MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్, శోభన్ బాబు ను ర్యాగింగ్ చేసి.. ఏడిపించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

ఏఎన్నార్, శోభన్ బాబు ను ర్యాగింగ్ చేసి.. ఏడిపించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

అలనాటి హీరోలలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి సీనియర్లు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. వారితో మాట్లాడటానికికే భయపడు వారు. ఎన్టీఆర్ తో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఏఎన్నార్, శోభన్ బాబును ర్యాగింగ్ చేసి, ఏడిపించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 04 2026, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పించిన నటులు..
Image Credit : Asianet News

తెలుగు పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పించిన నటులు..

టాలీవుడ్ తొలితరం హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి నటులు.. తెలుగు పరిశ్రమకు విలువలు నేర్పించారు. వారి తరువాతి తరం నటులకు ఆదర్శంగా నిలిచారు. షూటింగ్ టైమ్ ఫాలో అవ్వడం, అందరికి గౌరవం ఇవ్వడం, దర్శకుల మాటలకు విలువివ్వడం, నిర్మాతలను దైవంగా భావించడం లాంటివి వారి నుంచి నేర్చుకోవల్సినవి. 

ఓ సందర్భంలో అక్కినేని కూడా ఈ మాట అన్నారు.. నేను మా బ్రదర్ రామారావు ఫిల్మ్ ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పించాము అని. అప్పటి హీరోలు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, హీరోలు సెట్ లో ఉన్నారంటే.. అందరు కామ్ గా ఎవరి పనివారు చూసుకునేవారు. హీరోయిన్లు కూడా హీరోలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏఎన్నార్ - శోభన్ బాబును ర్యాగింగ్ చేసిన హీరోయిన్..
Image Credit : our own

ఏఎన్నార్ - శోభన్ బాబును ర్యాగింగ్ చేసిన హీరోయిన్..

కొంత మంది చనువుగా ఉన్నా.. అతిగా కాకుండా.. ఉండేంతవరకే ఉండేవారు. అయితే ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటేనే సాహసంగా ఫీల్ అయ్యేవారు.. కానీ ఏఎన్నార్ కాస్త చనువుగానే ఉండేవారు. ఇక శోభన్ బాబు చాలా డిస్సిప్లీన్ గా ఉండేవారు. ఈ ఇద్దరు హీరోలను ర్యాగింగ్ చేసి, షూటింగ్ సెట్ లో ఏడిపించిన ఏకైక హీరోయిన్ గురించి మీకు తెలుసా? ఆమె ఎవరో కాదు రాధిక. అవును హీరోయిన్ రాధిక.. ఏఎన్నార్, శోభన్ బాబులను ర్యాగింగ్ చేసేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

36
రెండు తరాల హీరోలకు జంటగా..
Image Credit : instagram / Radhika Sarathkumar

రెండు తరాల హీరోలకు జంటగా..

రెండు తరాల హీరోలతో జంటగా నటించి మెప్పించింది రాధిక. 80వ దశకంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాధిక.. ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్, చిరంజీవి లాంటి హీరోల జంటగా నటించి మెప్పించింది. సీనియర్ హీరోలతో ఆడి పాడిన ఈ తార.. వారికి పోటీగా నటించి, డ్యాన్స్ కూడా చేసేది. మరీ ముఖ్యంగా చిరంజీవి తో పోటా పోటీగా డ్యాన్స్ చేసి రచ్చ రచ్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాధిక అందరితో జ్యోవియల్ గా ఉంటుంది. అదే విధంగా షూటింగ్ సెట్ లో హీలతో చాలాక్లోజ్ గా ఉండేది.

46
అక్కినేని గురించి మాట్లాడుతూ..
Image Credit : Asianet News

అక్కినేని గురించి మాట్లాడుతూ..

అలాగే అక్కినేని నాగేశ్వరరావు తో కూడా చనువుగా ఉంటూ.. ఆయన మీద జోకులు కూడా వేసేదట. అక్కినేని కూడా రాధిక విషయంలో కూల్ గా స్పందించేవారట. ''అక్కినేని నాగేశ్వరరావు.. నా హీరో.. నా రొమాంటిక్ హీరో.. ఆయనతో నటించడం అంటే.. చాలా ఎంజాయ్ చేస్తాం.. అలా ఉండేవారు. ఇక శోభన్ బాబును అయితే డ్యాన్స్ విషయంలో ఎక్కువగా ర్యాగింగ్ చేసేదాన్ని. అయితే శోభన్ బాబు నుంచి మాత్రం తాను ఒక విషయాన్ని నేర్చుకున్నానని ''రాధిక వెల్లడించారు.

56
శోభన్ బాబు నుంచి నేర్చుకున్నది ఇదే..
Image Credit : Asianet News

శోభన్ బాబు నుంచి నేర్చుకున్నది ఇదే..

రాధిక మాట్లాడుతూ.. ''శోభన్ బాబు సాయంత్రం 6 దాటితే షూటింగ్ ప్యాకప్ చెప్పేవారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా షూటింగ్ చేసేవారు కాదు. అదే అలవాటు నాకు కూడా వచ్చింది. సాయంత్రం 6 దాటితే.. అస్సలు నటించబుద్ది కాదు. నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలు, సీరియళ్లకు కూడా 6 దాటితే చేయకుండా వెళ్లిపోయేదాన్ని.. అందరు నన్ను తిట్టేవారు... శోభన్ బాబుతో నటించినప్పటి నుంచి నువ్వు ఇలా తయారయ్యావని.. రాధిక అన్నారు.

66
రాధికను ర్యాంగింగ్ చేసిన హీరో..
Image Credit : instagran /Radhika Sarathkumar

రాధికను ర్యాంగింగ్ చేసిన హీరో..

అయితే రాధిక ఎంత మంది హీరోలను టీజ్ చేసి.. ఆటాడుకున్నా.. రాధికను ర్యాగింగ్ చేసిన హీరో మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరేనట. ఈ విషయాన్ని కూడా రాధికానే వెల్లడించారు. చిరంజీవి నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేవారం.. నన్ను ఏదో ఒక కమెంట్ చేస్తూనే ఉండేవాడు. మేము బెస్ట్ ఫ్రెండ్స్.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అని రాధిక అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
శోభన్ బాబు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Related Stories
Recommended image1
ఏఎన్నార్ కూతురిగా శ్రీదేవి, నాస్తికుడైన అక్కినేని పరమ భక్తుడిగా నటించిన సినిమా, భక్త తుకారాం మూవీ రివ్యూ..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే.. శోభన్ బాబు తో కంఫర్ట్ ఎక్కువ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved