Brahmamudi: రుద్రాణికి తల తిరిగిపోయేలా సమాధానమిచ్చిన రాజ్.. ఇంటి పరువు బజారుకి ఈడ్చిన స్వప్న?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల అభిమానం గెలుచుకొని మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఓకే ఇంటికి కోడలుగా వచ్చిన రెండు భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు అక్కచెల్లెళ్లు కధ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ఒకరికి ఒకరు భోజనాలు తినిపించుకుంటూ ఆనందంగా భోజనాలు పూర్తి చేస్తారు కావ్య వాళ్ళు. మరోవైపు స్వప్న బోల్డ్ సీన్స్ లో యాక్ట్చేస్తూ యాడ్ కంప్లీట్ చేస్తుంది. ఈ యాడ్ తో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అని స్వప్నని ఆకాశానికి ఎత్తేస్తాడు డైరెక్టర్. ఆ తరువాత కావ్య, స్వప్న ఇద్దరు ఒకేసారి ఇంటికి వస్తారు.
అప్పటికే కోపంగా ఉన్న దుగ్గిరాల కుటుంబం మొత్తం స్వప్న కోసం హల్లో నే ఎదురుచూస్తూ ఉంటారు. స్వప్న డ్రెస్ చూసి షాక్ అవుతుంది.. కావ్య. ఇది వేసుకుని ఇంట్లోకి వెళ్తే ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తారు అంటుంది నేను ఇదే డ్రెస్ వేసుకొని బయటకు వెళ్లాను అయినా నా సంగతి నీకు ఎందుకు అని కోప్పడుతూ లోపలికి వస్తుంది. ఆమె వేసుకుని డ్రెస్ చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు.
ఇది దుగ్గిరాల ఇంటి కోడలు వేసుకోవలసిన డ్రెస్ కాదు. ఏంటిది అని అపర్ణ చిట్టి అడుగుతారు. ఇది ఫ్యాషన్ అమ్మమ్మ గారు మీరు బయటకు వెళ్లారు కదా అందుకే మీకు ఏమీ తెలియదు అంటూ పొగరుగా మాట్లాడుతుంది స్వప్న. అదంతా పక్కన పెట్టు ఏంటి చిన్న కోడలు అయిన ధాన్యలక్ష్మిని నువ్వు అనవలసిన అవసరం ఏమొచ్చింది అని నిలదీస్తుంది అపర్ణ. నన్ను అంటే గింటే నా భర్త అనాలి లేదంటే నాతో అనాలి అలాంటిది ఆవిడ నన్ను అనటం ఏంటి అని పొగరుగా మాట్లాడుతుంది స్వప్న.
అలా మాట్లాడొద్దు అంటూ స్వప్నని మందలిస్తుంది కావ్య. చూశారా ఎలా మాట్లాడుతుందో ఈరోజు ధాన్యలక్ష్మి అంది రేపు నన్ను అంటుంది తర్వాత అమ్మను కూడా అంటుంది దీని దీనిని ఇప్పుడే ఇంట్లోంచి బయటికి గెంటేయాలి అని రుద్రాణి రెచ్చిపోతుంది. మా అక్క తప్పు చేసింది కాదనను కానీ మీరు పెద్దవారు అలా మాట్లాడకూడదు అంటుంది కావ్య.
అలా అనటంతో నువ్వేమైనా తక్కువ తిన్నావా నువ్వు కూడా ముసుగేసుకుని ఈ ఇంటి కోడలు అయ్యావు అని రుద్రాణి కావ్య మీద రెచ్చిపోతుంది.ఇందులో తను తప్పేముంది అంతా నీవల్ల నీ కొడుకు వల్ల జరిగింది కుటుంబం పరువు కోసం నేను తల్లిదండ్రుల పరువు కోసం తను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అయినా నీ కోడలు తప్పు చేసింది తనని దాని గురించి రియాక్టర్ అంతేగాని ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఎందుకు అంటాడు రాజ్.
రాహుల్ ని పిలిచి నీ భార్యని కంట్రోల్ లో పెట్టుకో ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించు ఆయన పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి నువ్వేం మగాడివి నీ భార్యని తీసుకొని లోపలికి వెళ్ళు అని ఆర్డర్ వేస్తాడు రాజ్. కోపంగా భార్యని లోపలికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్. రాజ్ తన ని సపోర్ట్ చేసినందుకు ఆనందపడుతుంది కావ్య.
కృష్ణుడి దగ్గరికి వెళ్లి నా జీవితం సాఫీగా అవుతుందో లేదో అని భయపడ్డాను కానీ ఇప్పుడు నాకు ఆశలు చిగురించాయి అని కృష్ణుడికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అక్కడినుంచి వచ్చేస్తుంటే అపర్ణ,రాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇద్దరి మధ్యన తొలిప్రేమ అహంకరిస్తుందా నీ ప్రవర్తన నేను గమనిస్తున్నాను ఇప్పుడు కావ్యని సపోర్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది. మన ఇంటి పరువు ని వీధికీడ్చి తన హక్కులు సాధించుకుంది. ఆ విషయం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు అంటుంది అపర్ణ.
నా ప్రాణాలు కాపాడి నన్ను సేవ్ చేసింది అందుకే తనకి నేను సపోర్ట్ చేస్తున్నాను అంతేగాని తనని భార్యగా ఒప్పుకునే ఉద్దేశం లేదు అంటాడు రాజ్. ఆ మాటలు విన్న కావ్య కన్నీరు పెట్టుకుంటుంది మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చి నా ఆనందాన్ని ఐదు నిమిషాలు కూడా వంచలేదు నేను ఏం పాపం చేశాను అంటూ ఏడుస్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి రాజ్ నిన్ను సపోర్ట్ చేశాడు చూసావా అంటూ తన ఆనందాన్ని కావ్యతో చెప్తుంది.
తరువాయి భాగంలో స్వప్న యాక్ట్ చేసిన యాడ్ రిలీజ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ సిగ్గు పడిపోతారు మీడియా వాళ్ళందరూ ఇంట్లోకి వస్తుంటే వాళ్ళని ఆపలేక పోతారు. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచకూడదు అని కోపంతో రెచ్చిపోతుంది రుద్రాణి.