MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Divorce: నాలుగేళ్ళ క్రితం పెళ్లి, అప్పుడే విడాకుల కోసం కోర్టుకెక్కిన ప్రముఖ నటి..42 ఏళ్ళ వయసులో ఇలా

Divorce: నాలుగేళ్ళ క్రితం పెళ్లి, అప్పుడే విడాకుల కోసం కోర్టుకెక్కిన ప్రముఖ నటి..42 ఏళ్ళ వయసులో ఇలా

కన్నడ నటి శుభ పూంజా, వ్యాపారవేత్త సుమంత్ బిల్లావా పెళ్లయిన నాలుగేళ్లకే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 04 2026, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శుభ పూంజా విడాకులు
Image Credit : Asianet News

శుభ పూంజా విడాకులు

కన్నడ నటి శుభ పూంజా తన వైవాహిక జీవితంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్లకే భర్త నుంచి విడిపోవడానికి ఆమె కోర్టు మెట్లెక్కారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన జంట
Image Credit : FB

ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన జంట

నటి శుభ పూంజా, ఆమె భర్త, వ్యాపారవేత్త సుమంత్ బిల్లావా పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. నాలుగేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది.
35
2022 జనవరిలో శుభ పూంజా, సుమంత్ బిల్లావాల వివాహం
Image Credit : Shubha Poonja Instagram

2022 జనవరిలో శుభ పూంజా, సుమంత్ బిల్లావాల వివాహం

శుభ పూంజా, సుమంత్ బిల్లావాల వివాహం 2022 జనవరిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట కొన్ని రియాలిటీ షోలలో కూడా కలిసి కనిపించారు.
45
విడాకులకు కారణం ?
Image Credit : Asianet News

విడాకులకు కారణం ?

విడాకుల విషయంపై స్పందించడానికి శుభ పూంజా నిరాకరించారు. విడిపోవడానికి గల కారణాలను బయటపెట్టడానికి సుమంత్ కూడా ఇష్టపడటం లేదు. పిటిషన్ దాఖలు చేసినందున ఇద్దరూ కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది.
55
నాలుగేళ్ళ క్రితం భర్త గురించి ఇలా
Image Credit : Shubha Poonja Instagram

నాలుగేళ్ళ క్రితం భర్త గురించి ఇలా

శుభ పూంజా కన్నడ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఈమె 'జాక్‌పాట్', 'చండ', 'స్లమ్ బాలా', 'అంజదిరుల' వంటి అనేక చిత్రాల్లో నటించారు. కొన్ని సీరియళ్లలో కూడా గెస్ట్ రోల్స్ చేశారు. ప్రస్తుతం శుభ వయసు 42 ఏళ్ళు. ఈ వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తో అసలు భార్య భర్తల మధ్య ఏం జరిగింది అనే సందేహాలు మొదలయ్యాయి. 

సుమంత్ తో ఆమె 2020 నుంచి రిలేషన్ లో ఉంది. 2022లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో శుభ మాట్లాడుతూ సుమంత్ ఇంట్రావర్ట్, కానీ ఇతరులకు సమాజానికి మంచి చేయాలనే మనసు ఉంది. నటన కాకుండా వేరే రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. పెళ్లి తర్వాత నేను యాక్టింగ్ కొనసాగించడంలో సుమంత్ కి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ కారణాల వల్ల అతడిని పెళ్లి చేసుకుంటున్నట్లు శుభ పేర్కొంది. కానీ ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
Ram Charan: రాంచరణ్ నటనపై విమర్శలు, వరస్ట్ నుంచి ది బెస్ట్ వరకు..నోరు మెదపకుండా 5 సినిమాలతో ఇచ్చిపడేశాడు
Recommended image2
Super Star Krishna: మహేష్ బాబుకి ఇప్పటికైనా అర్థం కావాలి..కృష్ణ ఆవేదన, ఆ మూవీ తర్వాత షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved