- Home
- Entertainment
- రాజమౌళి కన్నీళ్లు పెట్టిన ఏకైక సందర్భం, కీరవాణి చేసిన పనికి ఏడుపు ఆపుకోలేక పోయిన జక్కన్న
రాజమౌళి కన్నీళ్లు పెట్టిన ఏకైక సందర్భం, కీరవాణి చేసిన పనికి ఏడుపు ఆపుకోలేక పోయిన జక్కన్న
ఏ పరిస్థితుల్లో అయినా చాలా ధైర్యంగా ఉంటారు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. వందల కోట్లు సంపాదిస్తున్న సింపుల్ గా, హుందాగా కనిపిస్తారు. అయితే జీవితంలో రాజమౌళి కన్నీళ్లు పెట్టిన అరుదైన సందర్భం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అందుకు కారణం ఎవరు?

తిరుగులేని దర్శకుడు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి. టాలీవుడ్ స్థాయిని బాలీవుడ్ బార్డర్ దాటించి, హాలీవుడ్ వరకూ తీసుకెళ్లిన దర్శకుడు జక్కన్న. స్టార్ హీరోలతో మాత్రమే కాదు, చిన్న హీరోలతో కూడా సక్సెస్ ఫుల్ సినిమాలు చేయగలడు అని నిరూపించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ ను కూడా సాధించి చూపించారు. తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, చూడటానికి మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తారు. ఎవరితో అయినా సరే హుందాగా నడుచుకుంటారు.
వందల కోట్ల ఆదాయం, సింపుల్ లైఫ్ స్టైల్
వేల కోట్ల ప్రాజెక్ట్స్ ను డీల్ చేస్తున్న వ్యక్తిగా చాలా గుండెదైర్యం ఉంటుంది రాజమౌళికి. ఎప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఎమోషనల్ గా ఎప్పుడూ లూజ్ అవ్వరు జక్కన్న. అటువంటి వ్యక్తి కన్నీళ్ళు పెట్టిన సందర్భం ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? అది కూడా జక్కన్న ఎంతగానో ప్రేమించి, అభిమానించి, గౌరవించే తన అన్న కీరవాణి వల్ల ఆయన ఏడ్చారంటే నమ్మేవిధంగా ఉందా? కానీ అది నిజం. కీరవాణి చేసిన ఓపని రాజమౌళి చేత కన్నీళ్లు పెట్టించింది.
రాజమౌళి మనసు బాధపడ్డ సందర్భం
రాజమౌళి ఇన్ని విజయాలు సాధించారంటే.. ఆయన వెనకాలు చాలామంది కృషి ఉంది. మరీ ముఖ్యంగా జక్కన్న సక్సెస్ వెనుక నిలిచిన స్థిరమైన సంగీత శక్తి ఎం.ఎం. కీరవాణి. రాజమౌళి ప్రతీ సినిమాకు ఆయన అన్న కీరవాణి మాత్రమే మ్యూజిక్ ఇస్తారు. జక్కన్న మనసు తెలుసుకుని, ఆయనకు తగ్గట్టుగా ట్యూన్స్ ఇవ్వడం కీరవాణికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పటి వరకూ రాజమౌళి చేసిన సినిమాలన్నింటికి కీరవాణి మాత్రమే మ్యూజిక్ చేస్తూ వచ్చారు. అయితే ఒక సందర్భంలో మాత్రం కీరవాణి మ్యూజిక్ నుంచి రిటైర్ అవుదామని అనుకున్నారు. అది ఎప్పుడో కాదు బాహుబలి సిరీస్ సినిమాల తరువాత కీరవాణి ఫీల్డ్ నుంచి తప్పుకోవాలి అనుకున్నారు. ఈ విషయం రాజమౌళిని ఎంతో బాధపెట్టింది.
రాజమౌళి కన్నీళ్లు పెట్టిన రోజు
అంతే కాదు బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీరవాణి తన రిటైర్మెంట్ గురించి ప్రకటన కూడా చేశారు. అప్పుడు జరిగిన ఓ ఎమోషనల్ సీన్ తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ రోజున కీరవాణి, ఈ సినిమా తరువాత సంగీతానికి వీడ్కోలు చెబుతున్నట్టు ప్రకటించారు. “ఇది నా చివరి సినిమా” అని ఆయన అనడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. అప్పుడే కీరవాణి తన తమ్ముడు రాజమౌళి గురించి ఓ పాట కంపోజ్ చేసి, ఎమోషనల్ గా పాడారు. కీరవాణి తన పాటలో రాజమౌళిపై ప్రశంసలు గుప్పించగా, రాజమౌళి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
నిర్ణయం మార్చుకున్న కీరవాణి
స్టూడెంట్ నెం.1 నుంచీ ఇప్పటి వరకు తన ప్రతీ సినిమాకూ కీరవాణినే సంగీత దర్శకుడిగా ఎంచుకుంటూ వచ్చారు రాజమౌళి. ఇది కీరవాణిపై ఆయన నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది. కీరవాణి రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన తర్వాత, రాజమౌళి బాగా ఎమోషనల్ అయ్యారు. ఆయన ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. “ఇన్నేళ్లు కలిసి పనిచేశాం, ఇకమీదట సినిమాలు చేయకపోతే ఎలా?” అని రాజమౌళి చాలా బాధపడ్డారు. కానీ ఆతరువాత ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ.. కొద్ది రోజుల తర్వాత కీరవాణి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
టాలీవుడ్ కు ఆస్కార్ సాధించిన రాజమౌళి
కీరవాణి అలా తన నిర్ణయం వెనక్కి తీసుకోవడం వల్లే RRR కు ఆస్కార్ తీసుకురాగలిగారు. బాహుబలి తరువాత ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి స్వయంగా కీరవాణిని రిక్వెస్ట్ చేశారట. ఆర్ఆర్ఆర్ కు కూడా మ్యూజిక్ చేయాలని అడిగారట. ఇక RRR లో కీరవాణి కంపోజ్ చేసిన “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో, టాలీవుడ్ జెండా హాలీవుడ్ వేదికగా ఆస్కార్ లో ఎగిరిగింది. తెలుగు సినిమా సత్తాఏంటో అందరికి అర్ధం అయ్యింది. ఇలా కీరవాణి చేసిన పనికి రాజమౌళి మొదటిసారి ఎమెషనల్ అయ్యి కన్నీరు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు రాజమౌళి. ఈసారి భారీ ప్లానింగ్ లో ఉన్నాడు జక్కన్న.