హాస్పిటల్ లో రాధిక శరత్ కుమార్, ఆందోళనలో అభిమానులు, ఏమయ్యింది?
సౌత్ స్టార్ నటి రాధిక శరత్‌కుమార్‌కు హాస్పిటల్ లో చేరారు. డెంగ్యూ లక్షణాలు బయటపడటంతో ఆమె చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధిక శరత్‌కుమార్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆమెను జూలై 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. మొదట ఇది సాధారణ జ్వరంగా భావించినా, వైద్య పరీక్షల అనంతరం ఆమెకు డెంగ్యూ సోకినట్లు తేలింది.
KNOW
వైద్య పర్యావేక్షణలో రాధిక
దినమలర్ అనే తమిళ మీడియా నివేదిక ప్రకారం, రాధిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రత్యేక పర్యవేక్షణతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు ఆమె ఆగస్ట్ 5వ తేదీ వరకు ఆసుపత్రిలోనే ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
అభిమానుల్లో ఆందోళన
రాధిక ఆసుపత్రిలో చేరిన వార్త వైరల్ అవ్వడంతో కోలీవుడ్ పరిశ్రమతో పాటు ఆమె అభిమానుల్లో కలకలం రేగింది. సోషల్ మీడియా వేదికగా #GetWellSoonRaadhika అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అనేకమంది సినీ ప్రముఖులు, సహ నటీనటులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరకుంటున్నారు. రాధికాకు ఫోన్ లో పరామర్శలు వెల్లవెత్తుతున్నట్టు తెలుస్తోంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణం
భారతిరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలోకి వచ్చిన రాధిక, తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడా నటించి మెప్పించింది. రాధిక ఎక్కువగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా సినిమాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది రాధిక. ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లి పాత్రలు చేస్తున్నారు. నటిగా మాత్రమే కాదు నిర్మాతగా, రాజకీయ రంగంలోనూ ఆమె సత్తా చాటారు.