MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఇద్దరినీ ఫిదా చేసిన స్టార్.. ముగ్గురు హీరోలలో ఎవ్వరూ అతడిని మ్యాచ్ చేయలేదు

రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఇద్దరినీ ఫిదా చేసిన స్టార్.. ముగ్గురు హీరోలలో ఎవ్వరూ అతడిని మ్యాచ్ చేయలేదు

రాజమౌళికి తాను దర్శకత్వం వహించిన చిత్రాలలో బాగా ఇష్టమైన చిత్రం మర్యాద రామన్న అని పలు సందర్భాల్లో తెలిపారు. అయితే రాజమౌళికి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఇద్దరికీ బాగా ఇష్టమైన చిత్రం ఒకటి ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 01 2025, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పరాజయం లేని దర్శకుడు  
Image Credit : Asianet News

పరాజయం లేని దర్శకుడు  

దర్శక ధీరుడు రాజమౌళి తన తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చివరగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ వరకు అన్నీ విజయాలే సాధించారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీపై కనీ వినీ ఎరుగని అంచనాలు నెలకొన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమౌళికి ఇష్టమైన చిత్రం
Image Credit : our own

రాజమౌళికి ఇష్టమైన చిత్రం

రాజమౌళికి తాను దర్శకత్వం వహించిన చిత్రాలలో బాగా ఇష్టమైన చిత్రం మర్యాద రామన్న అని పలు సందర్భాల్లో తెలిపారు. అయితే రాజమౌళికి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఇద్దరికీ బాగా ఇష్టమైన చిత్రం ఒకటి ఉంది. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర చిత్రాలలో మీకు ఇష్టమైన చిత్రం ఏది అని యాంకర్ ప్రశ్నించారు.

35
విక్రమార్కుడు మూవీ
Image Credit : our own

విక్రమార్కుడు మూవీ

రాజమౌళి బదులిస్తూ చాలా టఫ్ క్వశ్చన్ అని అన్నారు. ఏదైనా ఒక చిత్రం పేరు మాత్రమే చెప్పాలి అని యాంకర్ కోరడంతో రాజమౌళి వెంటనే విక్రమార్కుడు అని చెప్పారు. విక్రమార్కుడు మూవీ గురించి రాజమౌళి చాలా సందర్భాల్లో కామెంట్ చేశారు. ఆ మూవీ ఫస్టాఫ్ రవితేజ సినిమా అయితే సెకండ్ హాఫ్ తన సినిమా అని రాజమౌళి ఇంటర్వ్యూలో తెలిపారు.

45
అతడి టాలెంట్ ని ఎవరూ మ్యాచ్ చేయలేదు
Image Credit : our own

అతడి టాలెంట్ ని ఎవరూ మ్యాచ్ చేయలేదు

విజయేంద్రప్రసాద్ కూడా ఓ సందర్భంలో విక్రమార్కుడు మూవీ గురించి చెబుతూ.. విక్రమార్కుడు చిత్రాన్ని చాలా భాషల్లో రీమేక్ చేశారు. తమిళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో నేను విక్రమార్కుడు రీమేక్ చిత్రాలను చూశా. తమిళంలో కార్తీ, కన్నడలో కిచ్చా సుదీప్, హిందీలో అక్షయ్ కుమార్ నటించారు. కానీ ఎవ్వరూ రవితేజ టాలెంట్ ని మ్యాచ్ చేయలేకపోయారు అని ప్రశంసలు కురిపించారు. విక్రమార్కుడు మూవీ అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

55
అది చాలు, ఏ అవార్డు అవసరం లేదు
Image Credit : our own

అది చాలు, ఏ అవార్డు అవసరం లేదు

రవితేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విక్రమార్కుడు మూవీలో ఆడవాళ్ళతో గొడవపడే కామెడీ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో నటించేటప్పుడు చుట్టూ 200 మంది సెట్ లో ఉన్నారు. సీన్ అయిపోయినప్పటికీ రాజమౌళి కట్ చెప్పడం లేదు. మైక్ కింద పడేసి పగలబడి నవ్వుతున్నాడు. సెట్ లో ఉన్న 200 మంది నవ్వుతూనే ఉన్నారు. అది చాలు నాకు..ఏ అవార్డు అవసరం లేదు అని రవితేజ తెలిపారు. కిక్ చిత్రంలోని పాత్రని, విక్రమార్కుడు మూవీలోని విక్రమ్ రాథోడ్ పాత్రని కలిపి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని రవితేజ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు అరుదైన గౌరవం.. పోస్టల్ స్టాంప్ రిలీజ్
Recommended image2
kayadu lohar: కయాదు లోహర్ పేరులో ఇంత అర్థం ఉందా? జెన్ జీ బ్యూటీలో మైథాలజీ యాంగిల్
Recommended image3
Mahaveer Karna First Look: పౌరాణిక యోధుడిగా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ ఎలా ఉంది, రిలీజ్ ఎప్పుడంటే?
Related Stories
Recommended image1
పద్మ అవార్డు తెచ్చుకోవడం నాకు 2 నిమిషాల పని..చిరంజీవి, బాలయ్యపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్
Recommended image2
బతకాలని కూడా లేదు అంటూ అభిమాని ఎమోషనల్, రష్మిక మందన్న ఇచ్చిన సమాధానం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved