MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi: భర్త మీద రివెంజ్ తీర్చుకుంటానంటున్న కావ్య.. రాహుల్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

Brahmamudi: భర్త మీద రివెంజ్ తీర్చుకుంటానంటున్న కావ్య.. రాహుల్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నుంచి తప్పించుకోవటం కోసం ఆమెనే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక యువకుడి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
| Updated : Jun 09 2023, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

 ఎపిసోడ్ ప్రారంభంలో ఒక కిడ్నాప్ దగ్గరికి వచ్చి స్వప్న ఫోటో చూపిస్తాడు రాహుల్. ఎవరు సార్ ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది అని అడుగుతాడు  ఆ కిడ్నాపర్. తను నాకు కాబోయే భార్య అని రాహుల్ చెప్పేసరికి షాక్ అవుతాడు కిడ్నాపర్. రాహుల్ కి సారీ చెప్పి ఏం చేయాలి సార్ కిడ్నాప్ చేసి మీ దగ్గర పడేయాలా అని అడుగుతాడు కిడ్నాపర్.

210

కాదు నా దగ్గర నుంచి కిడ్నాప్ చేసి నీ దగ్గర పడేయాలి అంతే కాదు నువ్వు పెళ్లి కూడా చేసుకోవాలి అనేసరికి ఆ కిడ్నాపర్ ఆనందంతో గాల్లో తేలిపోతాడు. ఎవరైనా డబ్బులు దానం చేస్తారు, అన్నదానం చేస్తారు కానీ ఇలా కాబోయే భార్యని దానం చేసే వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నాను ఇంక మీరు నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అంటాడు కిడ్నాపర్.
 

310

రేపే నా పెళ్లి నువ్వు నా దగ్గరికి వస్తే లోపలికి తీసుకువస్తాను. ఆ తర్వాత మిగతాదంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. సీన్ కట్ చేస్తే నేల మీద పడుకున్న రాజ్ కి నిద్రలేచేటప్పటికీ మెడ పట్టేస్తుంది. అనవసరంగా పంతానికి పోయాను అనుకుంటాడు. ఇంతలోనే కావ్య వచ్చి పెళ్లి పనుల కోసం అమ్మమ్మ గారు లిస్ట్ ఇచ్చారు ఇదిగోండి అని ఇస్తుంది. చెయ్యి వెనక్కి పెట్టి చేతికి ఇమ్మంటాడు రాజ్.
 

410

ఏమైంది అని అడుగుతుంది కావ్య. నీ మొహం చూడటం ఇష్టం లేదు అంటాడు రాజ్. మెడ పట్టేసింది అని చెప్పొచ్చు కదా అని నవ్వుతుంది కావ్య. ఇంతలోనే ధాన్యలక్ష్మి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. మీ అబ్బాయిగారు రాత్రి అంటూ సిగ్గుపడుతుంది కావ్య. ఏం అర్థమవుతుందో ఏమో కానీ ఆయింట్మెంట్ ఏదైనా రాయమ్మా అని చెప్పి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి.
 

510

ఆవిడ ఎందుకు అంతలా సిగ్గు పడిపోతుంది అంటాడు రాజ్. కొడుకు ఎంత రొమాంటిక్కో అనుకుంటున్నారు అని నవ్వుతుంది కావ్య. ఆ మాటలకి ఇరిటేట్ అవుతాడు రాజ్. ఇంతలోనే కళ్యాణ్ వచ్చి నానమ్మ ఏదో లిస్ట్ నీ దగ్గర ఉందని చెప్పింది ఏది అని అన్నని అడుగుతాడు కళ్యాణ్. రాజ్ మెడ పట్టేసి ఉండడం గమనించి ఏం జరిగింది అని అడుగుతాడు. ఏమీ లేదు కానీ నువ్వు వెళ్లి డాక్టర్ని పిలుచుకొని రా అంటాడు రాజ్.

610

 ఈ మాత్రానికే డాక్టర్ ఎందుకు కవి గారు మీరు మీ అన్నయ్య చేతులు పట్టుకోండి అని కళ్యాణ్ కి చెప్పి రాజ్ ని  మంచం మీద కూర్చోబెట్టి అతని తలని చేత్తో పట్టుకుంటుంది కావ్య. మీరిద్దరూ కలిపి నా మీద ప్రయోగాలు చేయొద్దు అంటూ గోల పెడతాడు రాజ్. పాత కక్షలు ఏమైనా మనసులో పెట్టుకున్నావా వదిన అంటూ పాత విషయాలన్నీ గుర్తు చేస్తాడు కళ్యాణ్. సరియైన సమయానికి గుర్తు చేశారు నా భర్త మీద రివెంజ్ తీర్చుకుంటాను అంటూ మెడని తిప్పుతుంది కావ్య. ఒక్కసారిగా కేక పెడతాడు రాజ్.

710

నా మెడ ని విరిచేసింది అంటూ గోల పెడతాడు. ఏం లేదు అన్నయ్య నీ మెడ సెట్ అయిపోయింది కావాలంటే చూసుకో అంటాడు కళ్యాణ్. అప్పుడు తన మెడ సెట్ అయినట్టుగా గమనిస్తాడు రాజ్. కళావతి నాటువైద్యం కూడా తెలిసినట్లుంది  అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏదో పని మీద మెట్లు ఎక్కుతున్న కావ్య అనుకోకుండా రాజ్ ని గుద్దేస్తుంది. రాజ్ కావ్యకి చివాట్లు పెడతాడు.

810

 రాత్రి మీరు రావలసింది నా గదికే అక్కడికి రండి.. కోడి మెడ తిప్పినట్టు తిప్పేస్తాను అని హెచ్చరించి వెళ్ళిపోతుంది కావ్య. ఇదంతా పైనుంచి చూస్తారు రుద్రాణి, రాహుల్. వాళ్లని చూసి ఎంజాయ్ చేస్తున్నావా నాకు ఈ పెళ్లి అయిపోతుందేమో అని కంగారుగా ఉంది అంటుంది రుద్రాణి. నువ్వేమీ కంగారు పడకు ఈ పెళ్లి జరగదు అని తల్లికి ధైర్యం చెప్తాడు రాహుల్. ఇప్పుడు నేను నిన్ను నమ్మడం తప్పితే వేరే ఆప్షన్ లేదు అని  కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి.
 

910

ఆ తర్వాత కావ్య అక్కడికి వచ్చి పెళ్లి తప్పించుకోవటానికి ప్లాన్ వెయ్యొద్దు రాజ్ నిన్ను మాటిమాటికీ క్షమించడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ పెళ్లి జరిగినప్పుడు కదా అప్పుడు చూద్దాంలే అని మనసులో అనుకుంటాడు రాహుల్. సీన్ కట్ చేస్తే కనుక మీ ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్లడానికి రెడీ అవుతారు. పెళ్లికి రాను అంటుంది అప్పు పెద్దమ్మ. ఆమెని బలవంతంగా పెళ్లికి రావడానికి ఒప్పిస్తారు అప్పు వాళ్ళు.

1010

ఇంతలోనే మీనాక్షి వస్తుంది. నా నగలు ఏవి అని చెల్లెల్ని అడుగుతుంది. ఇప్పుడే తెచ్చిస్తానని వెనక్కి తిరిగేసరికి అవే నగలు వేసుకొని స్వప్న కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతారు కనకం, మీనాక్షి. తరువాయి భాగంలో మెహేంది ఫంక్షన్ లో భార్యల చేతికి గోరింటాకు భర్తలే మెహందీ పెట్టాలి  అంటాడు కళ్యాణ్. రాజ్ కూడా కావ్య కి మెహందీ పెడతాడు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu: పేదరాలిగా చస్తా కానీ, పేదరాలిగా బతకను.. ఫ్యామిలీపై తాప్సీ ఫన్నీ కామెంట్
Recommended image2
విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట
Recommended image3
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved