MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Korean Kanakaraju Day 6 Collections: కొరియన్‌ కనకరాజుకి ఊహించని వసూళ్లు.. 6వ రోజు ఎంత వచ్చాయంటే?

Korean Kanakaraju Day 6 Collections: కొరియన్‌ కనకరాజుకి ఊహించని వసూళ్లు.. 6వ రోజు ఎంత వచ్చాయంటే?

Korean Kanakaraju Day 6 Collections: మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ నటించిన `కొరియన్‌ కనకరాజు` మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లతో రన్‌ అవుతుంది. వీక్‌ డేస్‌లో కూడా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. మరి ఆరో రోజు దీనికి ఎంత వచ్చిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 13 2026, 07:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొరియన్‌ కనకరాజు బాక్సాఫీసు రిపోర్ట్
Image Credit : X/@UV_Creations

కొరియన్‌ కనకరాజు బాక్సాఫీసు రిపోర్ట్

వరుణ్‌ తేజ్‌, రితిక నాయక్‌ జంటగా, సత్య, సునీల్‌, మురళీధర్‌ గౌడ్‌ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన మూవీ `కొరియన్‌ కనకరాజు`. సత్య కామెడీ హైలైట్‌గా సాగిన ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కింది. కామెడీ, హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఈ నెల 7న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొరియన్‌ కనకరాజు 6వ రోజు వసూళ్లు
Image Credit : X/@UV_Creations

కొరియన్‌ కనకరాజు 6వ రోజు వసూళ్లు

`కొరియన్‌ కనకరాజు` మూవీ ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఆరో రోజు దీనికి రూ.1.70కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఐదో రోజుతో పోల్చితే 17శాతం డ్రాప్‌ కనిపిస్తుంది. అయినా వసూళ్లు స్టడీగా ఉన్నాయని చెప్పొచ్చు. వీక్‌ డేస్‌లో ఈ మూవీకి ఈ స్థాయిలో ఉండటం విశేషమనే చెప్పాలి. అయితే వరుణ్‌ తేజ్‌ మూవీకి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వచ్చింది. మంచి రివ్యూస్‌ వచ్చాయి. పాజిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. కానీ మొదటి వారంలోనే ఇంతటి భారీగా డ్రాప్‌ కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా వంద కోట్ల దిశగా వెళ్తుందని భావించారు. కానీ చూడబోతుంటే, యాభై కోట్ల వద్దే ఆగిపోయేలా ఉంది.

Related Articles

Related image1
Politician Kids Turn Hero: హీరోలుగా కేటీఆర్‌, సంతోష్‌ కుమార్‌, బండ్ల గణేష్‌ వారసులు.. భారీ ప్లాన్
Related image2
Irumudi Trailer Review: కూతురి కోసం తండ్రి ఆరాటం, అసలు కథ ఇదే, ఇరుముడి ట్రైలర్‌ ఎలా ఉందంటే?
34
కొరియన్‌ కనకరాజు టోటల్‌ కలెక్షన్లు
Image Credit : X/@UV_Creations

కొరియన్‌ కనకరాజు టోటల్‌ కలెక్షన్లు

ఇక `కొరియన్‌ కనకరాజు`కి ఇప్పటి వరకు ఎంత వచ్చాయనేది చూస్తే, సాక్నిల్క్ లెక్కల ప్రకారం రూ.25.54కోట్ల గ్రాస్‌ సాధించింది. ఇందులో ఇండియాలో రూ.21కోట్ల గ్రాస్‌, రూ.18.22కోట్ల నెట్‌ వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ.4.60కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ ముప్పై కోట్లు కూడా దాటలేదు. ఇతర ట్రేడ్‌ సైట్ల లెక్కల ప్రకారం మరో మూడు కోట్లు అదనంగా చూపిస్తున్నాయి. అంటే రూ.28కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిందని చెప్పొచ్చు.

44
లాభాల్లో రన్‌ అవుతున్న వరుణ్‌ తేజ్‌ సినిమా
Image Credit : X/@UV_Creations

లాభాల్లో రన్‌ అవుతున్న వరుణ్‌ తేజ్‌ సినిమా

ఈ సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.38కోట్లు, ఇప్పటి వరకు నాన్‌ థియేట్రికల్ గా రూ.26కోట్లు వచ్చాయి. దీంతో రూ.12కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ తో విడుదలైన ఈ మూవీకి ఇప్పటికే సుమారు రూ.14కోట్ల షేర్‌ వచ్చింది. సినిమా లాభాల్లోకి వెళ్లిపోయింది. సోమవారం నుంచి వస్తోన్న కలెక్షన్లు అన్నీ లాభాలే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.37కోట్లు కలెక్ట్ చేసినట్టు టీమ్‌ ప్రకటించింది. వారి లెక్కల ప్రకారం ఇది ఇప్పటి వరకు సుమారు రూ.45కోట్ల వరకు రాబట్టి ఉంటుందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: కృష్ణం రాజు, మురళీ మోహన్ అసలైన హీరోలు.. చిరంజీవి సైడ్ క్యారెక్టర్, కానీ ఏం జరిగిందో తెలుసా
Recommended image2
Missing Meghana: శ్రోతల్ని కట్టిపడేస్తున్న పిల్ల పిల్ల సాంగ్‌.. మిస్సింగ్‌ మేఘన నుంచి అదిరిపోయే పాట
Recommended image3
Rukmini Vasanth: యశ్, ఎన్టీఆర్ తర్వాత రుక్మిణి వసంత్‌ క్రేజీ ప్రాజెక్ట్స్... కన్నడ బ్యూటీ రచ్చ వేరే లెవల్‌
Related Stories
Recommended image1
Politician Kids Turn Hero: హీరోలుగా కేటీఆర్‌, సంతోష్‌ కుమార్‌, బండ్ల గణేష్‌ వారసులు.. భారీ ప్లాన్
Recommended image2
Irumudi Trailer Review: కూతురి కోసం తండ్రి ఆరాటం, అసలు కథ ఇదే, ఇరుముడి ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved