సౌందర్య తో వెంకటేష్ రొమాన్స్.. షాక్ ఇచ్చిన రామానాయుడు.. ఏం చేశాడంటే?
టాలీవుడ్ లో వెంకటేష్, సౌందర్య జంటగా ఎన్నో సినిమాలు వచ్చాయి.స్క్రీన్ పై వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక టైమ్ లో ఈ ఇద్దరు స్టార్స్ పెళ్లి చేసుకోబోతునర్నారన్న రూమర్స్ వైరల్ అయ్యాయి. అప్పుడు రామానాయుడు ఏం చేశాడంటే?

రీమేక్ సినిమాల రారాజు
విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో అన్న పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు నాలుగు స్తంభాల్లా నిలిచిన చిరంజీవి, బాలయ్య, నాగార్జున తో పాటు వెంకటేష్ కూడా మెయిన్ పిల్లర్ గా ఉన్నాడు. అంతే కాదు టాలీవుడ్ లో రీమేక్ సినిమాల రారాజుగా వెంకటేష్ కు స్పెషల్ మార్క్ ఉంది. వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలలో ఎక్కువగా రీమేక్ చేసినవే ఉండేవి. మరీ ముఖ్యంగా తమిళంలో భాగ్యరాజా చేసిన ప్రతి సినిమాని తెలుగులో రీమేక్ చేసి, వెంకటేష్ సూపర్ సక్సెస్ ని సాధించాడు.
టాలీవుడ్ విక్టరీ స్టార్
రీమేక్ సినిమాలు చేసినా సరే.. వెంకటేష్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుందని ఆడియన్స్ నమ్మేవారు. అందువల్లే అతని సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించేవారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ సినిమాను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. టాలీవుడ్ మేకర్స్ కూడా వెంకటేష్ తో సినిమా చేస్తే మినిమం గ్యారంటి ఉంటుంది అని నమ్మేవారు. దాంతో మంచి కథ దొరికితే వెంకటేష్ తో సినిమా చేయడానికి మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపించేవారు.
వెంకటేష్ జంటగా సౌందర్య
వెంకటేష్ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన జతగా ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ సౌందర్య మాత్రమే. ఈ ఇద్దరి పెయిర్ కు సిల్వర్ స్క్రీన్ పై భారీగా డిమాండ్ ఉండేది. వెంకటేష్ జంటగా సౌంరద్య నటిస్తుందంటే ఆసినిమా మినిమమ్ గ్యారెంటీ ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాను తప్పకుండా ఆధరించేవారు. వీరిద్దరు కలిసి ఇప్పటి వరకు చాలా సినిమాల్లో సందడి చేశారు. వల్గారిటీ లేకుండా వీళ్లిద్దరి మధ్య సెన్సిటీవ్ రొమాన్స్, సాంగ్స్, సీన్స్ ను చిత్రీకరించేవారు మేకర్స్. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా చూడటానికి కంఫర్ట్ గా ఉండేది.
సౌందర్య, వెంకటేష్ పై రూమర్స్
అయితే వెంకటేష్ సినిమాల్లో ఎక్కువగా సౌందర్య కనిపించడం, వీరిద్దరు కొన్ని సినిమాల్లో భార్య భర్తలుగా నటించడంతో, ఈ ఇద్దరు స్టార్స్ మధ్య మంచి స్నేహం ఉండేది. కానీ ఆడియన్స్ లో మాత్రం చాలా మందికి వీరు నిజంగా భార్య భర్తల్లా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వీరు పెళ్లి చేసుకున్నారన్న రూమర్స్ కూడా బయటకు వచ్చాయి. జంట చూడముచ్చటగా ఉంది అని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కామెంట్స్ చేసేవారు. ఇలా వెంకటేష్–సౌందర్యల మధ్య రకరకాల గాసిప్స్ పుట్టించారు.
రంగంలోకి దిగిన రామానాయుడు
ఈ రూమర్లు జనం మధ్య పెరుగుతుండటంతో, ఈ వ్యవహారం వెంకటేష్ తండ్రి, స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు దగ్గరకు వెళ్లింది. ఇక ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. అప్పటికే వెంకటేష్‌కు ఫ్యామిలీ హీరో అనే ముద్ర ఉండటంతో.. ఇలాంటి గాసిప్స్ అతని కెరీర్‌కు నష్టం కలిగించే అవకాశం ఉందని ఆయన భావించారు. అందువల్ల, ఈ రూమర్లకు చెక్ పెట్టేలా ఒక ప్లాన్ ను అమలు చేశారు రామానాయుడు. అప్పట్లో వెంకటేష్, సౌందర్య కలిసి నటిస్తున్న సినిమా సెట్‌లో సౌందర్యతో వెంకటేష్‌కు రాఖీ కట్టించించారు రామానాయుడు.
రూమర్లకు చెక్ పెట్టిన సంఘటన
ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం కేవలం స్నేహం మాత్రమేనని, రూమర్లు వస్తున్నట్టుగా ఎటువంటి ప్రేమ లేదని నిరూపించాలనే ఉద్దేశంతో ఆయన ఈ పని చేశారని తెలుస్తోంది. దీంతో ఆడియన్స్ లో ఉన్న అపోహలను తొలగించాలని నిర్మాత అలా చేశారట. ఈ సంఘటన అనంతరం వెంకటేష్–సౌందర్య ఇద్దరూ తమ తమ సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే ఇలా సౌందర్య వెంకటేష్ కు రాఖీ కట్టారన్న విషయం ఎవరూ అఫీషియల్ గా చెప్పకపోయినా.. అప్పట్లో టాలీవుడ్ లో ఈ న్యూస్ వైరల్ అయ్యింది.
ప్రమాదంలో మరణించిన సౌందర్య
ఇక రూమర్ల సంగతికిక పక్కన పెడితే.. ఈ విషయంలో వెంకటేష్ కానీ, సౌంరద్య కాని ఎప్పుడు స్పందించలేదు. ఆతరువాత కాలంలో ఈ గాసిప్స్ నెమ్మదిగా తగ్గిపోయినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక సౌందర్య 2004లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో విషాదకరంగా మరణించగా, టాలీవుడ్ లో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. మహానటి సావిత్రి తరువాత అంతటి పేరు తెచ్చుకున్నారు సౌందర్య. కానీ సావిత్రి మాదిరిగానే చిన్న వయస్సులోనే కన్నుమూశారు. వెంకటేష్ మాత్రం ఇప్పటికీ కుటుంబ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. సౌందర్య మరణంతో తన బెస్ట్ ఫ్రెండ్ ను కోల్పోయిన సందర్భంలో.. బోరున విలపించారు వెంకటేష్.