MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ajith Kumar: అజిత్ ఇంట మరో విషాదం.. ముందు తండ్రి తర్వాత తల్లిని కోల్పోయిన స్టార్ హీరో

Ajith Kumar: అజిత్ ఇంట మరో విషాదం.. ముందు తండ్రి తర్వాత తల్లిని కోల్పోయిన స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని  చెన్నైలో కన్నుమూశారు. ఈ విషయం తెలియగానే అజిత్ దుబాయ్ నుంచి తిరుగుపయనమయ్యారు. రేపు చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 30 2026, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అజిత్ కుమార్ తల్లి మోహిని కన్నుమూత
Image Credit : Asianet News

అజిత్ కుమార్ తల్లి మోహిని కన్నుమూత

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఈ వార్త అజిత్ అభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహిని, ఈ ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చెన్నైకి తిరుగుపయనమైన అజిత్‌కుమార్
Image Credit : @ajithFC

చెన్నైకి తిరుగుపయనమైన అజిత్‌కుమార్

నటుడు అజిత్ ప్రస్తుతం సినిమాలతో పాటు కార్ రేసింగ్ పోటీలపై కూడా దృష్టి పెట్టారు. ఈ మధ్యే ఆయన దుబాయ్‌లో ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తల్లి మరణవార్త తెలియగానే, ఆయన వెంటనే చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యారని సమాచారం. రెండేళ్ల క్రితం తండ్రి సుబ్రమణియన్ మరణంతో అజిత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ బాధ నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరగడం వారిని మరింత కుంగదీసింది. తల్లిదండ్రులతో అజిత్‌కు ఉన్న అనుబంధం చాలా గొప్పదని, ఈ నష్టం ఆయనకు తీరని వేదనను మిగిల్చిందని సన్నిహితులు చెబుతున్నారు.

34
సినీ ప్రముఖుల సంతాపం
Image Credit : Asianet News

సినీ ప్రముఖుల సంతాపం

తమిళ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, తన కష్టంతో స్టార్ హీరోగా ఎదిగారు అజిత్. ఈరోజు ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తన విజయ ప్రస్థానంలో కుటుంబం సపోర్ట్ ఎంతో ఉందని ఆయన చాలాసార్లు చెప్పారు. మోహిని మరణవార్త తెలియగానే, సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 'అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి', 'అజిత్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి' అంటూ పోస్టులు పెడుతున్నారు.

44
రేపు చెన్నైలో అంత్యక్రియలు
Image Credit : @ajithFC

రేపు చెన్నైలో అంత్యక్రియలు

మోహిని అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ కష్ట సమయంలో అజిత్ కుటుంబానికి అండగా నిలుస్తూ, అభిమానులు, సినీ పరిశ్రమ తమ  సపోర్ట్ ను, సానుభూతిని తెలియజేస్తున్నారు. మోహిని మరణం అజిత్ కుటుంబానికే కాకుండా, ఆయనను ప్రేమించే అభిమానులకు కూడా తీరని లోటు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Recommended image2
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా
Recommended image3
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Related Stories
Recommended image1
IMDb Top Indian Stars: సీఎం విజయ్, ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన కుర్రాడు, IMDb రేటింగ్ లో నెం.1 ఎవరో తెలుసా?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved