MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: మీనా మనసు ముక్కలు చేసిన మామగారు, బాలు కాళ్లు పట్టుకున్న శివ

Gunde Ninda Gudi Gantalu: మీనా మనసు ముక్కలు చేసిన మామగారు, బాలు కాళ్లు పట్టుకున్న శివ

Gunde Ninda Gudi Gantalu: శివను కాలేజీలో పరీక్షలు రాయించడానికి బాలు సాహసం చేస్తాడు. ఏకంగా పోలీసులు అరెస్టు చేస్తారు. మరి, మీనా ఎలా కాపాడుకుంటుందో చూద్దాం.. 

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 09 2026, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బాలుకి శివ క్షమాపణలు..
Image Credit : Jio Hotstar

బాలుకి శివ క్షమాపణలు..

బాలు అరెస్టు అయినందుకు మీనా చాలా బాధపడుతుంది. అయితే.. ఇలాంటి భర్త నీకు ఎందుకు అక్క.. అని శివ అంటాడు. అయితే.. అసలు జరిగిన విషయం మొత్తం మీనా.. తన తమ్ముడు శివకి చెబుతుంది. దీంతో.. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వస్తారు. వెళ్లి.. పోలీసులకు జరిగిన విషయం మొత్తం మీనా చెబుతుంది. అయినా పోలీసులు వినిపించుకోరు. వాళ్ల పై అధికారులు వచ్చాకే వదిలిపెడతాం అని చెబుతారు.

దీంతో.. మీనా ఎలాగైనా బాలుని బయటకు తీసుకురావాలని.. ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తాను అంటూ బయటకు వెళ్తుంది. ఈ లోగా.. శివ.. బాలుకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతాడు. నా వల్ల మీకు సమస్య వచ్చింది అని శివ ఫీల్ అవుతాడు. అయితే.. బాలు ధైర్యం చెబుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బాలుకి సహాయం చేయమని తండ్రిని అడిగిన శ్రుతి..
Image Credit : Jio Hotstar

బాలుకి సహాయం చేయమని తండ్రిని అడిగిన శ్రుతి..

బాలు అరెస్టు అయినందుకు మీనా చాలా బాధపడుతుంది. అయితే.. ఇలాంటి భర్త నీకు ఎందుకు అక్క.. అని శివ అంటాడు. అయితే.. అసలు జరిగిన విషయం మొత్తం మీనా.. తన తమ్ముడు శివకి చెబుతుంది. దీంతో.. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వస్తారు. వెళ్లి.. పోలీసులకు జరిగిన విషయం మొత్తం మీనా చెబుతుంది. అయినా పోలీసులు వినిపించుకోరు. వాళ్ల పై అధికారులు వచ్చాకే వదిలిపెడతాం అని చెబుతారు.

దీంతో.. మీనా ఎలాగైనా బాలుని బయటకు తీసుకురావాలని.. ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తాను అంటూ బయటకు వెళ్తుంది. ఈ లోగా.. శివ.. బాలుకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతాడు. నా వల్ల మీకు సమస్య వచ్చింది అని శివ ఫీల్ అవుతాడు. అయితే.. బాలు ధైర్యం చెబుతాడు.

34
మొదటిసారి మీనాని తిట్టిన మామగారు..
Image Credit : Jio Hotstar

మొదటిసారి మీనాని తిట్టిన మామగారు..

ఇక...మీనా, శివలను ఇంటికి వెళ్లిపోమ్మని బాలు బలవంత పెడతాడు. దీంతో.. తప్పక మీనా ఇంటికి వెళ్తుంది.ఇంటికి వచ్చిన మీనాపై ప్రభావతి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. బాలు గురించి సత్యం అడిగితే.. ట్రిప్ కి వెళ్లారు అని మీనా అబద్ధం చెబుతుంది. అయితే... పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని ప్రభావతి అసలు విషయం బయట పెడుతుంది. ఆ విషయం విని ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అబద్ధం చెప్పిందని.. ప్రభావతి, మనోజ్ చాలా తక్కువ చేసి మాట్లాడతారు. బాలు ఇంటి పరువు తీశాడు అని.. ప్రభావతి రచ్చ చేస్తుంది. తనకు ఈ విషయం శ్రుతి వాళ్ల అమ్మ చెప్పిందని.. ప్రభావతి గొడవ చేస్తుంది. మీనాని ప్రభావతి దారుణంగా తిడుతుంది. మీనా చాలా ఏడుస్తుంది. అయితే.. బాలు ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? అని సత్యం గట్టిగా అడగడంతో.. మీనా నిజం చెప్పక తప్పదు. అంతా విన్న తర్వాత కూడా మనోజ్.. బాలు చేసింది తప్పు అన్నట్లుగా మాట్లాడతాడు. ఒకరినొకరు తిట్టుకుంటారు.

అయితే.. వాళ్ల గొడవను ఆపి సత్యం మీనాని మందలిస్తాడు. చేసింది మంచి పనే కానీ... చేసే విధానం ఇది కాదు అంటాడు. తనకు చెప్పి ఉంటే... సమస్య ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా అని..ఇంటి పరువు తీయకండి అంటూ మీనాపై సీరియస్ అవుతాడు. అయితే.. ప్రేమగా మాట్లాడే మామ గారు కూడా సీరియస్ అవ్వడంతో.. మీనా చాలా ఏడుస్తుంది. అక్కడితో ఆగకుండా.. ప్రభావతి ఇంకా మీనాని తిట్టాలని చూస్తుంది. దీంతో.. రవి, శ్రుతి.. ప్రభావతికి గడ్డి పెట్టి.. ఆమెను ఆపేస్తారు.

44
గుణ తిక్క కుదిర్చిన బాలు..
Image Credit : Jio Hotstar

గుణ తిక్క కుదిర్చిన బాలు..

ఇక.. మరుసటి రోజు ఉదయాన్నే మీనా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. తన తమ్ముడు, చెల్లెలితో కలిసి ఎస్ఐ కి నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ.. మీనా చెప్పేది.. అసలు ఎస్ఐ వినిపించుకోదు. బాలు కి కచ్చితంగా జైలు శిక్ష వేయిస్తాను అని చెబుతుంది. ఇక.. జరిగిన విషయం మొత్తం శివ ఆ పోలీసులకు వివరిస్తాడు. దీంతో.. పోలీసులు బాలుని వదిలేస్తారు. ఇంకోసారి ఇలా చేయద్దని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. బయటకు వచ్చిన తర్వాత.. బాలు కాళ్లు పట్టుకొని మరీ.. శివ క్షమాపణలు చెబుతాడు.

వీళ్లు ఇలా బయటకు రాగానే.. రాజేష్ ఫోన్ చేసి.. గుణ ఎక్కడ ఉన్నాడో తెలిసిందని చెబుతాడు. వెంటనే బాలు బయలుదేరి వెళతాడు. బాలు, రాజేష్ ఇద్దరూ ప్లాన్ చేసి... గుణ ని వడ్డీకి డబ్బులు కావాలని ట్రాప్ చేస్తారు. గుణ రాగానే... బాలు చితక బాదుతాడు. మరోసారి గుణ చేతులు విరిచేస్తాడు. మెడ కూడా విరగ్గొడతాడు. తర్వాత.. బాలు, మీనా ఇంటికి వెళతారు. ఇంట్లోకి వెళ్తుంటే..ప్రభావతి ఆపుతుంది. ఇక, ప్రభావతి, మనోజ్ కలిసి మీనాని తిట్టడం మొదలుపెడతారు. ఇంట్లో పనులు చేయలేదు.. కాఫీ ఇవ్వలేదని మీనాని తిడతారు. అయితే.. తన భార్య ఒక్కతే ఇంట్లో ఆడదా అని బాలు రచ్చ చేస్తాడు. ఇవన్నీ పట్టించుకోకుండా.. మీనా వెళ్లి.. బాలుకి దిష్టి తీస్తుంది. అయితే.. బాలు చేసిన పనికి సత్యం కోపంగా ఉంటాడు. దీంతో.. తాను ఏ తప్పు చేయలేదని బాలు వాళ్ల నాన్నకు నచ్చ చెబుతాడు. అయినా ప్రభావతి మీనా పుట్టింటిని తక్కువ చేసి మాట్లాడితే.. మీనా సరిగ్గా సమాధానం చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: శివని కాపాడబోయి చిక్కుల్లో బాలు, బాలు అరెస్ట్, ఏడేళ్ల జైలు శిక్ష..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved