MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Varanasi: రెండు షాట్స్ కోసం ఆరు నెలలు మహేష్‌ బాబుకి చుక్కలు చూపించిన రాజమౌళి.. రాముడి వెనుక ఇంతటి కష్టం ఉందా?

Varanasi: రెండు షాట్స్ కోసం ఆరు నెలలు మహేష్‌ బాబుకి చుక్కలు చూపించిన రాజమౌళి.. రాముడి వెనుక ఇంతటి కష్టం ఉందా?

Varanasi: మహేష్‌ బాబు హీరోగా `వారణాసి` మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి . ఇందులో రాముడిగా కనిపించబోతున్నారు మహేష్‌. ఈ పాత్ర కోసం ఆరు నెలలు చుక్కలు చూశాడట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 04 2026, 07:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంతర్జాతీయ హంగులతో `వారణాసి`
Image Credit : youtube/@ScreenRantPlus

అంతర్జాతీయ హంగులతో `వారణాసి`

మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో `వారణాసి` సినిమాని రూపొందిస్తున్నారు. భారతీయ కథాంశానికి అంతర్జాతీయ హంగులు అద్దుతున్నారు. గ్లోబల్‌ ఆడియెన్స్ కూడా ఈ మూవీని చూసేలా ఆయన  తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక శ్రద్ధా తీసుకుంటున్నారు. దాదాపు మూడేళ్లుగా శ్రమిస్తున్నారు. బేసిక్‌గా రాజమౌళి అంటేనే పర్‌ఫెక్షన్‌. నటీనటులు అయినా, టెక్నీషియన్లు అయినా ఆయన పర్‌ఫెక్షన్‌లోకి రావాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్‌ బాబుకి చుక్కలు చూపించిన రాజమౌళి
Image Credit : youtube/@ScreenRantPlus

మహేష్‌ బాబుకి చుక్కలు చూపించిన రాజమౌళి

ఎంత పెద్ద హీరో అయినా రాజమౌళి చెప్పినట్టు చేయాల్సిందే. ఒక్కో షాట్‌కి పది ఇరవై టేక్‌లు చేయాల్సింది. దానికి ఎవరూ అతీతం కాదు. ఇప్పుడు `వారణాసి` మూవీ విషయంలో కూడా అదే జరుగుతుంది. కేవలం రెండు షాట్స్ కోసం మహేష్‌ బాబుకి ఆరు నెలలు చుక్కలు చూపించాడట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్‌ బాబునే వెల్లడించడం విశేషం. సినిమాలో కొంత రామాయణం పార్ట్ ని చూపిస్తున్నారు రాజమౌళి. ఈ విషయాన్ని టైటిల్‌ని ప్రకటించినప్పుడే తెలిపారు. లంక దాహనం ప్రధానంగా ఈ ఎపిసోడ్‌ ఉంటుందని ఆ టీజర్‌ చూసినప్పుడు అర్థమయ్యింది.

Related Articles

Related image1
MaheshBabu ప్రియాంక చోప్రాకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? గ్లోబల్‌ బ్యూటీని ఆడుకున్న సూపర్‌ స్టార్‌
Related image2
Top 5 Heroines: అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు.. రష్మిక మందన్నా అడ్రస్సే లేదు
35
రాముడి లుక్‌ కోసం మహేష్‌ కి ప్రత్యేక శిక్షణ
Image Credit : Asianet News

రాముడి లుక్‌ కోసం మహేష్‌ కి ప్రత్యేక శిక్షణ

అయితే రాముడి పాత్ర అన్నప్పుడు దానికో రూపు, పద్ధతి ఉంటుంది. రాముడు నిల్చునే తీరు, నడిచే తీరు, మాట్లాడే తీరు ఇలా ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుంది. రాజులా ప్రవర్తించాల్సి ఉంటుంది. హందాతనం ఉండాలి, గాంభీర్యతా ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. ఓర్పు, సహనం, సేవాగుణం ఇలా ప్రతిదీ బాడీలో, ఫేస్‌లో ప్రతిబింబించాల్సి ఉంటుంది. ఓ రకంగా మోస్ట్‌ ఛాలెంజింగ్‌ రోల్‌ అని చెప్పొచ్చు. ఈ పాత్ర కోసం మహేష్‌ బాబు ఏకంగా ఆరు నెలలు కష్టపడాల్సి వచ్చిందట. కేవలం రెండు షాట్స్ కోసం ఆరు నెలలు ట్రైన్‌ అయ్యాడట. అందులో మూడు నెలలు పురాతన యుద్ధ కళ కళారి ని నేర్చుకున్నాడట. ఇదంతా రాముడిగా నిలబడటం కోసమే అని చెప్పారు మహేష్‌. అలాగే రాముడు ఎలా రన్‌ చేస్తారనేదానికి ఆరు నెలలుగా ట్రైనింగ్‌ కావాల్సి వచ్చిందని చెప్పాడు. ఇంత కష్టపడితే కేవలం రెండు షాట్స్ మాత్రమే తీసినట్టు తెలిపారు మహేష్‌.

45
మహేష్ కి ఝలక్‌ ఇచ్చిన రాజమౌళి
Image Credit : youtube/@ColliderInterviews

మహేష్ కి ఝలక్‌ ఇచ్చిన రాజమౌళి

ఈ సందర్భంగా మరో క్రేజీ విషయాన్ని వెల్లడించారు మహేష్‌. సినిమా సెట్‌ అయ్యే సమయంలో మహేష్‌, రాజమౌళి మధ్య జరిగిన కన్వర్జేషన్‌ని ఆయన లీక్‌ చేశారు. సినిమా చేయడానికి ఫస్ట్ మీట్‌ అయ్యాక రాజమౌళి కి మహేష్‌ ఒక సందేశం పెట్టాడు. `మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు మీ హీరోలను ఎంతగానో ప్రేమిస్తారు`అని మెసేజ్‌ పెడితే, ఆయన క్రేజీ రియాక్షన్‌ ఇచ్చారట. ఈ సందేశానికి ఆయన థ్యాంక్స్ చెబుతూ, కానీ నేను నా విలన్లని ఎక్కువగా ప్రేమిస్తానని తెలిపారట. దెబ్బకి మహేష్‌కి ఫ్యూజులు ఎగిరిపోయాయట. 

55
గ్లోబ్‌ ట్రోటర్‌, టైమ్‌ ట్రోటర్‌గా `వారణాసి`
Image Credit : youtube/varanasi movie

గ్లోబ్‌ ట్రోటర్‌, టైమ్‌ ట్రోటర్‌గా `వారణాసి`

మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ `వారణాసి`. రాజమౌళి  రూపొందిస్తున్న ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతుంది. గ్లోబ్‌ ట్రోటర్‌గా, టైమ్‌ ట్రోటర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారు. అదే సమయంలో రామాణయం కాలంలోకి కూడా వెళ్తాడని సమాచారం. ఇలా అనేక కాలాలు తిరిగి  చేసే సాహసమే ఈ మూవీని అని తెలుస్తోంది. ఇందులో మహేష్‌ రుద్ర అనే పాత్రలో ప్రియాంక మందాకిని పాత్రలో, పృథ్వీరాజ్‌ కుంభ పాత్రలో నటిస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. సుమారు రూ.1300కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 9న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై రాజమౌళి స్పందించారు. ఒకే పార్ట్ గా వస్తుందని, నిడివి మూడు గంటలు ఉంటుందని చెప్పారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
MaheshBabu ప్రియాంక చోప్రాకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? గ్లోబల్‌ బ్యూటీని ఆడుకున్న సూపర్‌ స్టార్‌
Recommended image2
Top 5 Heroines: అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు.. రష్మిక మందన్నా అడ్రస్సే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved