`రైడ్ 2`రెండో రోజు కలెక్షన్లు.. అజయ్ దేవగన్ కిది టెస్టింగ్ టైమ్
అజయ్ దేవగన్ నటించిన 'రైడ్2' సినిమా రెండో రోజు కలెక్షన్స్ లో భారీగా తగ్గుదల కనిపించింది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు కలెక్షన్స్ తగ్గినప్పటికీ, డబుల్ డిజిట్ లోనే వసూళ్లు సాధించింది. `రైడ్ 2` రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అనేది చూద్దాం.

రైడ్ 2 మూవీ
2008 లో విడుదలైన 'రైడ్' సినిమాకి సీక్వెల్ 'రెయిడ్ 2'. ఈ చిత్రం మే 1న మే డే సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య ఆడియెన్స్ ముందుకు వచ్చిందీ చిత్రం. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ మూవీకి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. రితేష్ ముఖ్య పాత్ర పోషించారు.
రైడ్ 2 మూవీ
మొదటి రోజు అంటే గురువారం ఈ సినిమా దాదాపు 19.25 కోట్ల రూపాయలు వసూలు చేసి, 2025 లో ఇప్పటివరకు మూడో అతిపెద్ద బాలీవుడ్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది. దీంతో బాలీవుడ్ వర్గాలు ఊపీరి పీల్చుకున్నాయి. ఈ మూవీ పెద్ద హిట్ దిశగా వెళ్తుందని అంతా భావించారు.
రైడ్ 2 మూవీ
అయితే, రెండో రోజు ఈ సినిమా వసూళ్లు దాదాపు 38.9 శాతం తగ్గి, sacnilk.com నివేదిక ప్రకారం దాదాపు 11.75 కోట్ల రూపాయలకు పరిమితమైంది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు తగ్గడం కామనే. కానీ ఈ మూవీ విషయంలో పుంజుకుంటుందని భావించారు. అది రివర్స్ అయ్యింది.
రైడ్ 2 మూవీ
భారతదేశంలో ఈ సినిమా రెండు రోజుల నెట్ కలెక్షన్ దాదాపు 31 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 39-40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.
రైడ్ 2 మూవీ
'రైడ్ 2' కి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి, మౌత్ పబ్లిసిటీ కూడా అద్భుతంగా ఉంది. వారాంతంలో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం వసూళ్లు పుంజుకుంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
`రైడ్ 2' లో అజయ్ దేవగన్ మరోసారి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి అమయ్ పట్నాయక్ పాత్రలో కనిపించారు. రితేష్ దేశ్‌ముఖ్ విలన్ మనోహర్ ధంకడ్ అలియాస్ దాదా భాయ్ పాత్రలో నటించారు. వీరితో పాటు సౌరభ్ శుక్లా, వాణీ కపూర్, గోవింద్ నామ్‌దేవ్, రజత్ కపూర్, అమిత్ సియాల్ కీలక పాత్రలు పోషించారు.