- Home
- Entertainment
- ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ సినిమాలు కాదు.. రాజమౌళి కెరీర్ లో బెస్ట్ మూవీ అదే, సింహాద్రి తర్వాత ఇలా..
ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ సినిమాలు కాదు.. రాజమౌళి కెరీర్ లో బెస్ట్ మూవీ అదే, సింహాద్రి తర్వాత ఇలా..
రాజమౌళి తన కెరీర్ లో రూపొందించిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన బెస్ట్ మూవీ ఏదో జక్కన్న రివీల్ చేశారు. అదే విధంగా నితిన్ సై గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం జూనియర్. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్రలో నటిస్తూ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో జూనియర్ చిత్రం రూపొందింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం జూలై 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరు కావడంతో సుమ తనదైన ప్రశ్నలతో జక్కన్నని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది.
రాజమౌళి చిత్రాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు చూపిస్తూ వాటిని చూడగానే ఏమనిపిస్తుందో చెప్పాలని రాజమౌళిని అడిగారు. ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఫోటోని చూపించారు. దాని గురించి రాజమౌళి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో కూడా స్టూడెంట్ నెంబర్ 1 టైం లో తీసుకున్న ఫోటోని క్రియేట్ చేశామని రాజమౌళి గుర్తు చేస్తున్నారు.
ఆ తర్వాత ఈగ మూవీ షూటింగ్ ఫోటో చూపించారు. నా కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అని రాజమౌళి సమాధానం ఇచ్చారు. ఈ చిత్రంలో నాని, సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే. కిచ్చా సుదీప్ విలన్ గా నటించారు. ఈగని రాజమౌళి ఒక సూపర్ హీరోలా ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం.
ఆ తర్వాత సై షూటింగ్ లో కమెడియన్ వేణుమాధవ్ తో రాజమౌళి ఉన్న ఫోటోని చూపించారు. ఆ ఫోటో చూడగానే రాజమౌళి నవ్వేశారు.నా కెరీర్ లో సై ఒక స్పెషల్ మూవీ. సింహాద్రి లాంటి మాస్ మూవీ తర్వాత చేసిన చిత్రం. వరుసగా మాస్ సినిమాలే చేయాల్సిన అవసరం లేదు.. రగ్బీ లాంటి కొత్త క్రీడను పెట్టి యువతకి నచ్చేలా తెరకెక్కించిన చిత్రం అది. దర్శకుడిగా నేను చేసిన ఈ ప్రయోగం నా కెరీర్ కి బాగా ఉపయోగపడింది. మాస్ సినిమాలే కాకుండా మనకి నచ్చిన కథలతో సినిమాలు చేయొచ్చు అని ఈ చిత్రం ద్వారా తనకు తెలిసినట్లు రాజమౌళి తెలిపారు.