Prema Entha Madhuram: జిండే కాళ్లకు గాయం.. అతని నుంచి తప్పించుకున్న రాగసుధ!
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఆఫీసులో జిండే (Jinde) సెక్యూరిటీ, వర్కర్స్ ను బయటకు పంపిస్తాడు. అంతేకాకుండా మీరాను కూడా బయటకు పంపించేస్తాడు. దానికి మీరా (Meera) ఇలా పంపించడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది. ఇక జిండే నేరుగా ఆఫీస్ రూమ్ లోకి వస్తాడు. రూమ్ లో ఫోటో పై రక్తం తో ఉన్న ముద్రను చూసి రాగ సుధను కనిపెడతాడు.
అలా డోర్ వైపు రాగసుధ ఉన్న ప్లేస్ లో గన్ తో కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. అది పసిగట్టిన రాగసుధ (Ragasudha)ఆ గాజుముక్క తో జిండే కాలును గుచ్చి అక్కడినుంచి పారిపోతుంది. ఆ తర్వాత జిండే (Jinde) ఆర్య కు కాల్ చేసి రాగసుధ తప్పించుకున్న విషయం చెబుతాడు. దానికి ఆర్య అలా ఎలా తప్పించుకుంది అని అడుగుతాడు.
వీరిద్దరి సంభాషణ లోపలి లాడ్జ్ లో ఉన్న జలంధర్ వింటూ ఉంటాడు. తర్వాత ఆర్య.. నువ్వు ఏం చేస్తావో తెలియదు.. రాగ సుధ (Ragasudha) దొరికిందన్నా.. గుడ్ న్యూస్ నాకు తెలియాలి అని అంటాడు. ఆ తర్వాత ఆర్య (Arya) అను నోటిలో గోరుముద్దలు కలిపి పెడతాడు. దానికి అను ఎంతో ఆనంద పడుతుంది.
ఆ తర్వాత అను మనసులో 'నా చెల్లెలు వస్తే.. అన్నీ తెరిచిన పుస్తకంలా చెప్పేస్తాను' అప్పుడు అందరం హ్యాపీగా ఉందాం సార్ అని మనసులో అనుకుంటుంది అను (Anu). ఆ తర్వాత ఆర్య (Arya) కళ్ళు మూసుకొని రాగసుధ ఆఫీస్ రూమ్ లో చేసిన దాని గురించి ఆలోచిస్తాడు. ఇక అను ఆర్య కు చెప్పకుండా గుడికి వెళ్ళనే వెళుతుంది.
అక్కడికి వెళ్లి రాగ సుధ వస్తుందేమో అని ఎదురు చూస్తుంది. ఈ లోపు ఆర్య అను ఎక్కడికి వెళ్లిందని కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన అను (Anu) నేను గుడికి వచ్చాను అని సమాధానం చెబుతుంది. అప్పుడే గుడి ఏమిటి? దానికి ఇంకా టైం ఉంది కదా అని అడగగా.. అను (Arya) ఆశ్చర్య పోయినట్టుగా చూస్తుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.