MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Raj Nidimoru: మా ఇద్దరి మధ్య భలే సింక్ కుదిరింది, సమంతపై రాజ్ నిడిమోరు ప్రశంసలు.. ఆమె సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌

Raj Nidimoru: మా ఇద్దరి మధ్య భలే సింక్ కుదిరింది, సమంతపై రాజ్ నిడిమోరు ప్రశంసలు.. ఆమె సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌

'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న టైంలో, నిర్మాత రాజ్ నిడిమోరు తన భార్య, నటి సమంత రూత్ ప్రభుపై ప్రశంసలు కురిపించారు. ఆమె నటనని ఆకాశానికి ఎత్తారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 23 2026, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 మా ఇంటి బంగారంతో హిట్‌ కొట్టిన సమంత, రాజ్‌ నిడిమోరు
Image Credit : Asianet News

మా ఇంటి బంగారంతో హిట్‌ కొట్టిన సమంత, రాజ్‌ నిడిమోరు

నిర్మాత రాజ్ నిడిమోరు తన భార్య సమంత రూత్ ప్రభుతో 'మా ఇంటి బంగారం' సినిమాకు పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. సమంత తన సొంత కష్టంతో పైకొచ్చిన నటి అని, తమ ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉందని మెచ్చుకున్నారు. నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన కొత్త సినిమా 'మా ఇంటి బంగారం' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-కామెడీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో సమంత కొత్త అవతారాన్ని అభిమానులు బాగా ఇష్టపడుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 సమంంత సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌
Image Credit : rajanddk instagram

సమంంత సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌

ఈ సినిమా నిర్మాత, సమంత భర్త అయిన రాజ్ నిడిమోరు, తన భార్యతో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. సమంతను 'స్వయంకృషితో ఎదిగిన నటి' అని పిలుస్తూ, 'మా ఇద్దరి మధ్య అద్భుతమైన సింక్ ఉంది' అన్నారు. ఒక నేషనల్‌ మీడియాతో మాట్లాడుతూ, 'సమంత ఎప్పుడూ కొత్తదనం కోసం చూసే సెల్ఫ్-మేడ్ యాక్టర్. నేను ఆమె కెరీర్ మొదట్లో చేసిన సినిమాలు చూడలేదు, కానీ ఆమెకు వచ్చిన పాపులారిటీ, ఇన్నేళ్లుగా ఆమె అనుభవిస్తున్న స్టార్‌డమ్ గురించి నాకు తెలుసు' అని చెప్పారు.

35
 సమంత ఫస్ట్ టేక్‌లోనే బెస్ట్ ఇస్తుంది
Image Credit : Asianet News

సమంత ఫస్ట్ టేక్‌లోనే బెస్ట్ ఇస్తుంది

'ఆమె మొదటి టేక్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అందుకే నేను ఎక్కువగా ఆమె ఫస్ట్ టేక్‌నే వాడుకుంటాను. ఎందుకంటే, ఏదైనా కొత్తగా చేయడానికి ఆమె మానసికంగా సిద్ధంగా ఉంటుంది' అని రాజ్ వివరించారు. 'సినిమా ఇండస్ట్రీలో నటీనటుల కెరీర్ లైఫ్ గురించి మనం తరచుగా చర్చిస్తాం. ఏదేమైనా, ఒక  యాక్టర్‌ని ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబెట్టేది వారి నటన మాత్రమే అని మనకు తెలుసు' అని రాజ్ అన్నారు.

45
 మా ఇద్దరికి మంచి సింక్ కుదిరింది
Image Credit : Samantha/ Instagram

మా ఇద్దరికి మంచి సింక్ కుదిరింది

రాజ్‌ నిడిమోరు ఇంకా మాట్లాడుతూ, `సమంతకి ఏదైనా టేక్ నచ్చకపోతే, దాన్ని ఇంకా ఎలా మెరుగుపరచవచ్చో మేం చర్చించుకునేవాళ్లం' అన్నారు. 'గత కొన్నేళ్లుగా ఆమె ఈ విషయంలో చాలా మెరుగైంది. మానిటర్‌లో తన నటన చూసుకుని, 'నన్ను నేను ఇలా యాక్ట్ చేస్తూ ఎప్పుడూ చూసుకోలేదు' అని ఆమె అనేదని' రాజ్ గుర్తుచేసుకున్నారు. చివరగా, 'మా ఇద్దరి మధ్య గ్రేట్ సింక్ ఉంది' అని వెల్లడించారు. 

55
 తల్లి కాబోతున్న సమంత
Image Credit : instagram / Samantha

తల్లి కాబోతున్న సమంత

ఇదిలా ఉంటే సమంత తల్లి కాబోతుంది. ఆమె ఇటీవల సక్సెస్‌ సెలబ్రేషన్‌లో భాగంగా టీషర్ట్ ధరించి వచ్చింది. ఆమె చిన్నపాటి బేబీ బంప్‌ కనిపించింది. దీనికితోడు చిరంజీవి కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు. ఆయన్ని సమంత, రాజ్‌ నిడిమోరు మా ఇంటి బంగారం టీమ్‌ కలిసి విషయం తెలిసిందే. వారిని అభినందిస్తూ చిరంజీవి ఈ ట్వీట్‌ చేశారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Related Stories
Recommended image1
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Recommended image2
Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved