Brahmamudi: అత్తకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్.. అయోమయంలో స్వప్న?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది.భర్త మంచితనాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న ఒక భార్య కధ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నా భర్తని ఇంతమందిలో నిల దీయటానికి ఆయన ఏమీ తప్పు చేయలేదు కావ్య. నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు అంటుంది అపర్ణ. మావయ్య గారిని అంటే మీరు ఊరుకుంటారా అంటుంది కావ్య. మీరు ఆగండి అని రుద్రాణి దగ్గరికి వెళ్లి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు రాజ్. వాడిని నలుగురు ముందే అవమానపరిస్తే వాడికి ఆఫీసులో విలువ ఏం ఉంటుంది రుద్రాణి.
తప్పు చేసినప్పుడు మందలించకపోతే అదే తప్పు మళ్ళీ చేస్తాడు అంటాడు రాజ్. తప్పు చేస్తే గదిలోకి తీసుకువెళ్లి మాట్లాడాలి కానీ ఇలా నలుగురు మధ్యలోని అనటం ఏంటి అయినా కళ్యాణ్ మాత్రం ఏం వెలగబెడుతున్నాడని? వాడిని ఎవరు ఏమీ అనరు కానీ నా కొడుకుని మాత్రం అంటారు మీ అందరికీ మేమంటే చులకన అయిపోయాము అంటుంది రుద్రాణి.
కళ్యాణ్ గురించి మాట్లాడితే ఇచ్చే మర్యాద కూడా ఇవ్వను అంటూ కోప్పడుతుంది ధాన్యలక్ష్మి. సుభాష్, ప్రకాష్ కూడా రుద్రాణిని కళ్యాణ్ జోలికి వస్తే ఊరుకోము అంటూ హెచ్చరిస్తారు. రాజ్ కూడా తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా మందలిస్తాను తప్పు దిద్దుకపోతే నిర్దాక్షిణ్యంగా కంపెనీ నుంచి బయటికి పంపించేస్తాను మరో విషయం కళ్యాణ్ జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ రుద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్.
రోజురోజుకీ నీ విలువని నువ్వే పోగొట్టుకుంటున్నావు అంటూ సీతారామయ్య దంపతులు కూడా రుద్రాణిని మందలిస్తారు. ఇదేంటి ఇంట్లో రాహుల్ వాళ్లకి ఉండే విలువ ఇంతేనా గట్టిగా మాట్లాడితే బయటికి తోసేసేలాగా ఉన్నారు అనుకుంటుంది స్వప్న. ఆ తర్వాత రుద్రాణి మాటలకి బాధపడుతూ ఉంటాడు రాజ్. అతని దగ్గరికి అపర్ణ వచ్చి నువ్వు ఇలా బాధపడతావని తెలుసు అందుకే వచ్చాను అంటుంది.
అత్త అలా ఎలా మాట్లాడుతుంది. నాకు రాహుల్ అయినా కళ్యాణ్ అయినా ఇద్దరు ఒకటే. కాకపోతే రాహుల్ తప్పులు మీద తప్పులు చేస్తున్నాడు కళ్యాణ్ ఒక తప్పు కూడా చేయలేదు అంటాడు రాజ్. ఆ విషయంలో నేను నిన్ను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను కానీ నువ్వే చూసి చూడనట్లుగా వదిలేసావు అయినా ఇన్ని తప్పులు చేసిన రాహుల్ ని ఎలా అభిమానిస్తున్నావు అంటుంది అపర్ణ.
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము ఈరోజు డబ్బులు చేశాడని వాడిని వదిలేసుకోలేం కదా అంటాడు రాజ్. ఆ మాటలు విన్న కావ్య తన భర్త మంచితనానికి మురిసిపోతుంది. మరోవైపు పాలలో తను ఇచ్చిన వేరు కలిపితే భర్త నీ వసం అవుతాడు అని చెప్పిన ఆవిడ మాటలు గుర్తు చేసుకుంటూ పాలల్లో వేరు కలపటానికి వంట గదిలోకి వచ్చి పాలు కలుపుతూ ఉంటుంది స్వప్న.
వంటగదిలో అక్కని చూసి ఆశ్చర్యంగా నువ్వు వంట గదిలోకి వచ్చావ్ ఏంటి అంటుంది. నా మొగుడికి నేను పాలు కలుపుకుంటాను మధ్యలో నీకేంటి అనుకుంటూ పాలలో ఆ మందు కలిపి పక్కన పెడుతుంది స్వప్న. ఇంతలో ఏదో ఫోన్ రావటంతో బయటికి వెళుతుంది కావ్య కూడా రాజ్ కోసం పాలు కలిపి పక్కన పెడుతుంది. ఫోన్ చూసుకుంటూ లోపలికి వచ్చిన స్వప్న తను మందు కలిపిన పాలు కాకుండా పక్కన కావ్య కలిపిన పాలని తీసుకువెళ్లిపోతుంది.
ఈ పాలు నేను ఇచ్చారంటే తాగరు పెద్దమ్మ గారు ఇచ్చారని చెప్పు అని చెప్పి పనిమనిషి తో చెప్పి రాజ్ కి పాలు ఇప్పిస్తుంది కావ్య. పనిమనిషి అపర్ణమ్మ గారు పాలు ఇచ్చారు అని చెప్పడంతో పాలు తాగేస్తాడు రాజ్. మరోవైపు రాహుల్ తో మంచిగా మాట్లాడుతూ అతనితో ఆ పాలు తాగిస్తుంది స్వప్న. రాహుల్ నార్మల్గా ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది. మందు ప్రభావం ఏమైంది అంతా ఉత్తిదేనా అంటూ అయోమయంలో పడిపోతుంది.
తను ఈ అయోమయంలో ఉండగానే రాహుల్ నిద్రలోకి జారుకుంటాడు. డిసప్పాయింట్ అవుతుంది స్వప్న. మరోవైపు పాలు తాగిన రాజ్ కావ్య దగ్గరికి వచ్చి రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. భర్త ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది కావ్య. తరువాయి భాగంలో జువెలరీ డిజైన్ లేట్ అయిందని ఆఫీస్ స్టాఫ్ ని మందలిస్తాడు రాజ్.
ఆ మాటలు విన్న కావ్య ఏం జరిగింది అని అడుగుతుంది. అమెరికాలో గుడి కడుతున్నారు ఆ దేవుడికి సంబంధించిన జ్యువెలరీ అంతా మనమే డిజైన్ చేయాలి కానీ ఆ పని ఇంకా ఫినిష్ అవ్వలేదు అంటాడు రాజ్. ప్రాబ్లం ని ఎలా అయినా సాల్వ్ చేయాలి అనుకొని నేను కూడా ఆఫీస్ కి వస్తాను అంటుంది.