Brahmamudi: అపర్ణని రెచ్చగొట్టిన రుద్రాణి.. విడిపోనున్న రాజ్ కుటుంబం!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్తో ముందుకు సాగుతుంది. పుట్టింట్లో కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టి ఆనందపడుతున్న ఒక ఆడపడుచు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు వద్దంటున్నా నీ కోడలు పనిమనిషికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళింది. ఇప్పుడు ఇంట్లో వాళ్లే కాదు పని మనుషులు కూడా నీ మాట వినరు అంటూ రెచ్చగొడుతుంది రుద్రాణి. ఇప్పుడు కావ్య ఎక్కడ అని అడుగుతుంది అపర్ణ. పని మనిషికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళింది అని రుద్రాణి చెప్పడంతో హాల్లోకి వస్తుంది అపర్ణ.
అప్పుడే కావ్య వచ్చి శాంతకి డబ్బులు ఇవ్వబోతుంది. ఆగు అప్పుడే పని వాళ్ళకి డబ్బులు ఇచ్చే అంత స్వేచ్ఛ అధికారం వచ్చేసాయా.. అయినా ఎవరిని అడిగి ఇస్తున్నావు నేను ఇవ్వను అన్నా కూడా నువ్వు ఇస్తున్నావు అంటే నీకు ఎంత అహంకారం అంటూ కేకలు వేస్తుంది. ఆ హడావిడి కి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు.
మీరు డబ్బు ఇవ్వనన్నారు అన్న విషయం నాకు తెలియదు అంటుంది కావ్య. నీకు తెలుసు అంతా నీ ముందే జరిగింది నేను చూశాను అంటూ సాక్ష్యం చెప్తుంది రుద్రాణి. చిట్టి ఏం జరిగింది అని అడుగుతుంది. మీరందరూ నా పెద్దరికాన్ని తుంగలో తొక్కి మనవరాలిని నెత్తి మీద పెట్టుకున్నారు కదా ఇప్పుడు చూడండి.
నన్ను కాదని పనిమనిషికి డబ్బులు దానం చేస్తుంది అంటూ కోడలి మీద కంప్లైంట్ చేస్తుంది అపర్ణ. ఎందుకిలా చేశావు అంటూ కావ్యని మందలిస్తుంది చిట్టి. నిజంగానే అత్తయ్య ఇవ్వను అన్నారు అనే విషయం నాకు తెలియదు అంటుంది కావ్య. అప్పుడు సుభాష్ నువ్వు రుద్రాణి మాటలు వినటం ఎప్పుడు నేర్చుకున్నావు అంటూ అపర్ణని మందలిస్తాడు సుభాష్.
ఇంతలో పనిమనిషి ఏదో మాట్లాడబోతుంటే ఆమె మీద కోప్పడి నీవల్లే ఇదంతా, అందరూ కలిసి నన్ను తప్పు పడుతున్నారు. నీకు కావాల్సిందే డబ్బే కదా అని చెప్పి కావ్య చేతిలో డబ్బు తీసి పనిమనిషి చేతిలో పెడుతుంది రుద్రాణి. నాకు ఈ డబ్బు వద్దు ఈ డబ్బు వల్లే ఇంత గొడవ జరుగుతుంది అంటుంది శాంత. ఈ గొడవ జరుగుతున్నది డబ్బు వల్ల కాదు, నీకు అవసరం ఉందన్నావ్ కదా తీసుకువెళ్ళు అని కావ్య చెప్పటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శాంత.
చూశారా అత్తయ్య గారు ఈ గొడవ డబ్బు గురించి జరగటం లేదు అని చెప్తుంది అంటుంది అపర్ణ. అవును వదిన నీ అహంకారం గురించి జరుగుతుందని ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది రుద్రాణి. రుద్రాణి మీద కేకలు వేస్తాడు సుభాష్. ఇంటి పనిమనిషి అవసరానికి డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడ పోయే పరువు నాది, మా నాన్నది, నా కొడుకుది నువ్వు ఇంట్లో గొడవలు పెట్టకు అంటూ హెచ్చరిస్తాడు.
కావ్య కూడా ఈ ఇంట్లో కోడలుగా మీకు ఎంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది అనుకున్నాను అంటుంది. నువ్వు నేను ఒకటేనా నువ్వెంత నీ బ్రతుకెంత అంటూ ఆమె మీద చేయి ఎత్తుతుంది అపర్ణ. ఆమె చేతిని పట్టుకొని ఆపుతాడు రాజ్. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. తప్పు చేస్తున్నావ్ మమ్మీ ఇప్పటివరకు ఈ ఇంట్లో ఎవరి మీద ఎవరు చెయ్యత్తలేదు అంటాడు రాజ్. అయినా తనేమీ సొంతంగా నిర్ణయం తీసుకోలేదు నన్ను అడిగి నేను ఇవ్వమంటేనే డబ్బు ఇచ్చింది అంటాడు.
ఇప్పుడేమంటావు ఇందాకట్నుంచి అధికారం, పెద్దరికము అంటూ ఏవేవో మాట్లాడావు అంటూ సీతారామయ్య దంపతులు అపర్ణని మందలిస్తారు. ధాన్యలక్ష్మి దంపతులు కూడా నువ్వు చేసింది ఏమీ బాగోలేదు అంటూ తప్పు పడతారు. వాళ్లందరికీ సారీ చెప్తుంది అపర్ణ. ఇంట్లో నేను ఏం చేసినా తప్పే, అందరూ కలిపి నన్ను ఒంటరిదాన్ని చేశారు. మీ ఇంట్లో నేను ఉంటాను కానీ ఒంటరిగా జడ పదార్థంలా ఉంటాను. ఈరోజు అవమానం జరిగింది కావ్యకి కాదు ఇంటి కోడలిగా నాకు అంటూ ఎమోషనల్ అవుతుంది అపర్ణ.
తరువాయి భాగంలో అపర్ణ తన భోజనం తానే వండుకొని విడిగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. అత్తగారు అడిగితే నేను ఇలాగే ఉంటాను, నా పనులు నేనే చేసుకుంటాను అంటుంది. అప్పుడు ఆమె ముందు కొన్ని పత్రాలు పెట్టి విడిపోయేటప్పుడు వంట గదిలో మాత్రమే ఎందుకు విడిపోవాలి ఆస్తులు పంచుకొని మొత్తంగా విడిపోండి అంటుంది చిట్టి. ఆ మాటతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.