MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SPB: మోహన్ బాబు మూవీలో బూతు పాట పాడమని ఎస్పీబీపై ఒత్తిడి, రాఘవేంద్రరావు ముఖం మీదే బాలు ఏం చెప్పాడంటే?

SPB: మోహన్ బాబు మూవీలో బూతు పాట పాడమని ఎస్పీబీపై ఒత్తిడి, రాఘవేంద్రరావు ముఖం మీదే బాలు ఏం చెప్పాడంటే?

SPB: పాటల విషయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. తన మనసుకు నచ్చని పాటలను పాడటానికి అస్సలు ఇష్టపడరు. ఓ సారి మోహన్ బాబు సినిమా కోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాట పాడమంటే అస్సలు ఒప్పుకోలేదట. ఆ పాటలో అంతలా ఏముంది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 01 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గానగాంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
Image Credit : Google

గానగాంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అద్భుతమైన గాయకుడిగా పేరుపొందారు గానగాంధర్వుడు దివంగత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (SPB). ఆయన పాటలంటే ఇష్టపడనివారు ఉండరు. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడి బాలు ఎన్నో అద్భుతాలు చేశారు. కేవలం తన మధురమైన స్వరంతోనే కాకుండా, పాటల విషయంలో పాటించే కచ్చితమైన విలువలు, నియమాలతో ఎంతోమందికి ఆయన మార్గదర్శకంగా నిలిచారు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాహిత్యం, పాటల్లో నైతికత మరియు ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం గురించి ఎస్పీబీ పంచుకున్న ఆసక్తికర విషయాలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సాహిత్యంలో అపభ్రంశం అంటే ఏంటి?
Image Credit : facebook.com/SPB

సాహిత్యంలో అపభ్రంశం అంటే ఏంటి?

సంగీతం, సాహిత్యం విషయంలో సరైన అవగాహన ఉండాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఆయన దృష్టిలో 'అపభ్రంశం' అంటే వ్యాకరణ జ్ఞానం (గ్రామర్) లేకుండా, మిడిమిడి జ్ఞానంతో పాటల్లో మాటలు రాయడమే. సందర్భంతో సంబంధం లేకుండా ఎవరో పెద్దవాళ్లు రాసిన పడికట్టు పదాలను తెచ్చి పాటల్లో ఇరికించడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, శ్రోతలను ఆకట్టుకోవడం కోసం కావాలనే బూతు పదాలు లేదా ద్వియర్థ (డబుల్ మీనింగ్) పదాలు రాయడాన్ని ఆయన తప్పుపట్టారు.

వేటూరి అంత అందంగా ఎవరూ రాయలేరు

తెలుగు సినీ సాహిత్యంలో దిగ్గజ రచయిత అయిన వేటూరి సుందరరామమూర్తి గారి గురించి ఎస్పీబీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వేటూరి సుందరరామమూర్తి గారు రాసినన్ని బూతు పాటలు ప్రపంచంలో బహుశా ఎవరూ రాసి ఉండరు. కానీ, ఆయన రాసినంత అందంగా, కావ్యాత్మకంగా ఆ తరహా పాటలను వేరెవరూ రాయలేరు" అని ఎస్పీబీ పేర్కొన్నారు. వేటూరి సాహిత్యంలో ఉండే అలంకారం, పదాల అమరిక గురించి చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

34
మోహన్ బాబు సినిమా కోసం రాఘవేంద్రరావు ఒత్తిడి
Image Credit : Asianet News

మోహన్ బాబు సినిమా కోసం రాఘవేంద్రరావు ఒత్తిడి

తన మనస్సాక్షికి నచ్చని, అసభ్యకర పదాలు ఉన్న పాటలను పాడటానికి ఎస్పీబీ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఒక సందర్భంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలోని ఒక పాట విషయంలో ఇలాగే జరిగింది. మోహన్ బాబు తనకు ఎంతో ఆత్మీయ మిత్రుడైనప్పటికీ, ఆ పాటలో ఉన్న ఒక పదం నచ్చకపోవడంతో పాడేందుకు ఎస్పీబీ నిరాకరించారు. ఆ సినిమా దర్శకుడు కె. రాఘవేంద్రరావు కూడా ఆ పాట పాడమని ఎస్పీబీపై ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారట. "ఈ పాట వల్ల నీ సినిమాకు మంచి అడ్వాంటేజ్ ఉంటుందంటే తప్పకుండా ఉంచుకో రాఘవా.. కానీ నేను మాత్రం ఈ పాట పాడలేను, నన్ను క్షమించు" అని ఖచ్చితంగా చెప్పేసినట్లు ఎస్పీబీ గుర్తుచేసుకున్నారు.

44
నాకు నచ్చకపోతే పాడను అంతే!
Image Credit : Asianet News

నాకు నచ్చకపోతే పాడను అంతే!

బాలుకి నచ్చకపోతే ఆ పాటను పాడనని స్పష్టంగా చెప్పేవారు. అలాగే ఈ పాట విషయంలోనూ జరిగింది. చివరకు ఆ పాటను వేరే గాయకుడితో పాడించారు. అయితే సెన్సార్ బోర్డు కూడా ఆ పదాన్ని కట్ (సెన్సార్) చేసిందని ఎస్పీబీ వెల్లడించారు. తాను పరిశ్రమను ప్రక్షాళన చేయడానికి ఇలా చేయలేదని, కేవలం తన మనస్సాక్షికి నచ్చని పనిని చేయకూడదనే నియమంతోనే ఆ పాటను వదిలేశానని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మంచు మోహన్ బాబు
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chirajeevi: కోకాపేటలో కోట్లు విలువ చేసే భూమి.. చిరంజీవి చెల్లెళ్లకు ఇస్తానంటే భార్య సురేఖ ఏమన్నారో తెలుసా?
Recommended image2
Sivaji Ganesan: స్నేహితుడి కోసం ఫ్రీగా నటించిన లెజెండ్రీ హీరో.. టిఫిన్ క్యారియర్‌లో ఆ డబ్బు చూసి షాక్!
Recommended image3
Kantara Turns 4: 16 కోట్లు పెడితే రూ.450 కోట్ల కలెక్షన్స్.. ఎమోషనల్ అయిన హీరో, వైరల్ పోస్ట్
Related Stories
Recommended image1
Venkatesh: సౌందర్య కోసం రోజాకు అన్యాయం చేసిన వెంకటేష్? రాజా సినిమా ఎలా మిస్సయిందంటే?
Recommended image2
Chirajeevi: కోకాపేటలో కోట్లు విలువ చేసే భూమి.. చిరంజీవి చెల్లెళ్లకు ఇస్తానంటే భార్య సురేఖ ఏమన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved