MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Flora Saini: 14 నెలలు నరకం అనుభవించా, ఆ నిర్మాత నా జీవితాన్ని నాశనం చేశాడు.. బిగ్‌ బాస్‌ నటి సంచలన విషయాలు వెల్లడి

Flora Saini: 14 నెలలు నరకం అనుభవించా, ఆ నిర్మాత నా జీవితాన్ని నాశనం చేశాడు.. బిగ్‌ బాస్‌ నటి సంచలన విషయాలు వెల్లడి

Flora Saini: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నటి ఫ్లోరా సైనీ, తన నిర్మాత,  బాయ్‌ఫ్రెండ్ చేతిలో 14 నెలల పాటు నరకం చూసిందట.  శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు అనుభవించిందట. ఆ విషయాన్ని పంచుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 30 2026, 09:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 టాలీవుడ్‌లో స్టార్‌ గా రాణించిన ఫ్లోరా సైనీ
Image Credit : Asianet News

టాలీవుడ్‌లో స్టార్‌ గా రాణించిన ఫ్లోరా సైనీ

ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) టాలీవుడ్, కోలీవుడ్‌లో చాలామంది స్టార్ హీరోలతో నటించి పేరు తెచ్చుకుంది.  తెలుగులో `ప్రేమతో రా`, 'ప్రేమ కోసం', 'నరసింహ నాయుడు', `నువ్వు నాకు నచ్చావ్‌` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో ఒకప్పుడు బిజీ హీరోయిన్‌గా రాణించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బాయ్‌ ఫ్రెండ్‌ వల్ల నరకం అనుభవించిన ఫ్లోరా
Image Credit : instagram/flora saini

బాయ్‌ ఫ్రెండ్‌ వల్ల నరకం అనుభవించిన ఫ్లోరా

కొంత కాలం టాలీవుడ్‌కి దూరమైన ఫ్లోరా ఈ మధ్యనే మళ్లీ మెరిసింది. బిగ్‌ బాస్‌ తెలుగు 9లో సందడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఇప్పుడు తన జీవితంలో జరిగిన ఓ భయంకరమైన సంఘటన వైరల్ అవుతోంది. తన బాయ్‌ఫ్రెండ్, ప్రముఖ నిర్మాత అయిన గౌరంగ్ దోషి చేతిలో తాను అనుభవించిన నరకాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

Related Articles

Related image1
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?
Related image2
NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం
36
ప్రియుడి చేత చిత్ర హింసలు అనుభవించిన ఫ్లోరా సైనీ
Image Credit : instagram/flora saini

ప్రియుడి చేత చిత్ర హింసలు అనుభవించిన ఫ్లోరా సైనీ

'ప్రేమలో పడిన కొద్ది రోజులకే అతనిలోని రాక్షసుడు బయటపడ్డాడు. అతను నా ప్రైవేట్ భాగాలపై తన్నేవాడు, నా ముఖాన్ని బాక్సింగ్ బ్యాగ్‌లా వాడుకునేవాడు. ఎవరికీ ఫోన్ చేయనిచ్చేవాడు కాదు. సినిమాల్లో నటించొద్దని బెదిరించేవాడు. అతని కోసం అందరినీ వదిలేస్తే, నన్ను ఇలా హింసించాడు. ఒకరోజు నా పొట్టపై బలంగా తన్నాడు. దాంతో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాను' అని ఫ్లోరా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దెబ్బలు తిన్న తన ఫోటోలను కూడా షేర్ చేసింది.

46
మళ్లీ యాక్టింగ్‌ స్టార్ట్ చేసిన ఫ్లోరా
Image Credit : instagram/flora saini

మళ్లీ యాక్టింగ్‌ స్టార్ట్ చేసిన ఫ్లోరా

అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్లోరా, తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. చాలా నెలల తర్వాత కోలుకుని మళ్లీ నటన ప్రారంభించింది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'భేడియా'లోనూ ఆమె కనిపించింది. 'నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. నాకు ప్రేమ కూడా దొరికింది. మిమ్మల్ని ఎంత చీకటి ఆవరించినా, చివరికి వెలుగు తప్పక వస్తుంది' అని ఫ్లోరా సైనీ ధైర్యంగా చెప్పింది.

56
ఫ్లోరా నేపథ్యం
Image Credit : Instagram

ఫ్లోరా నేపథ్యం

ఫ్లోరా సైనీ చండీగఢ్‌కు చెందిన నటి. 1999లో 'ప్రేమకోసం' అనే తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. చాలా తెలుగు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హిందీ, కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ కనిపించింది. నిర్మాత గౌరంగ్ దోషి తన జీవితాన్ని నరకం చేశాడని ఆమె గతంలో ఆరోపించింది.

66
మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఫ్లోరా
Image Credit : Instagram

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఫ్లోరా

తాను అనుభవించిన చేదు అనుభవాన్ని ఫ్లోరా ఇలా చెప్పుకొచ్చింది. 'నేను 20 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి వచ్చాను. 20 మందికి పైగా టాప్ డిజైనర్ల కోసం మోడలింగ్ చేశాను. అప్పటి వరకు అంతా బానే ఉంది. ఆ తర్వాత ఒక నిర్మాత వలలో పడ్డాను. అక్కడి నుంచి నా జీవితం నరకమైపోయింది' అని ఫ్లోరా తన పోస్ట్‌లో రాసింది. ఇప్పుడిది వైరల్‌గా మారింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Suspense Thriller OTT: మూడు మరణాలు, ఒకే అనుమానం! ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్, ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image2
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
Recommended image3
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Related Stories
Recommended image1
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved