MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవిని తొలగించారు, 9 ఏళ్లకు సీన్ రివర్స్..మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వకుంటే కెరీర్ క్లోజ్

Chiranjeevi: చిరంజీవిని తొలగించారు, 9 ఏళ్లకు సీన్ రివర్స్..మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వకుంటే కెరీర్ క్లోజ్

కెరీర్ బిగినింగ్ లో చిరంజీవిని ఓ సినిమా నుంచి తొలగించారు. తొమ్మిదేళ్ల తర్వాత అదే దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. చిరంజీవి ఛాన్స్ ఇవ్వకుంటే ఆ డైరెక్టర్ కెరీర్ క్లోజ్ అయ్యే పరిస్థితి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2026, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగాస్టార్ చిరంజీవి
Image Credit : stockPhoto

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. తన ప్రతిభని చాటుకునేందుకు అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి విలన్ గా కూడా నటించారు. ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, మురళి మోహన్ లాంటి హీరోలతో చిరంజీవి నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి, ఎన్టీఆర్ కాంబినేషన్
Image Credit : Asianet News

చిరంజీవి, ఎన్టీఆర్ కాంబినేషన్

ఎన్టీఆర్ తో చిరంజీవి తిరుగులేని మనిషి అనే మూవీలో నటించారు. మరో చిత్రంలో కూడా ఎన్టీఆర్ తో కలసి నటించే అవకాశం చిరంజీవికి దక్కింది. ఆ మూవీ కొండవీటి సింహం. ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకుడు. చిరంజీవి ఈ మూవీలో నటిస్తున్నారు అని కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని రోజుల తర్వాత చిరంజీవిని తొలగించి మోహన్ బాబుని ఆ పాత్ర కోసం తీసుకున్నారు.

Related Articles

Related image1
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్
Related image2
Tollywood లో ఆరుగురు అండర్ రేటెడ్ హీరోయిన్లు, టాలెంట్ కి తగ్గ గుర్తింపు లేదు.. ఎక్కడ తేడా కొట్టింది ?
35
ఎన్టీఆర్ మూవీ నుంచి చిరంజీవి అవుట్
Image Credit : Asianet News

ఎన్టీఆర్ మూవీ నుంచి చిరంజీవి అవుట్

ఎన్టీఆర్, చిరంజీవి కాంబోలో వచ్చిన తిరుగులేని మనిషి మూవీ ఫ్లాప్ అయింది. అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని చిరంజీవిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దీనితో చిరంజీవి చాలా నిరాశ పడ్డారట. కానీ విధి ఎంత విచిత్రమైనదో ఈ సంఘటనని బట్టి అర్థం చేసుకోవచ్చు.

45
తిరుగులేని హీరోగా చిరంజీవి
Image Credit : youtube/Alitho Saradaga

తిరుగులేని హీరోగా చిరంజీవి

తనని తొలగించిన తొమ్మిదేళ్లలో చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగారు. నిర్మాత అశ్విని దత్ చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. దర్శకుడు ఎవరైతే బావుంటుంది అనే చర్చ జరుగుతోంది.

55
చిరంజీవి ఛాన్స్ ఇవ్వకుంటే కెరీర్ క్లోజ్
Image Credit : x/production house

చిరంజీవి ఛాన్స్ ఇవ్వకుంటే కెరీర్ క్లోజ్

ఆ టైంలో రాఘవేంద్ర రావు మూడు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. దీనితో ఇండస్ట్రీలో అందరూ రాఘవేంద్ర రావు పని అయిపొయింది అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. చిరంజీవి మాత్రం ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు మాత్రమే దర్శకత్వం వహించాలి అని పట్టుపట్టారు. దీనితో రాఘవేంద్ర రావు కి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఛాన్స్ వచ్చింది ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటూ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంలా మలిచారు. ఒకప్పుడు రాఘవేంద్ర రావు సినిమాలో నుంచి చిరంజీవి తొలగించబడ్డారు. అదే చిరంజీవి.. రాఘవేంద్ర రావు కి అవకాశం ఇచ్చి కెరీర్ ని నిలబెట్టారు. ఈ విషయాన్ని రాఘవేంద్ర రావు అనేక సందర్భాల్లో రివీల్ చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్
Recommended image2
Tollywood లో ఆరుగురు అండర్ రేటెడ్ హీరోయిన్లు, టాలెంట్ కి తగ్గ గుర్తింపు లేదు.. ఎక్కడ తేడా కొట్టింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved