Brahmamudi: సేటు తిక్క కుదిర్చిన అప్పు.. ఆఫీస్ లో అవమానపాలైన రాహుల్?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తమది కానీ అధికారాన్ని దక్కించుకోవడం కోసం కుట్రలు పడుతున్న తల్లి కొడుకుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నన్ను ఇంత టార్చర్ పెట్టినందుకు పోలీస్ కేసు పెడతాను అంటాడు సేటు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. పద నేను కూడా నీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి పెడదాం అంటుంది అప్పు. అదేంటి అని అయోమయంగా అడుగుతాడు సేటు. ఇల్లు మా నాన్న పేరు మీద ఉంటే మా అమ్మ సంతకం పెట్టి డబ్బులు తీసుకోవడం ఏంటి.
డబ్బులు ఇవ్వడానికి నువ్వు ఎవరు తీసుకోవటానికి తనెవరు. నువ్వే దొంగ సంతకం పెట్టి ఆస్తి పేపర్లు కాజేసావని అప్పు. నా 10 లక్షలు పోయినట్టేనా అని కంగారు పడతాడు సేటు. అలాంటిదేమీ జరగదు నాది గ్యారెంటీ అని కృష్ణ మూర్తి చెప్పటం తో కనకాన్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సేటు. ఆ తర్వాత కృష్ణమూర్తి, అప్పు ఇద్దరూ కనకాన్ని అసహ్యించుకుంటారు.
మరి ఎప్పుడు నన్ను పిలవద్దు అంటూ మీనాక్షి కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు పదవినోదం ఆడుతూ తనకి రాని సమాధానాలని రాజ్ ని అడుగుతుంది కావ్య. ఆడటానికి ఇంట్రెస్ట్ చూపించడం కావ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి బెట్టు చేస్తాడు కానీ తర్వాత గేమ్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇద్దరు పదవిలోదం ఆడుతారు.
ఆటలో ఇన్వాల్వ్ అయిపోయిన రాజ్ కావ్యకి దగ్గరగా వెళ్లడంతో ఆమె కెవ్వుమని అరుస్తుంది. కంగారుపడిన రాజ్ నేనేమీ కావాలని చేయలేదు అని కావ్యని తిట్టుకుంటూ మంచం ఎక్కేస్తాడు రాజ్. భర్తను చూసి నవ్వుకుంటుంది కావ్య. మరోవైపు కొడుకుని రెడీ చేస్తూ మంచికో చెడుకో తెలియదు రాజ్ నిన్ను తను బ్రాంచ్ లోనే పెట్టుకున్నాడు. అక్కడ అధికారం చేజిక్కించుకునే పనిలో నువ్వు ఉండు నువ్వు చేసిన పనిని గమనించలేనంత బిజీగా ఉండేటట్లుగా ఇంట్లో నేను అలజడి సృష్టిస్తాను.
ఈ గొడవల్లో పడి ఆఫీసులో ఏం జరుగుతుందో తెలియనంత బిజీగా ఉంటాడు రాజ్. ఆ తప్పులకి రాజ్ ని బ్లేమ్ చేస్తే తాతయ్య నిన్నే ఎండి ని చేస్తాడు అంటుంది రుద్రాణి. తల్లి చెప్పిన మాటలకి సరే అంటూ ఆఫీస్ కి బయలుదేరుతాడు రాహుల్. ఆఫీస్ కి వెళ్తూనే అక్కడ ఉన్న ఒక లేడీ స్టాప్ ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమెని ఎండి రూమ్ చూపించమంటూ తీయగా అడుగుతాడు.
ఆమె రూమ్ చూపించి వెళ్ళిపోతుంది. అందులో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావ్ రాహుల్ దగ్గరికి అటెండర్ వచ్చి ఇది ఎండి రూమ్ సర్ మీరు పక్కన ఉంది అని చెప్పటంతో చాలా రోజులు అయింది కదా ఇక్కడికి వచ్చి అందుకే చూడటానికి వచ్చాను అని కవర్ చేసుకుంటాడు. అటెండర్ తన రూమ్ చూపిస్తాడు. రూమ్ ని చూసిన రాహుల్ చాలా చిన్నగా ఉంది అనుకుంటూ రాజ్ ని తిట్టుకుంటాడు.
అటుగా వెళుతున్న రాజ్ ని చూస్తూ త్వరలోనే నీ ప్లేస్ కి నేను వస్తాను అని మనసులో అనుకుంటాడు. మరోవైపు డిజైనర్ జువెలరీ డిజైన్స్ తీసుకువచ్చి మీరు ఫైనల్ చేస్తే నేను రాజ్ సార్ దగ్గరకు తీసుకువెళ్లి అప్రూవల్ చేయించి తీసుకు వస్తాను కస్టమర్స్ కి డిజైన్ పంపించాలి అంటుంది. అప్రూవల్ కోసం రాజ్ దగ్గరికి ఎందుకు అతనికి శ్రమ తగ్గించడం కోసమే నేను ఎక్కడ ఉన్నది అని ఒక నగ సెలెక్ట్ చేసి దీనిని కస్టమర్ కి పంపించండి అని ఆర్డర్ వేయడంతో డిజైనర్ కస్టమర్ కి డిజైన్ పంపిస్తుంది.
అది చూసిన కస్టమర్ రాహుల్ కి ఫోన్ చేసి ఇంత సింపుల్ డిజైన్ పంపించారేంటి అంటూ నిష్టూరంగా మాట్లాడుతాడు. అప్పుడు మెయిల్లో లాగా డిజైన్ చూసి వేరే వాళ్లకు పంపించవలసింది మీకు పంపించేసాను మీకోసం డిజైన్ చేసినవి మళ్లీ పంపిస్తాను అని అతనిని కన్విన్స్ చేసి ఫోన్ పెట్టేసి స్టాఫ్ దగ్గరికి వచ్చి నా అప్రూవల్ లేకుండా డిజైన్ ని ఎందుకు పంపించారు అంటూ కేకలు వేస్తాడు. నేనే పంపించమన్నాను అంటాడు రాహుల్.
అతని రిక్వైర్మెంట్ ఏంటో, అతని బడ్జెట్ ఎంతో తెలియకుండా ఎలా పంపించేస్తావు ఐదు కోట్ల బిజినెస్ పోయేది. ఇకమీదట నా అప్రూవల్ లేకుండా ఏ పని చేయకండి సొంత తెలివితేటలు మీ పని మీద ఉపయోగించండి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్. సీన్ కట్ చేస్తే ఇదే విషయం మీద ఇంట్లో గొడవ పడుతూ ఉంటుంది రుద్రాణి.
ఊరికే రాజ్ అలా మందలించడు నీ కొడుకు ఏదో తప్పు చేసి ఉంటాడు అంటూ రాజ్ ని ఇంట్లో వాళ్ళందరూ వెనకేసుకు వస్తారు. ఇంతలోనే రాజ్ ఇంటికి రావడంతో నా కొడుకు ఏమైనా మీరు నీకు బానిసలాగా కనిపిస్తున్నాడా అంటే రాజ్ మీద రెచ్చిపోతుంది రుద్రాణి. రుద్రాణి మీద కేకలు వేస్తుంది కావ్య. నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అంటుంది అపర్ణ. మావయ్య గారిని ఎవరైనా ఏమైనా అంటే మీరు ఊరుకుంటారా అని నిలదీస్తుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.