MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top 5 Heroines: అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు.. రష్మిక మందన్నా అడ్రస్సే లేదు

Top 5 Heroines: అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు.. రష్మిక మందన్నా అడ్రస్సే లేదు

Top 5 Heroines: ఒకప్పుడు హీరోయిన్లకి తక్కువ పారితోషికాలు ఉండేవి, కానీ ఇప్పుడు హీరోలకు మించి తీసుకుంటున్నారు స్టార్‌ హీరోయిన్లు. అందులో భాగంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్‌ 5 బ్యూటీస్‌ ఎవరో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 04 2026, 09:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు
Image Credit : Asianet News

అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు

పారితోషికం విషయంలో హీరోలదే అగ్రస్థానం. వారు ఇప్పుడు వందల కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. కానీ హీరోయిన్లకి ఆ స్థాయిలో ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం తామూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. హీరోలకు మించిన రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ల లిస్ట్ చూస్తే, అందులో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా లేకపోవడం గమనార్హం.

27
ప్రియాంక చోప్రా రూ.30కోట్లు
Image Credit : instagram/priyanka chopra

ప్రియాంక చోప్రా రూ.30కోట్లు

ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాప్‌లో ఉన్నారు. ఆమె ప్రస్తుతం తెలుగులో `వారణాసి` చిత్రంలో నటిస్తోంది. ఇందులో మందాకిని పాత్రలో కనిపించబోతుంది. చాలా పవర్‌ఫుల్‌ రోల్‌ లో ప్రియాంక మెరవబోతుంది. అయితే ఈ చిత్రానికి ఆమె పారితోషికం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఆమెకి ఏకంగా రూ.30కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారట రాజమౌళి. దీంతో ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది ప్రియాంక.

Related Articles

Related image1
Rajasekhar: నేనేమీ శ్రీరామచంద్రుడిని కాదు, కొన్ని తప్పులు చేశా, జీవిత ముందే ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Related image2
Nandamuri Heroes Net Worth: నందమూరి హీరోలకు మతిపోయే ఆస్తులు.. ఎన్టీఆర్‌ కి బాలయ్య ఝలక్‌
37
దీపికా రూ.25కోట్లు
Image Credit : youtube/brut india

దీపికా రూ.25కోట్లు

ఆ తర్వాత దీపికా పదుకొనె నిలిచింది. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌ హీరోయిన్‌గా దీపికా రాణిస్తుంది. ఆమె ఇటీవల `కల్కి 2`, `స్పిరిట్‌` నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్‌ లాంటి బిగ్‌ స్టార్‌ కే ఝలక్‌ ఇచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో `ఏఏ22`లో నటిస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాకిగానూ దీపిక ఏకంగా రూ.25కోట్లు డిమాండ్‌ చేస్తుందని సమాచారం.

47
అలియా భట్‌ రూ.25కోట్లు
Image Credit : Instagram

అలియా భట్‌ రూ.25కోట్లు

అలాగే దీపిక స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మరో హీరోయిన్‌ అలియా భట్‌. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో సీతగా మెరిసిన ఆమె ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయడం లేదు. కానీ బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ప్రస్తుతం అలియా కూడా ఒక్కో మూవీకి రూ.20-25కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం.

57
నయనతార రూ.15-18కోట్లు
Image Credit : Nayanthara\Instagram

నయనతార రూ.15-18కోట్లు

వీరితోపాటు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఆమె ఇటీవల `మన శంకర వరప్రసాద్‌ గారు` మూవీలో మెరిసింది. దీనికి సుమారు రూ.6కోట్లు తీసుకుందట. కానీ యష్‌తో `టాక్సిక్` చిత్రంలో మెరుస్తుంది. గ్యాంగ్ స్టర్ కథతో రూపొందే ఈ చిత్రం కోసం నయనతార ఏకంగా రూ.15-18కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం.

67
కియారా అద్వానీ రూ.15కోట్లు
Image Credit : instagram@Kiara Advani

కియారా అద్వానీ రూ.15కోట్లు

అత్యధిక పారితోషికం తీసుకునే టాప్‌ 5 హీరోయిన్ల జాబితాలో కియారా అద్వానీ కూడా ఉంది. ఆమె ఇప్పుడు `టాక్సిక్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో రుక్మిణి, నయనతార వంటి కథానాయికలు కూడా నటిస్తున్నారు. అయినా ఈ చిత్రానికిగానూ కియారా ఏకంగారూ.15కోట్లు పారితోషికంగా తీసుకుంటుందట. ఇందులో హీరోయిన్లకి గట్టిగానే పారితోషికం ఇస్తున్నారు. సినిమా కూడా అదే స్థాయిలో భారీగా రూపొందుతుంది.

77
టాప్‌ 5 లిస్ట్ లో లేని రష్మిక మందన్నా
Image Credit : Getty

టాప్‌ 5 లిస్ట్ లో లేని రష్మిక మందన్నా

సాయిపల్లవి ప్రస్తుతం `రామాయణ` చిత్రంలో నటిస్తుంది. రెండు భాగాలుగా వస్తోన్న ఈ మూవీకిగానూ ఆమె రూ.15కోట్లు తీసుకుంటుందట. అయితే నేషనల్‌ క్రష్‌గా రాణిస్తున్న రష్మిక మందన్నా మాత్రం ఈ లిస్ట్ లో లేకపోవడం గమనార్హం. ఆమె ఒక్కో మూవీకి ఐదు నుంచి రూ.8కోట్ల మధ్యలోనే పారితోషికం తీసుకుంటుంది. మరీ పెద్ద సినిమా అయితే పది కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మిక మందన్న
నయనతార
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీకి ఎదురు తిరిగిన సుగుణమ్మ, ఇక బాలు కొడుకుగా చింటూ
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాశీని ఇంట్లో నుంచి పోరా అన్న స్వప్న- జ్యోకు పారు వార్నింగ్
Recommended image3
బాలకృష్ణ తన భార్యతో ఏ విషయంలో తిట్లు తింటాడో తెలుసా? బాలయ్య చెప్పిన టాప్ సీక్రెట్?
Related Stories
Recommended image1
Rajasekhar: నేనేమీ శ్రీరామచంద్రుడిని కాదు, కొన్ని తప్పులు చేశా, జీవిత ముందే ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Nandamuri Heroes Net Worth: నందమూరి హీరోలకు మతిపోయే ఆస్తులు.. ఎన్టీఆర్‌ కి బాలయ్య ఝలక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved