MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్.. స్టార్ సీనియర్ హీరో రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా మిస్ అయిన సినిమా ఏదో తెలుసా? బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని ఆయన ఎలా మిస్ అయ్యాడు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 26 2026, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ ను షేక్ చేసిన హీరో..
Image Credit : youtube/shreyas media

టాలీవుడ్ ను షేక్ చేసిన హీరో..

ఒకప్పుడు హీరోగా టాలీవుడ్ ను షేక్ చేశాడు రాజశేఖర్. ఒక వైపు ప్రేమ కథలు, మరో వైపు పోలీసు పాత్రలు, ఇంకో వైపు ఫ్యామిలీ కథలను చేస్తూ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు రాజశేఖర్. సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ.. కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెట్టారు రాజశేఖర్. హీరోగా అవకాశాలు తగ్గడంతో, ఆయన ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్ బాబు తండ్రి పాత్ర మిస్ అయిన రాజశేఖర్...
Image Credit : Asianet News

మహేష్ బాబు తండ్రి పాత్ర మిస్ అయిన రాజశేఖర్...

రాజశేఖర్ ప్రస్తుతం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ ను చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఆయన శర్వానంద్ తండ్రిగా బైకర్ సినిమాలో నటించాడు. ఈమూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజశేఖర్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఆయన వెల్లడించారు.రాజశేఖర్ మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను కాబట్టి, నాకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రేలంగి మామయ్య పాత్ర చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పటి పరిస్థితుల కారణంగా ఆ సినిమాలో నటించలేకపోయాను” అని తెలిపారు.

35
రేలంగి మామయ్య పాత్ర మిస్ అయిన మరో హీరో..
Image Credit : Seethamma Vakitlo Sirimalle Chettu

రేలంగి మామయ్య పాత్ర మిస్ అయిన మరో హీరో..

ఇప్పటికే గతంలో ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ పాత్రను ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్‌కు వినిపించానని చెప్పారు. ఆయనకు కథ నచ్చినప్పటికీ, అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఆ పాత్రను చేయలేకపోయారని తెలిపారు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రేలంగి మామయ్య పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 మహేష్ బాబు, వెంకటేష్ కు తండ్రి పాత్ర కావడం.. హీరోల తరువాత ఈ పాత్ర చుట్టే కథ నడుస్తుంటుంది. ఈ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాంటి క్యారెక్టర్ రాజశేఖర్ చేసుంటే ఎలా ఉండేదోఅని ఆడియన్స్ అనుకుంటున్నారు.

45
శర్వానంద్ తండ్రిగా రాజశేఖర్..
Image Credit : Asianet News

శర్వానంద్ తండ్రిగా రాజశేఖర్..

ప్రస్తుతం రాజశేఖర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న తాజా మూవీ బైకర్ రిలీజ్ కు రెడీగా ఉంది.శర్వానంద్ హీరోగా నటించిన ఈసినిమాలో.. బైక్ రేసర్ పాత్రలో శర్వ కనిపించనున్నారు. రాజశేఖర్ ఇందులో శర్వానంద్‌కు తండ్రిగా నటించారు. అంతే కాదు హీరోకు కోచ్ గా కూడా రాజశేఖర్ కనిపించబోతున్నారు. ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్ కు బైకర్ సిద్ధమవుతోంది. ఇటీవల ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్ ఈవెంట్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

55
శర్వానంద్ కు మరో హిట్ పడుతుందా?
Image Credit : Asianet News

శర్వానంద్ కు మరో హిట్ పడుతుందా?

ముఖ్యంగా శర్వానంద్‌కు ఈ సినిమాతో మరో హిట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శర్వానంద్ కూడా ఇదే కాన్ఫిడెంట్ ను చూపించాడు. ఈసినిమాలో శర్వానంద్ తో పాటు రాజశేఖర్ పాత్ర కూడా హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజశేఖర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Related Stories
Recommended image1
4వ తరగతి చదివిన ఏఎన్నార్.. హీరోగా మారడానికి కారణం ఎవరో తెలుసా? అక్కినేని జీవితాన్ని మార్చింది ఎవరు?
Recommended image2
Dhurandhar 2 Collection: ధరందర్ 2 దెబ్బకు పుష్ప 2 ఔట్.. ఫస్ట్ వెన్స్‌డే కలెక్షన్లలో హిస్టరీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved