Prema Entha Madhuram: అనుని కిడ్నాప్ చేసిన ఆర్య వర్ధన్.. అతన్ని షూట్ చేసిన రాగసుధ!
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) అనే ఈ సీరియల్ మంచి ప్రేమ నేపథ్యంలో ప్రసారమవుతుంది. పైగా ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు ఈ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

సీరియల్ లో హైలెట్ సీన్స్ ఇప్పుడు చూద్దాం... పోలీస్ జీప్ లో గన్ తీసుకున్న రాగసుధ వెంటనే ఆర్య ఇంటికి వెళుతుంది. కానీ రాగ సుధ (Ragasudha) ను ఆ ఇంటి సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు.
ఇక రాగసుధ (Raga sudha ) ఇంటి బయటే ఉండి ఆర్య కోసం వేచి చూస్తుంది. ఈ లోపు ఆర్య న్యూస్ పేపర్ చదువు కుంటూ బయటకు వస్తాడు. అది గమనించిన రాగ సుధ వెంటనే ఆర్య (Arya) ను టు టైమ్స్ షూట్ చేస్తుంది.
ఇక వెంటనే ఆర్య (Arya) నెల కూలిపోతాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. రాగసుధ నిజంగా షూట్ చేయదు. టిఫిన్ సెంటర్లో షూట్ చేసినట్టు ఊహించుకుంటుంది. వెంటనే సుబ్బు వాళ్ళ జంట రాగసుధ దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. దానికి రాగసుధ (Raga sudha) కవర్ చేసుకుంటుంది.
ఆ తర్వాత రాగసుధ (Raga sudha) నిజంగానే ఆర్యను చంపడానికి బయలుదేరుతుంది. ఆర్య వాళ్ళ ఇంట్లో మాన్సీ 'మన ఆఫీస్ లో ఏదో జరుగుతుంది. కానీ ఎవరికీ తెలియడం లేదు' అని ఆర్య తో అంటుంది. దానికి ఆర్య నీకు అనవసరం అన్నట్లు మాట్లాడుతాడు. ఇక ఈసారి రాగసుధ ఆర్య ఇంటిలోకే వెళుతుంది. ఆర్య (Arya) కోసం ఇంటిలోని గదులన్నీ వెతుకుటుంది.
కానీ ఆర్య, అను (Anu) లు కలిసి కారులో బయటికి వస్తారు. కారు లో అను, ఆర్యలు సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళుతారు. ఆ తర్వాత కొంత సేపటికి ఆర్య.. అను ని కిడ్నాప్ చేస్తున్న అని తీసుకెళతాడు. మరి దానికి అను జోక్ గా తీసుకుంటుంది. మరి ఆర్య (Arya) నిజంగానే అను ని కిడ్నాప్ చేస్తాడో లేదో చూడాలి.
మరోవైపు ఆర్య (Arya) వాళ్ళ ఇంట్లో ఆర్య కోసం వెతుకుతున్న రాఘసుధ కు ఆర్య ఏమాత్రం కనిపించడు. దాదాపు అన్ని గదులు వెతుకేస్తుంది. చివరగా రాగసుధ ఫోటో ఉన్న గదిని తియ్యడానికి ప్రయత్నిస్తుండగా ఆ డోర్ లాక్ చేసి ఉంటుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో రాగసుధ (Raga sudha) ఎవరు కంట పడుతుందో చూడాలి.