MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పద్మ అవార్డు తెచ్చుకోవడం నాకు 2 నిమిషాల పని..చిరంజీవి, బాలయ్యపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

పద్మ అవార్డు తెచ్చుకోవడం నాకు 2 నిమిషాల పని..చిరంజీవి, బాలయ్యపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పద్మ అవార్డుల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 01 2025, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కామెడీ చిత్రాల రారాజు
Image Credit : Asianet News

కామెడీ చిత్రాల రారాజు

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి పరిచయం అవసరం లేదు. రాజేంద్ర ప్రసాద్ తెలుగులో 80,90 దశకాలలో కామెడీ చిత్రాల రారాజుగా వెలుగొందారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. హాస్యం పండించడంలో రాజేంద్రప్రసాద్ కి ప్రత్యేకమైన శైలి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
షష్టిపూర్తి మూవీ
Image Credit : Asianet News

షష్టిపూర్తి మూవీ

రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా నటించిన చిత్రం షష్టిపూర్తి. అలనాటి నటి అర్చనతో కలిసి ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఇటీవల మే 30న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయనకి పద్మ అవార్డుల గురించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

36
పద్మ అవార్డు ఇంకా ఎందుకు రాలేదు ? 
Image Credit : our own

పద్మ అవార్డు ఇంకా ఎందుకు రాలేదు ? 

మీకు సమకాలీకులైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పద్మ అవార్డులు పొందారు. మీ తర్వాత వచ్చిన వాళ్లకు కూడా కొంతమందికి పద్మ అవార్డులు దక్కాయి. కానీ మీకు మాత్రం ఇంతవరకు పద్మ అవార్డు రాలేదు.. కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి రాజేంద్రప్రసాద్ సమాధానం ఇస్తూ తానెప్పుడు పద్మా అవార్డుల గురించి ఆలోచించలేదని అన్నారు. అవార్డు రాలేదని బాధపడింది కూడా లేదని అన్నారు. ఒకవేళ పద్మ అవార్డులు పొందిన వారి కంటే నేను టాలెంటెడ్ కాదేమో? వాళ్లకు ఉన్న అర్హత నాకు లేదేమో? అని అంటే నా అభిమానులు ఊరుకోరు.

46
అవార్డు తెచ్చుకోవడం 2 నిమిషాల పని 
Image Credit : our own

అవార్డు తెచ్చుకోవడం 2 నిమిషాల పని 

పద్మా అవార్డు ఇవ్వకపోవడానికి స్పష్టమైన కారణం నాకు కూడా తెలియదు. అవార్డు దక్కించుకోవడంలో నేను వెనకబడిపోయానేమో. మీ అందరికీ తెలుసు.. పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్లి పద్మ అవార్డు ఇవ్వమని అడిగితే ఏమవుతుంది? జస్ట్ రెండు నిమిషాలు పని అంతే.. వెంటనే పద్మ అవార్డు వచ్చేస్తుంది. కానీ నేను ఆ పని చేయలేదు. నేను ఎప్పుడూ ఎవరిని నాకు ఇది కావాలి అని కానీ, ఇది ఇవ్వండి అని కానీ అడిగింది లేదు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

56
రాజేంద్ర ప్రసాద్ కి పీవీ నరసింహారావు అభిమాని
Image Credit : our own

రాజేంద్ర ప్రసాద్ కి పీవీ నరసింహారావు అభిమాని

రాజేంద్రప్రసాద్ కి పీవీ నరసింహారావు పెద్ద అభిమాని అని అప్పట్లో చెప్పేవారు. ఇంట్లో కంచం ఉండాలి, మంచం ఉండాలి, రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా ఉండాలి అని పీవీ నరసింహారావు చెప్పినట్లు రాజేంద్రప్రసాద్ చాలా సందర్భాల్లో గుర్తు చేస్తున్నారు. మీకు ఇంకా పద్మ అవార్డు రాలేదా? అని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆశ్చర్యపోతూ తనని అడుగుతుంటారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

66
స్టార్ డమ్ ఊరికే రాదు 
Image Credit : our own

స్టార్ డమ్ ఊరికే రాదు 

చిరంజీవి, బాలకృష్ణ క్రేజ్ గురించి రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊరికే స్టార్లు అయిపోయారు. ఈరోజుకీ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే వాతావరణం ఎలా ఉంటుందో చూడండి. బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంటే కూడా అదే పరిస్థితి ఉంటుంది. బాలయ్య అఖండ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అప్పట్లో చంద్రమోహన్ తో కానీ రాజేంద్ర ప్రసాద్ తో కానీ హీరోయిన్ గా నటిస్తే వాళ్ళకి స్టార్ డమ్ గ్యారెంటీ అని చెప్పేవారు. అది నిజమే అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నాతో నటించిన 30 మంది పైగా హీరోయిన్లు మంచి పొజిషన్ కి వెళ్లారని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Related Stories
Recommended image1
విడాకుల తర్వాత తొలిసారి కలిసిన ధనుష్, ఐశ్వర్య.. కొడుకు కోసం ఇలా, రజనీ కామెంట్ హైలైట్
Recommended image2
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల వల్ల హైదరాబాద్ కి ఇన్ని ప్రయోజనాలా, రూపురేఖలు మారిపోతాయా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved