MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నటిగా పనికిరాదని స్టార్ డైరెక్టర్ తీసేశాడు, ఆమెనే హీరోయిన్ గా పెట్టి మూవీని 175 డేస్ ఆడించిన మరో డైరెక్టర్

నటిగా పనికిరాదని స్టార్ డైరెక్టర్ తీసేశాడు, ఆమెనే హీరోయిన్ గా పెట్టి మూవీని 175 డేస్ ఆడించిన మరో డైరెక్టర్

టాలీవుడ్ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్లు నార్త్ నుంచి వచ్చిన వాళ్లే. రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా, తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు నార్త్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2025, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ileana

Ileana

టాలీవుడ్ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్లు నార్త్ నుంచి వచ్చిన వాళ్లే. రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా, తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు నార్త్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఇలియానా అయితే పోకిరి చిత్రంతో ఓవర్ నైట్ సెన్సేషన్  హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోయిన్ ఇలియానా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Ileana

Ileana

అయితే ఇలియానా టాలీవుడ్ ఎంట్రీ చాలా విచిత్రంగా జరిగింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం దేవదాసు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని కి హీరోయిన్ గా ఇలియానా నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే ఇలియానా తెలుగులో నటించాల్సిన తొలి చిత్రం దేవదాసు కాదు.
 

Related Articles

Related image1
నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
Related image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
36

దేవదాసు కంటే ముందుగానే డైరెక్టర్ తేజ ఆమెని నితిన్.. ధైర్యం చిత్రం కోసం ఎంపిక చేసుకున్నారు. ఆ మూవీలో ఇలియానా 15 రోజులు పాటు షూటింగ్ లో కూడా పాల్గొంది. కానీ ఇలియానా యాక్టింగ్ డైరెక్టర్ తేజ కి నచ్చలేదు. నటిగా ఇలియానా అన్ ఫిట్ అని ఆమెను తొలగించారు. ఇలియానా స్థానంలో రైమా సేన్ ను తీసుకున్నారు.

46

ఆ టైంలోనే వైవిఎస్ చౌదరికి ఇలియానా గురించి తెలిసింది. ఆయన కూడా తన దేవదాసు చిత్రం కోసం హీరోయిన్ వెతుకుతున్నారు. తన చిత్రంలో ఇలియానా సరిపోతుందని ఆమెను ఎంపిక చేసుకున్నారు. రామ్ పోతినేని, ఇలియానా ఇద్దరికీ ఇది తొలి చిత్రం. అప్పటికి టాలీవుడ్ లో వీళ్ళిద్దరికీ ఏమాత్రం క్రేజ్ లేదు. ఈ చిత్రాన్ని 2006 సంక్రాంతికి తీవ్రమైన పోటీలో రిలీజ్ చేశారు. దేవదాసు చిత్రంతో పాటు విక్టరీ వెంకటేష్ లక్ష్మీ మూవీ, రాఘవ లారెన్స్ స్టైల్, సిద్ధార్థ్ చుక్కల్లో చంద్రుడు చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి.
 

56

ఆ మూడు చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. కానీ దేవదాసు రిలీజ్ అవుతున్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. అయినప్పటికీ వైవిఎస్ చౌదరి మొండి ధైర్యంతో దేవదాసు చిత్రాన్ని తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. లక్ష్మి, స్టైల్ చిత్రాలకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. చుక్కల్లో చంద్రుడు చిత్రానికి ఫ్లాప్ టాక్ మొదలైంది. మొదటి నాలుగు వారాలు దేవదాసు వైపు ప్రేక్షకుల అసలు చూడలేదు. ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు పూర్తిగా పక్కకు తప్పుకుంది. అప్పటి నుంచి దేవదాసు చిత్రానికి నెమ్మదిగా పాజిటివ్ టాక్ మొదలైంది.

66
Ileana

Ileana

50 రోజుల తర్వాత లక్ష్మి స్టైల్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద స్లో అయ్యాయి. అప్పటి నుంచి దేవదాసు చిత్రం తిరుగులేకుండా 175 రోజులు ఆడింది. అసలు ఏ మాత్రం క్రేజీ లేని రామ్ పోతినేని, ఇలియానాలని పెట్టుకొని వైవిఎస్ చౌదరి చేసిన మ్యాజిక్ అది. ఈ విషయాలను ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ పోయి ఇంటర్వ్యూలో వివరించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
Recommended image2
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved