MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi: ప్లాన్ మీద ప్లాన్ వేస్తున్న రాహుల్.. ప్రెగ్నెంటై అందరికీ షాకిచ్చిన స్వప్న!

Brahmamudi: ప్లాన్ మీద ప్లాన్ వేస్తున్న రాహుల్.. ప్రెగ్నెంటై అందరికీ షాకిచ్చిన స్వప్న!

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తన మీద పడిన నిందని చెరుపుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఇల్లాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : May 29 2023, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎపిసోడ్ ప్రారంభంలో భర్తని పక్కకు తీసుకువెళ్లి తనతోపాటు బయటికి రమ్మంటుంది కావ్య. ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు బయటికి రావటం కుదరదు అయినా ఫంక్షన్లప్పుడు  బయటకు పోవడం మీ వంశాచారమా అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. అయితే మీ ఫోన్ ఇవ్వండి అంటుంది కావ్య. ఎందుకు అంటాడు రాజ్. నిజం నిరూపించడానికి అంటుంది కావ్య. రుజువులు సృష్టిస్తావా అంటాడు రాజ్.

29

అయితే మీతో మీరు కూడా నాతో పాటు రండి లేకపోతే మీ ఫోన్ ఇవ్వండి అంటూ కళ్ళు ఎర్ర చేస్తుంది కావ్య. చూపులు చూడు ఎలా ఉన్నాయో అనుకుంటూ ఫోన్ ఆమె చేతిలో పెట్టి త్వరగా రమ్మని చెప్తాడు రాజ్. మరోవైపు స్వప్న ఇంట్లో కూడా నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంటికి వచ్చిన అమ్మలక్కలు ఈసారైనా నిజం చెప్పావా లేకపోతే పెళ్లి వాళ్ళు మధ్యలోనే వెళ్లిపోతారు. అయినా లేచిపోయిన దాన్ని కూడా పెళ్లి చేసుకుంటున్నాడు అంటే వాడికి ఎన్ని రోగాలు ఉన్నాయో అంటూ మాట్లాడుతారు.

39

ఇరుగు పొరుగు అంటే కష్టానికి సుఖానికి తోడవ్వాలి కానీ ఇలా కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద రాళ్లు వేయకూడదు అంటూ వాళ్ళు చెప్పిన రహస్యాలు వాళ్లకే చెప్పి వాళ్ళ మధ్యలో గొడవలు సృష్టిస్తుంది మీనాక్షి. వాళ్లలో వాళ్లు తిట్టుకుంటుంటే బయటకు వెళ్లి పని పూర్తి చేసుకొని రండి అప్పుడు తాంబూలం ఇస్తాను అని వాళ్ళని పంపించేస్తుంది మీనాక్షి. మరోవైపు కావ్య బయటకు వెళ్ళటం గమనిస్తాడు రాహుల్. ఈ టైంలో బయటకు వెళుతుంది అంటే కచ్చితంగా నన్ను ఇరికించడానికే అనుకుంటూ రౌడీ కి ఫోన్ చేసి కావ్యని వెంబడించమంటాడు.

49

మరోవైపు తన కొడుకు ఎంగేజ్మెంట్ కి ఎవరు హెల్ప్ చేయట్లేదు అంటూ అన్నలని వదినలని అందరినీ నిష్ఠురమాడుతుంది రుద్రాణి. రుద్రాణి చాలా కంగారుపడుతుంది అంటాడు సీతారామయ్య. తన చేతుల మీదుగా జరుగుతుంది కదా అందుకే ఆ మాత్రం కంగారు ఉంటుంది అంటుంది చిట్టి. మీ అన్నలు ఇప్పుడే వచ్చిన చేయవలసిన పనులు ఎప్పుడో చేసేసాము అంటాడు సుభాష్.

59

వియ్యాల వారు రాకముందే రుద్రాణి మనతో కయ్యాలు పెట్టుకుంటుంది ఇంక వచ్చాక ఇంకేం చేస్తుందో అంటాడు కళ్యాణ్ తండ్రి. మేము అన్ని పనులు చేశాం కాబట్టే నువ్వు చేయటానికి ఏ పని లేక మమ్మల్ని సతాయిస్తున్నావు అంటాడు రాజ్. మరోవైపు అరుంధతి వెన్నెల వస్తారు. వాళ్లని రిసీవ్ చేసుకోవటానికి వెళ్దాం రమ్మంటుంది రుద్రాణి. వాళ్ల దగ్గర నీకు 1000 కోట్లు కనిపిస్తున్నాయేమో కానీ అది నా ఫ్రెండ్ తనే వస్తుంది అంటుంది అపర్ణ.

69

రుద్రాణి తనే వెళ్లి రిసీవ్ చేసుకుంటే వాళ్ళు రుద్రాణి ని కాకుండా అపర్ణని పలకరించి నువ్వు ఉండబట్టే ఈ సంబంధాన్ని ఖాయం చేశాను అంటుంది అరుంధతి. ఆ మాటలకి రుద్రాణి హర్ట్ అవుతుంది. తన గదిలో ముస్తాబవ్వమంటుంది  రుద్రాణి. అపర్ణ రూములో నాకు కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పి అపర్ణ రూమ్ కి వెళ్ళిపోతారు అరుంధతి వాళ్ళు. పెళ్లి సంబంధాన్ని చెడగొట్టిన చెడగొడతారు వెళ్లి నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను అని కూతుర్ని పంపిస్తుంది రుద్రాణి.

79

మరోవైపు కావ్య, శృతిని కలవటాన్ని చూసి అదే విషయాన్ని రాహుల్ కి చెప్తాడు రౌడీ. కంగారుపడిన రాహుల్ వాళ్ళని ఇటు ఇంటికి కానీ చేయండి అవసరమైతే కిడ్నాప్ చేయండి. వాళ్లు ఎవరిని కలవకూడదు అంతే అంటూ ఆర్డర్ పాస్ చేస్తాడు రాహుల్. అప్పుడే అటుగా వచ్చిన రాజ్ రాహుల్ ని పిలుస్తాడు. తన మాటలు రాజ్ వినసడేమో అనుకొని కంగారు పడతాడు రాహుల్.

89

కానీ రాజ్ నేరుగా వచ్చి ఈ టైంలో ఫోన్లో ఏంటి అందరూ కింద నీ కోసం వెయిట్ చేస్తున్నారు రా అని చెప్పి రాహుల్ ని తీసుకువెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే కళ్యాణ్ పప్పు వాళ్ళ ఇంటికి వచ్చి లెటర్ని ఇస్తాడు. ఇది మీ స్వప్నక్కకి నిశ్చితార్థం అయిన తర్వాత మీ కావ్య అక్క ఇమ్మందని చెప్తాడు. మరోవైపు కావ్య వాళ్ళని కిడ్నాప్ చేస్తారు రౌడీలు. మరోవైపు కావ్యని నిశ్చితార్థానికి పిలవలేదా అని కనకాన్ని అడుగుతుంది ఒక ఆవిడ.

99

తనకు ఎక్కడ ఖాళీ ఉంటుంది దుగ్గిరాల వారింటి కోడలు కదా అంటుంది మరో అమ్మలక్క. ఈ మాటలు వింటున్న స్వప్న అందరూ కావ్యని పొగిడేవాళ్లే  అనుకుంటుంది. తరువాయి భాగంలో కావ్య వాళ్ళని గదిలో బంధిస్తారు రౌడీలు. మరోవైపు స్వప్న కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆమెని చెక్ చేస్తాడు పెళ్లి కొడుకు. ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. మరోవైపు ఘనంగా రాహుల్ నిశ్చితార్థం అయిపోతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image2
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image3
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved