MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top 10 Heroines: టాప్‌కి దూసుకొచ్చిన రష్మిక, పడిపోయిన సాయిపల్లవి, నయనతార.. సమంత, కాజల్‌, త్రిష స్థానాలివే

Top 10 Heroines: టాప్‌కి దూసుకొచ్చిన రష్మిక, పడిపోయిన సాయిపల్లవి, నయనతార.. సమంత, కాజల్‌, త్రిష స్థానాలివే

ఓర్మాక్స్ మీడియా తాజాగా సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన టాప్‌ 10 హీరోయిన్ల జాబితాని విడుదల చేసింది. ఇందులో రష్మిక టాప్‌లోకి దూసుకొచ్చింది. నయనతార, సాయిపల్లవి పడిపోయారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 23 2026, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియన్‌ టాప్‌ 10 హీరోయిన్లు
Image Credit : Asianet News

ఇండియన్‌ టాప్‌ 10 హీరోయిన్లు

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే మోస్ట్ పాపులర్‌ హీరోలు, హీరోయిన్లకి సంబంధించిన జాబితాని విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన జాబితా వచ్చింది. ఇందులో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. రష్మిక మందన్నా ఒక్కసారిగా దూసుకొచ్చి మళ్లీ తన స్థానంలోకి వచ్చింది. ఇక సాయిపల్లవి, నయనతారలు డౌన్‌ అయ్యారు. అదే సమయంలో త్రిష, కాజల్‌, సమంత వంటి హీరోయిన్లు స్థానాలేంటి? ఎవరు టాప్‌ లో ఉన్నారు ? ఎవరు బాటమ్‌లో ఉన్నారనేది చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సమంతకి తిరుగులేదు, తనే నెంబర్‌ 1
Image Credit : instagram/@samantharuthprabhuoffl

సమంతకి తిరుగులేదు, తనే నెంబర్‌ 1

సమంత మరోసారి తన సత్తా చాటింది. తనకు తిరుగులేదనే విషయాన్ని చాటి చెప్పింది. సెప్టెంబర్‌ నెలలో కూడా ఆమె మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తనకు తిరుగే లేదని నిరూపించింది. చాలా నెలలుగా ఆమె మొదటి స్థానంలో ఉంటున్న విషయం తెలిసిందే. మధ్య ఒకటి రెండు సార్లు డౌన్‌ అయ్యింది. కానీ మళ్లీ తన స్థానాన్ని కైవసం చేసుకుంది.

సమంత చివరగా `మా ఇంటి బంగారం` చిత్రంతో విజయాన్ని అందుకుంది. ఇది దాదాపు వంద కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌ ఉంది. దీంతో మళ్లీ సినిమాలకు గ్యాప్‌ వచ్చింది. కానీ సోషల్‌ మీడియా ద్వారా మాత్రం యాక్టివ్‌గానే ఉంది సమంత.

35
నాల్గో స్థానంలోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా
Image Credit : youtube/zee telugu

నాల్గో స్థానంలోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా

రెండో స్థానంలో బాలీవుడ్‌ హీరోయిన్‌, `ఆర్‌ఆర్‌ఆర్‌` నటి అలియాభట్ ఉంది. మూడో స్థానంలో కూడా మరో బాలీవుడ్‌ నటి, `కల్కి 2898 ఏడీ` హీరోయిన్‌ దీపికా పదుకొనె ఉన్నారు. ఇక నాల్గో స్థానంలో మాత్రం నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఉండటం విశేషం. ఆమె ఆగస్ట్ నెలలో ఏడో స్థానంలో ఉండగా ఇప్పుడు మూడు స్థానాలు ఎగబాకి నాల్గో స్థానంలో సెటిల్‌ అయ్యింది.

రష్మిక మందన్నా ఇటీవల `రణబాలి`తో విజయాన్ని అందుకుంది. ఇందులో తన భర్త విజయ్‌ దేవరకొండ హీరోగా నటించాడు. దీంతోపాటు `మైసా`, `రాకా`, `ఎంఎస్‌ సుబ్బలక్ష్మి` బయోపిక్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్నా.

45
పడిపోయిన సాయిపల్లవి
Image Credit : Asianet News

పడిపోయిన సాయిపల్లవి

ఐదో స్థానంలో సాయిపల్లవి ఉంది. ఆగస్ట్ లో సాయిపల్లవి నాల్గో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక్క స్థానం పడిపోయింది. ఆమె ప్రస్తుతం `రామాయణం`లో సీతగా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయినా కూడా ఆమె స్థానం పడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే అక్టోబర్‌ లో మాత్రం పుంజుకునే అవకాశం ఉంది. ఇక ఆరో స్థానంలో కాజల్‌ ఉంది. ఆమె ఆగస్ట్ లో కూడా అదే స్థానంలో ఉంది. కాబట్టి ఈ చందమామకి మార్పు లేదు.

55
రెండు స్థానాలు డౌన్‌ అయిన లేడీ సూపర్‌ స్టార్‌
Image Credit : our own

రెండు స్థానాలు డౌన్‌ అయిన లేడీ సూపర్‌ స్టార్‌

ఏడో స్థానంలో నయనతార ఉంది. ఆమె ఆగస్ట్ లో ఐదో స్థానంలో ఉన్న లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇప్పుడు రెండు స్థానాలు పడిపోయింది. ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇక ఎనిమిదో స్థానంలో కృతి సనన్‌, తొమ్మిదో స్థానంలో త్రిష, పదో స్థానంలో కత్రినా కైఫ్‌ ఉన్నారు. శ్రీలీల మరోసారి తన స్థానాన్ని కోల్పోయింది. మొత్తంగా టాప్‌ లో హీరోయిన్లే ఒకటి రెండు స్థానాలు అటుఇటుగా మారుతున్నారు. ఇందులో సౌత్‌ భామలతోపాటు నార్త్ బ్యూటీస్‌ హవా కూడా గట్టిగానే ఉందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
రష్మిక మందన్న
త్రిష
నయనతార
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Salaar 2 Update: ప్రశాంత్‌ నీల్‌కి ప్రభాస్‌ వార్నింగ్‌.. `సలార్‌ 2` షూటింగ్‌ స్టార్ట్ అయ్యేది అప్పుడే
Recommended image2
Bigg Boss 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 7వ వారం ఓటింగ్‌.. డేంజర్‌లో ఉన్నది వీళ్లే, టాప్‌ ఎవరంటే?
Recommended image3
Jailer 2: జైలర్ 2' దెబ్బకు లియో, కూలీ రికార్డులు గల్లంతు! రజినీకాంత్ సినిమా సునామీ! '
Related Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 7వ వారం ఓటింగ్‌.. డేంజర్‌లో ఉన్నది వీళ్లే, టాప్‌ ఎవరంటే?
Recommended image2
Top 10 Heroes: దుమ్మురేపిన అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌కి మళ్లీ దెబ్బ.. ప్రభాస్‌, మహేష్‌, చరణ్‌ స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved