MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raja Babu: 20 ఏళ్లలో 500కు పైగా సినిమాలు, కోట్ల ఆస్తి సంపాదించి 45 ఏళ్లకే మరణించిన స్టార్ కమెడియన్.. రాజబాబు జీవితంలో ఇంత విషాదం ఉందా?

Raja Babu: 20 ఏళ్లలో 500కు పైగా సినిమాలు, కోట్ల ఆస్తి సంపాదించి 45 ఏళ్లకే మరణించిన స్టార్ కమెడియన్.. రాజబాబు జీవితంలో ఇంత విషాదం ఉందా?

Raja Babu: చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి.. దాదాపు 20 ఏళ్ల పాటు స్టార్ హీరోలను మించిన ఇమేజ్‌తో దూసుకుపోయారు స్టార్ కమెడియన్ రాజబాబు. కోట్ల ఆస్తి సంపాదించినా.. అది అనుభవించకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 02 2026, 08:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరోలతో సమానంగా ఇమేజ్‌..
Image Credit : Asianet News

హీరోలతో సమానంగా ఇమేజ్‌..

తెలుగు చలనచిత్ర రంగాన దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో, ప్రత్యేకమైన మేనరిజమ్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మహానటుడు రాజబాబు. కేవలం ఆయన తెరపై కనిపిస్తేనే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూసేవి. హాస్యానికి ఒక కొత్త నిర్వచనాన్ని చెప్తూ, హీరోలతో సమానంగా ఇమేజ్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా అందుకొని "హాస్య నట చక్రవర్తి"గా నిలిచారు. ఆ కాలంలోనే కోట్ల ఆస్తులను సంపాదించి, లగ్జరీ లైఫ్‌ను గడిపారు. అయితే అంత ఆస్తి సంపాదించినా.. ఎక్కువ కాలం అనుభవించలేకపోయారు రాజబాబు. చాలా చిన్న వయసులోనే కన్నుమూశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తొలి అడుగు ఎలా పడింది?
Image Credit : Asianet News

తొలి అడుగు ఎలా పడింది?

రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. గోదావరి జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన, విద్యార్థి దశలోనే నాటకాలపై ఎంతో మక్కువ చూపేవారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్సు చేసి, కొన్ని రోజుల పాటు తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం కూడా చేశారు. అయితే, నాటకాల్లో ఆయన ప్రదర్శనను చూసి ప్రభావితులైన ప్రముఖ దర్శకుడు గరికపాటి రాజారావు సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించడంతో, 1960 ప్రాంతంలో.. ఇంట్లో చెప్పకుండా మద్రాసు (చెన్నై) బాట పట్టారు.

మద్రాసులో ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రాజబాబు, దర్శకుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేట్ పాఠాలు చెప్తూ జీవనం సాగించారు. అదే సమయంలో 1960లో 'సమాజం' చిత్రంతో నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

35
స్టార్ హీరోలను మించిన ఇమేజ్.. రమాప్రభతో కాంబినేషన్:
Image Credit : Asianet News

స్టార్ హీరోలను మించిన ఇమేజ్.. రమాప్రభతో కాంబినేషన్:

మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన రాజబాబుకి 'అంతస్తులు' చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాల్లో రాజబాబు ఉండాల్సిందే. అప్పటికే రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం లాంటి స్టార్ కమెడియన్స్ ఉన్నా.. రాజబాబు మాత్రం తన ప్రత్యేక శైలితో ఇండస్ట్రీపై తన మార్క్ చూపించుకున్నారు.

అంతేకాదు, రాజబాబు-రమాప్రభల కాంబినేషన్ తెలుగు వెండితెరపై ఒక సంచలనం. వీరిద్దరి హాస్య జోడీ తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు వేసేవారు. 'ఇల్లు ఇల్లాలి', 'ప్రేమనగర్', 'అడవి రాముడు', 'కార్తీక దీపం' వంటి వందలాది చిత్రాలు ఈ జోడీని తిరుగులేని విజయతీరాలకు చేర్చాయి. ఒక సినిమా కోసం హీరో, హీరోయిన్ల డేట్స్ తీసుకోగానే.. రాజబాబు, రమాప్రభల డేట్స్ కూడా వెంటనే తీసుకునేవారట. అంతలా వీరి డిమాండ్ ఉండేది. దాదాపు 16 ఏళ్ల పాటు 100కు పైగా సినిమాల్లో హాస్య జంటగా అలరించారు రాజబాబు, రమాప్రభ.

45
కోట్ల ఆస్తి.. లగ్జరీ లైఫ్:
Image Credit : Asianet News

కోట్ల ఆస్తి.. లగ్జరీ లైఫ్:

₹350 తో మొదలైన రాజబాబు జీవితం.. లక్షల్లో పారితోషికం వరకూ వెళ్లింది. ఫారెన్ కార్లు, కోట్లు విలువ చేసే బంగ్లాలు, భూములు.. ఇలా చాలా ఆస్తులను రాజబాబు సంపాదించారు. ఆ రోజుల్లోనే శివాజీ గణేషన్ కారును లక్ష రూపాయలకు పైగా పెట్టి కొన్నారట రాజబాబు. ఎంత సంపాదించారో.. అంత ఖర్చు కూడా పెట్టేవారు. అంతేకాదు రాజబాబులో దానగుణం ఎక్కువ.. చేతికి ఎముక లేదన్నంతగా దానం చేసేవారు.

ప్రతి ఏటా తన పుట్టినరోజున సీనియర్ నటులను సన్మానించడంతో పాటు షూటింగ్స్‌లో పనిచేసే కార్మికులకు బట్టలు పెట్టేవారు. ఓ సేవా సంస్థను కూడా స్థాపించిన రాజబాబు.. కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారు. రాజమండ్రిలో మునిసిపల్ కార్మికుల కోసం ఓ కాలనీ నిర్మించారు. తన భార్య పేరు మీద ఓ ఆడిటోరియం కూడా నిర్మించారు. కార్మికులు సాయం అని వస్తే కాదనకుండా డబ్బు ఇచ్చేవారట.

55
అవార్డుల రికార్డు:
Image Credit : Asianet News

అవార్డుల రికార్డు:

వెండితెరపై నవ్వించే రాజబాబు తన నటనా జీవితంలో ఏకంగా 9 ఫిలింఫేర్ అవార్డులు గెలిచారు. అంతేకాదు, వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్ సాధించి రికార్డు సృష్టించారు. 3 నంది అవార్డులతో పాటు ఎన్నో బిరుదులు సాధించారు. దాదాపు 580కి పైగా చిత్రాల్లో నటించి, తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన హాస్యనటుడిగా నిలిచారు.

ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. చిన్న వయసులోనే మహాకవి శ్రీశ్రీ మేనకోడలిని పెళ్లాడారు. వారికి ఇద్దరు కొడుకులు నాగేంద్రబాబు, మహేష్ బాబు.

రాజబాబు మరణం వెనుక కారణం:

రాజబాబు జీవిత చరమాంకంలో ఆర్థికంగా కుంగిపోయి, దీనావస్థలో మరణించారనే అపోహలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆయన మరణించే నాటికి హైదరాబాద్, చెన్నైతో పాటు సొంత ఊరిలో కూడా దాదాపు ₹30 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నాయన్నారు. రాజబాబును వదిలేసి ఆయన భార్య పిల్లలతో అమెరికా వెళ్లిపోయారు. వారు అక్కడే చదువుకుని సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్నారు. అయితే రాజబాబు గొంతు క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతుండటంతో.. దాసరి నారాయణ రావు ఆయన్ను హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడే ఉంచి చూసుకున్నారని అంటారు. నటుడిగా ఎంతో స్టార్‌డమ్ చూసిన రాజబాబు.. క్యాన్సర్ కారణంగా 45 ఏళ్ల అతి చిన్న వయసులోనే 1983 లో కన్నుమూశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
October Movie Releases: అక్టోబర్ బిగ్ బాక్స్ ఆఫీస్ వార్.. రజినీ, విజయ్ దేవరకొండ, అజయ్ దేవగన్ రేసులో నిలిచేది ఎవరు?
Recommended image2
Tatvam Movie Review: తత్వం మూవీ రివ్యూ.. నయా మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Don't Trouble The Trouble Review: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ మూవీ రివ్యూ.. రాజమౌళి సమర్పించిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
SPB: మోహన్ బాబు మూవీలో బూతు పాట పాడమని ఎస్పీబీపై ఒత్తిడి, రాఘవేంద్రరావు ముఖం మీదే బాలు ఏం చెప్పాడంటే?
Recommended image2
Chiranjeevi: కోకాపేటలో కోట్లు విలువ చేసే భూమి.. చిరంజీవి చెల్లెళ్లకు ఇస్తానంటే భార్య సురేఖ ఏమన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved