లో రాజశేఖర్ చిరంజీవిని విమర్శించారు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ విమర్శల తో విరుచుపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో జీవిత, రాజశేఖర్ ఇద్దరూ మాట్లాడుతూ చిరంజీవి ఫ్యామిలీ ప్రవర్తించే విధానం తమకు నచ్చదని ఆరోపణలు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

అయితే మరో సందర్భంలో రాజశేఖర్ చిరంజీవి గురించి పాజిటివ్ గా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమ కుమార్తె శివాని అపోలో మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతున్న సందర్భంలో చిరంజీవి గారి సపోర్ట్ కోసం ఆయన ఇంటికి వెళ్లినట్లు రాజశేఖర్ తెలిపారు. ముందుగా చిరంజీవి గారి ఇంటికి జీవిత వెళ్ళింది. చిరంజీవి గారు చాలా బాగా రిసీవ్ చేసుకుని రాజశేఖర రాలేదా అని అడిగారట. దీంతో జీవితం వెంటనే నాకు ఫోన్ చేసి పిలిపించింది.

Related Articles

Related image1
నటిగా పనికిరాదని స్టార్ డైరెక్టర్ తీసేశాడు, ఆమెనే హీరోయిన్ గా పెట్టి మూవీని 175 డేస్ ఆడించిన మరో డైరెక్టర్
Related image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
35

చిరంజీవి గారు నన్ను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. గతంలో జరిగిన వివాదాల్లో ఇక మర్చిపోదాం, ఇక పైన హ్యాపీగా ఉందాం అని ఇద్దరం మాట్లాడుకున్నట్లు రాజశేఖర్ తెలిపారు. మా ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. తాను చిరంజీవిని మీట్ కావడంతో మీడియాలో చాలా రూమర్స్ వచ్చాయి.
 

45

అదే సమయంలో రామ్ చరణ్ ధృవ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆ తమిళ మూవీ తని ఒరువన్ చిత్రంలో అరవింద్ స్వామి పాత్ర గురించి నాకు తెలుసు. ఈ విషయాన్ని చిరంజీవి గారికి చెప్పాను. అరవింద్ స్వామి పాత్ర నాకు చాలా ఇష్టం అని చిరంజీవితో అన్నాను. అంటే నువ్వు ఎందుకు చెప్తున్నావ్.. ధృవ చిత్రంలో నటిస్తావా అని అడిగారు.  
 

55

నేను వెంటనే ధృవ చిత్రంలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాను. దీంతో చిరంజీవి గారు ధృవ చిత్ర యూనిట్ కి నా గురించి చెప్పారు. రాజశేఖర్ ఈ మూవీలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పారట. అయితే చిత్ర యూనిట్ అప్పటికే అరవింద్ స్వామిని ఫిక్స్ అయి ఉన్నారు. ఒకరోజు ధృవ టీం నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ మూవీలో అరవింద్ స్వామిని తీసుకుంటే పాత షాట్లు చాలా వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఏమీ అనుకోవద్దు అని నాతో చెప్పారు. నేను కూడా పర్వాలేదు అని అన్నట్లు రాజశేఖర్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Related Stories
Recommended image1
నటిగా పనికిరాదని స్టార్ డైరెక్టర్ తీసేశాడు, ఆమెనే హీరోయిన్ గా పెట్టి మూవీని 175 డేస్ ఆడించిన మరో డైరెక్టర్
Recommended image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved