MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Don't Trouble The Trouble Review: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ మూవీ రివ్యూ.. రాజమౌళి సమర్పించిన మూవీ ఎలా ఉందంటే?

Don't Trouble The Trouble Review: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ మూవీ రివ్యూ.. రాజమౌళి సమర్పించిన మూవీ ఎలా ఉందంటే?

ఫహద్ ఫాజిల్‌ హీరోగా, రాజమౌళి సమర్పణలో, కార్తికేయ నిర్మించిన `డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌` మూవీ నేడు విడుదలైంది. మరి సినిమా వెండితెరపై మ్యాజిక్‌ చేసిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

4 Min read
Author : Aithagoni Raju
Published : Oct 02 2026, 06:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ మూవీ రివ్యూ
Image Credit : X/@SBbySSK

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ మూవీ రివ్యూ

దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో రూపొందిన చిత్రం `డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌`. ఆయన కుమారుడు కార్తీకేయ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రమిది. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్‌ బిజినెస్‌ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో `పుష్ప` విలన్‌ ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా నటించగా, సారా పలేకర్‌, మహేష్‌ మంజ్రేకర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. శశాంక్‌ ఏలేటి దర్శకత్వం వహించారు. ఈ మూవీపై అటు మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా ఉందన్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ ఎన్టీఆర్‌ మాట్లాడి అంచనాలను పెంచారు. పైగా రాజమౌళి సమర్పణలో వస్తోన్న మూవీ కావడంతో అంచనాలు నెలకొన్నాయి. మరి నేడు శుక్రవారం(అక్టోబర్‌ 2)న విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? కార్తికేయ నిర్మాతగా సక్సెస్‌ అయ్యాడా? ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా చేసిన తెలుగు సినిమా ఆకట్టుకుందా? రాజమౌళి బ్రాండ్‌తో వచ్చిన ఈ చిత్రం మెప్పించిందా? ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు కురిపించిన ప్రశంసలకు తగ్గట్టుగా సినిమా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ కథ
Image Credit : X/@SBbySSK

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ కథ

సూరి(ఫహద్‌ ఫాజిల్‌)కి ఎవరూ లేరు. అంబులెన్స్ నడిపిస్తుంటాడు. బెట్టింగ్‌ కాసి మరీ ఫాస్ట్ గా అంబులెన్స్ నడిపి డబ్బులు సంపాదిస్తుంటాడు. అదే సమయంలో డబ్బుల కోసం అడ్డమైన పనులు కూడా చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో అతనొక సమస్యలో ఇరుక్కుంటాడు. పాతబస్తీ స్మగ్లర్‌ అస్లామ్‌(మహేష్‌ మంజ్రేకర్‌)తో ఇష్యూ అవుతుంది. ఆ గొడవలో సూరికి మూడు రోజుల్లో 25 లక్షలు తీసుకురావాలనే కండీషన్‌ పెడతాడు అస్లాం. ఆ డబ్బు కోసం తప్పుల మీద తప్పులు చేస్తుంటాడు సూరి. ఈ క్రమంలో అతనికి ఒక మ్యాజిక్‌ లాకెట్‌ దొరుకుతుంది. ఆ లాకెట్‌ని చూడగా ఓ చిన్నారి దివ్య(బేబీ సారా) ప్రత్యక్షమవుతుంది. ఆ అమ్మాయి బయట ఎవరికీ కనిపించదు, కేవలం సూరికే కనిపిస్తుంది. అతనితోనే మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి మ్యాజిక్‌ పిచ్చి. తన పేరెంట్స్ తో కారులో వెళ్తూ మ్యాజిక్‌ చేస్తుంది. పేరెంట్స్ ని మాయం చేశానని చెబుతుంది. తనకు పేరెంట్స్ ని కనిపించేలా చేయాలని సూరిని రిక్వెస్ట్ చేస్తుంది. సూరి పెద్ద మెజీషియన్‌ అని ఆమె నమ్ముతుంది. ఈ క్రమంలో సూరి, దివ్య కలిసి ట్రావెల్‌ అవుతారు. ఆ అమ్మాయిని అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించాలనుకుంటాడు సూరి, అతను తన పేరెంట్స్ ని కలిపిస్తాడనే నమ్మకంతో ఆయన చెప్పిన పనులన్నీ చేస్తుంది. మరి దివ్య బయటి వారికి ఎందుకు కనిపించదు, సూరికే ఎందుకు కనిపిస్తుంది? ఆమె పేరెంట్స్ ఏమయ్యారు? సూరి ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఎలాంటి పనులు చేశాడు? దివ్యకి వారిని పేరెంట్స్ ని చూపించాడా? లేదా? చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది సినిమా.

37
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ మూవీ విశ్లేషణ
Image Credit : X/@SBbySSK

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ మూవీ విశ్లేషణ

`డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌` మూవీ టైటిల్‌తోనే ఆసక్తిని పెంచింది. బాలయ్య డైలాగ్‌ దీనికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌. రాజమౌళి సమర్పణ, కార్తీకేయ నిర్మాత, ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా నటించడం, ట్రైలర్‌లో మ్యాజికల్‌ అంశాలు ఆకట్టుకోవడం, దీనికితోడు మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ లాంటి బిగ్‌ స్టార్స్ సినిమా బాగుందని ట్వీట్లు చేయడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం వెనకబడిందని చెప్పొచ్చు. మెయిన్‌గా టైటిల్‌కి, కథకి ఏమాత్రం సంబంధం కనిపించలేదు. పైగా ట్రైలర్‌లో హీరో, పాప కలిసి మ్యాజిక్‌ చేసినట్టుగా పోట్రే అయ్యింది. కానీ సినిమాలో అమ్మాయి పవర్‌ యూజ్‌ చేస్తుంది కానీ హీరోలో ఆ క్వాలిటీ లేదు. ఇది నిరాశ పరిచే అంశం. ఈ మూవీ చిన్నారి పాప చుట్టూ తిరుగుతుంది. ఆ పాప ఎవరికీ కనిపించదు, మరి ఆత్మనా? దేవతా? అనే సస్పెన్స్ అంశాలతో సాగుతుంది. సినిమా ద్వారా ఫన్‌ చూపించాలనుకున్నారా? ఎమోషనల్‌గా చూపించాలనుకున్నారా? మ్యాజిక్‌ చుట్టూ తిప్పాలనుకున్నారా అనేది క్లారిటీ మిస్‌ అయ్యింది. సినిమా ప్రారంభంలో హీరో పాత్ర తాలూకు క్యారెక్టరైజేషన్‌ని ఎస్టాబ్లిష్‌ చేశారు. అది కొంత ఫన్‌గా ఉంటుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ ఆ తర్వాత రొటీన్‌గా మారుతుంది. ఫన్‌ వర్కౌట్ కాలేదు. ఎంగేజ్‌ కూడా చేయలేకపోయింది. ఇక బేబీ దివ్య పాత్ర ఎంట్రీ తర్వాత మరికొంత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కానీ ఆ తర్వాత అది కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. కథ అక్కడక్కడే తిరుగుతుంది. లాజిక్‌ లెస్‌గానూ అనిపిస్తుంది. అమ్మాయిని అడ్డంపెట్టుకొని డబ్బులు సంపాదించే సీన్‌, కిడ్నాప్‌ సీన్‌, దొంగతనం సీన్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కొంత ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పాపకి సంబంధించిన ట్విస్ట్ ఆడియెన్స్ కి ముందే అర్థమవుతుంది. కానీ హీరోకి మాత్రం అప్పుడే అర్థమవుతుంది. ఆ ట్విస్ట్ కూడా తేలిపోయింది. కాకపోతే ట్రైన్‌ సీన్‌ కొంతలో కొంత ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌ సైతం అదే తరహాలో సాగుతుంది. అమ్మాయిలోని మ్యాజిక్‌ పవర్‌ని అడ్డుపెట్టుకొని హీరో డబ్బులు సంపాదించాలనుకోవడం, విలన్‌ ని ఆడుకోవడం సీన్లు కూడా అలరించలేదు. అమ్మాయి మ్యాజిక్‌ పవర్‌ని ఉపయోగించే సీన్‌ బాగానే ఉంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. అమ్మాయి పాత్ర తాలుకూ ట్విస్ట్, సస్పెన్స్ రివీల్‌ కావడం ఎమోషనల్‌గా ఉంటుంది. ఎండింగ్‌ కూడా ఎమోషనల్‌గా ముగించారు.

47
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ లో ప్లస్‌, మైనస్‌లు
Image Credit : X/@SBbySSK

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ లో ప్లస్‌, మైనస్‌లు

అయితే అమ్మాయి పాత్రలోని ఎమోషనల్‌ మొదటి నుంచి క్యారీ అయితే ఆడియెన్స్ ఎంగేజ్‌ అయ్యేవాళ్లు, అది కాకపోవడంతో ఆయా సీన్లు ఏమాత్రం ఆకట్టుకోలేదు కదా, చప్పగా సాగాయి. బోర్‌ ఫీలింగ్‌ తెప్పించాయి. బాగా సాగదీసినట్టుగా ఉన్నాయి. చిన్నారి మ్యాజిక్‌ అనే పాయింట్‌, క్లైమాక్స్, విజువల్స్ సినిమాకి ప్లస్‌గా చెప్పొచ్చు. మిగిలిన అన్నీ మైనస్‌ అనే చెప్పాలి. సినిమాలో విషయం లేకపోవడంలో హీరో పడ్డ కష్టం అంతా వృధానే. మ్యూజిక్‌ ఆకట్టుకోలేకపోయింది. సినిమా లాజిక్‌ లెస్‌గా ఉంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కానీ రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడికి ఈ సినిమా ఎలా నచ్చింది? ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు లాంటి బిగ్‌ స్టార్స్ ని ఇది ఎలా ఆకట్టుకుందనేది ప్రశ్న.

57
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : X/@SBbySSK

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

సూరి పాత్రలో ఫహద్‌ ఫాజిల్‌ బాగా నటించాడు. నటుడిగా అదరగొట్టాడు. కానీ డైలాగ్‌ డెలివరీ అసహజంగా ఉంది. కొన్ని మాటలు అర్థం కాలేదు. బేబీ దివ్య పాత్రలో సారా అదరగొట్టింది. ఆ అమ్మాయినే సినిమాకి హీరో. కానీ అమ్మాయి పాత్రలోని ఎమోషన్స్ వర్కౌట్‌ అయితే సినిమా బాగుండేది. ఇక అస్లాంగా మహేష్‌ మంజ్రేకర్‌ ఉన్న కాసేపు మెప్పించారు. పోలీస్‌గా సుబ్బరాజు ఓకే అనిపించాడు. సూరి ఫ్రెండ్‌గా నటించిన వెంకటేష్‌ కాకుమాను ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలు జస్ట్ ఓకే అనిపించాయి.

67
టెక్నీకల్‌గా డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ ఎలా ఉందంటే?
Image Credit : X/@SBbySSK

టెక్నీకల్‌గా డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ ఎలా ఉందంటే?

దర్శకుడు శశాంక్‌ ఈ మూవీని ఇటు ఫన్ యాంగిల్‌లో, అటు ఎమోషనల్‌ యాంగిల్‌లోనూ కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. కాకపోతే పాయింట్‌ పరంగా కొత్తగా అనిపిస్తుంది. దాన్ని తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. కాలభైరవ మ్యూజిక్‌ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కొన్ని చోట్లు ఆర్‌ఆర్‌ ఓకే అనిపించింది. సినిమా బాగా సాగదీసినట్టుగా ఉంది. ఎడిటింగ్‌ పరంగా కొంత వర్క్ చేయాల్సింది. కెమెరా వర్క్ మాత్రం బాగుంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. సినిమా రిచ్‌గా ఉంది.

77
ఫైనల్‌గా
Image Credit : X/@SBbySSK

ఫైనల్‌గా

క్లైమాక్స్ కాసేపు తప్ప మిగిలినదంతా ట్రబులే. మ్యాజిక్‌ చేయలేకపోయిన `డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌`.

రేటింగ్‌ 2

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఎస్.ఎస్. రాజమౌళి
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ
Recommended image2
Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?
Recommended image3
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
అరెరె.. ఈ పవన్ కల్యాణ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 44 ఏళ్ల వయసులో ఏం చేస్తోందంటే?
Recommended image2
Chiranjeevi: కోకాపేటలో కోట్లు విలువ చేసే భూమి.. చిరంజీవి చెల్లెళ్లకు ఇస్తానంటే భార్య సురేఖ ఏమన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved