MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది

Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది

సుడిగాలి సుధీర్‌, రష్మి గౌతమ్‌ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై జబర్దస్త్ యాంకర్‌ స్పందించింది. కనీసం సుధీర్‌ పేరు పలకడానికి కూడా ఇబ్బంది పడింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 23 2026, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సుడిగాలి సుధీర్‌, రష్మిల రొమాన్స్ తో జబర్దస్త్ షోకి క్రేజ్‌
Image Credit : our own

సుడిగాలి సుధీర్‌, రష్మిల రొమాన్స్ తో జబర్దస్త్ షోకి క్రేజ్‌

సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మి ఒకప్పుడు లవర్స్ గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో చేస్తున్నప్పుడు వీరిద్దరు కలిసి పనిచేశారు. కలిసి స్కిట్లు చేశారు. రొమాన్స్ చేశారు. షోకి అదిరిపోయే రేటింగ్‌ని తీసుకొచ్చారు. షోలోనే లవ్‌ ప్రపోజల్స్ జరిగాయి, ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అంతేకాదు పెళ్లి పీఠల వరకు వెళ్లింది. కానీ అది షో కోసం చేసిన హంగామా అనేది తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విడిపోయిన రష్మి, సుధీర్‌ జంట
Image Credit : our own

విడిపోయిన రష్మి, సుధీర్‌ జంట

అయితే వీరిద్దరు రియల్‌ లైఫ్‌లోనూ లవర్స్ అని అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా చాలా మంది అభిమానులు కోరుకున్నారు. అయితే అనూహ్యంగా జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్‌ వెళ్లిపోయాడు. సినిమా అవకాశాలు వచ్చిన నేపథ్యంలో షో నుంచి తప్పుకున్నారు. దీంతో రష్మికి, సుధీర్‌కి గ్యాప్‌ వచ్చింది. ఆ గ్యాప్‌ పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా రష్మి ముందు సుధీర్ ప్రస్తావన వచ్చింది. దానికి ఆమె ప్రస్తావన చర్చనీయాంశంగా మారింది.

35
సుడిగాలి సుధీర్ పేరు పలకడానికి ఇబ్బంది పడ్డ రష్మి గౌతమ్‌
Image Credit : Asianet News

సుడిగాలి సుధీర్ పేరు పలకడానికి ఇబ్బంది పడ్డ రష్మి గౌతమ్‌

రష్మి గౌతమ్‌ ఇప్పుడు యాంకర్‌గా `ఆహా`లో టాప్‌ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఒక షోని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ మంగళవారం జరిగింది. ఇందులో జడ్జ్ గా వ్యవహరించబోతున్న మంచు లక్ష్మి, యాంకర్‌గా ఉండబోతున్న రష్మి గౌతమ్‌, ఆహా హెడ్‌, మిగిలిన ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇందులో పాల్గొన్నారు. సరదాగా కాసేపు గేమ్‌ ఆడారు. ఇందులో సుడిగాలి సుధీర్‌ ప్రస్తావన వచ్చింది. ఆటలో భాగంగా సుధీర్‌ పేరు చెప్పాల్సి వచ్చింది. కానీ రష్మి ఆ పేరు పలకడానికి ఇబ్బంది పడింది. సగం చెప్పి మానేసింది. తాను గెలవాల్సిన చోట ఓడిపోవడానికి రెడీ అయ్యింది.

45
సుధీర్‌తో సినిమాపై రష్మి షాకింగ్‌ కామెంట్‌
Image Credit : Asianet News

సుధీర్‌తో సినిమాపై రష్మి షాకింగ్‌ కామెంట్‌

ఆ తర్వాత సుడిగాలి సుధీర్‌తో సినిమాపై ఆమె రియాక్ట్ అయ్యింది. సుధీర్, తాను హీరోహీరోయిన్లుగా సినిమా రాబోతుందనే వార్తల నేపథ్యంలో తామిద్దరం కలిసి నటించడం లేదని, అది కేవలం మీడియా సృష్టినే అని చెప్పింది. తాము కలిసి సినిమా చేస్తున్నామనేదాంటో నిజం లేదని  స్పష్టం చేసింది. ఇక సినిమాలకు గ్యాప్‌ రావడంపై రష్మి గౌతమ్‌ స్పందిస్తూ, గ్యాప్‌ ఏం రాలేదని, మంచి స్క్రిప్ట్ ల కోసం చూస్తున్నట్టు చెప్పింది. తనకు ఎక్కువగా గ్లామర్‌రోల్స్ వస్తున్నాయని, ఇప్పటికే చేసిన పాత్రలను మళ్లీ మళ్లీ చేయాలని తనకు లేదని, తనకు నచ్చిన పాత్రలు వస్తే నటించడానికి సిద్ధమే అని వెల్లడించింది రష్మి గౌతమ్‌.

55
ఈటీవీలో షో చేస్తూ, మరో షో చేయడంపై క్లారిటీ
Image Credit : Asianet News

ఈటీవీలో షో చేస్తూ, మరో షో చేయడంపై క్లారిటీ

 ఈటీవీలో షో చేస్తూ, మరో ప్లాట్‌ ఫామ్‌లో షో చేయడంపై రియాక్ట్ అవుతూ, ఈటీవీలోగానీ, మల్లెమాల దాంట్లో గానీ ఒక షో చేస్తే, మరో షో చేయోద్దనే నిబంధన లేదని, కాకపోతే ఒకే తరహా షో రెండింటిలోనూ చేయడానికి లేదని, ఒకే టైమ్‌ లో వచ్చే షోలు అయితే అభ్యంతరం ఉంటుందిగానీ, రెండు వేర్వేరు షోలు, రెండు వేర్వేరు టైమ్‌ స్లాట్‌లో వచ్చే షోలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పుడు తాను చేసేది కూడా అదే అని చెప్పింది. జబర్దస్త్ షోకి, ప్రస్తుతం తాను `ఆహా`లో చేయబోతున్నా టాప్‌ తెలుగు ఇన్ ఫ్లూయెన్సర్స్ షోకి సంబంధం లేదని, రెండు వేర్వేరు అని, ఒకదాని వల్ల మరోదానికి ఎలాంటి సమస్య లేదని చెప్పింది రష్మి. ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Related Stories
Recommended image1
India Top 10 Heroes: అల్లు అర్జున్‌కి దెబ్బ మీద దెబ్బ.. ప్రభాస్‌, మహేష్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ స్థానాలు ఇవే
Recommended image2
OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved