- Home
- Entertainment
- ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే.. శోభన్ బాబు తో కంఫర్ట్ ఎక్కువ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే.. శోభన్ బాబు తో కంఫర్ట్ ఎక్కువ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తరాలు మారినా.. అందగాడు, సోగ్గాడు ఇమేజ్ మాత్రం శోభన్ బాబుకే దక్కుతుంది. అటువంటి అందాల నటుడితో యాక్ట్ చేయడానికి హీరోయిన్లు పోటీపడే వారట. మిగతా హీరోలకంటే శోభన్ బాబుతోనే కంఫర్ట్ అయి డైరెక్ట్ గా చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే..
టాలీవుడ్ లో అందగాడు.. సొగ్గాడు, అనే టాగ్స్ సాధించిన ఏకైక హీరో శోభన్ బాబు. ఆయన హెయిర్ స్టైల్,యాక్టింగ్, ఆటీట్యూడ్ కు అభిమానులు ఎక్కువ. మరీ ముఖ్యంగా.. అప్పట్లోనే లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఏఎన్నార్ తో పాటు శోభన్ బాబు కూడా ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరువాత టైర్ 1 హీరోల లిస్ట్ లో శోభన్ బాబు కొనసాగారు.
తెలుగు సినిమాకు గ్లామర్ సొగబులద్దిన ఈ హీరో.. క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్నారు. పని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. అయితే చాలామంది హీరోయిన్లు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే కూడా శోభన్ బాబు మాత్రమే కంఫర్ట్ అనిపించేవారట. ఈ విషయాన్ని ఓ హీరోయిన్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయసుధ.
శోభన్ బాబుతో నటించడానికి పోటీ పడ్డ హీరోయిన్లు...
ఇక తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో ఆడిపాడాడు శోభన్ బాబు. జయప్రద, జయసుధ, శ్రీదేవి, రాధ, మాధవి, లక్ష్మి విజయశాంతి, లాంటి ఎందరో హీరోయిన్లు ఆయన సరసన నటించి మెప్పించారు. అయితే వీరిలో జయసుధ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి.
ఆమెకు ఓ ఇంటర్వ్యూలో ఫన్నీ ప్రశ్న ఎదురయ్యింది. అప్పటి హీరోలలో మీకు ఎవరు కంఫర్ట్ అనిపించేవారు అంటే.. వెంటనే జయసుధ శోభన్ బాబు పేరు చెప్పింది. ఏమాత్రం ఆలోచించకుండా శోభన్ బాబు పేరు చెప్పారు. కారణం ఏంటి అని అడగ్గా.. జయసుధ మిగతా హీరోలకు.. శోభన్ బాబుకు ఉన్న తేడాను వెల్లడించారు.
జయసుధ వెల్లడించిన సంచలన విషయం...
జయసుధ మాట్లాడుతూ.. '' శోభన్ బాబుతో నటించడం చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే గౌవరం ఉండేది. వారితో మాట్లాడాలంటే భయపడేవారు. ఏఎన్నార్ గారు కూడా కాస్త ఫ్రీగానే ఉండేవారు కానీ.. ఎన్టీఆర్ అంటే వేరే లెవల్. ఏఎన్నార్ ఎంత కంఫర్ట్ ఇచ్చినా కానీ.. ఆయన మీద జోకులు వేయలేము కదా..? శోభన్ బాబు మీద మాత్రం జోకులు వేసుకుంటూ.. జ్యోవియల్ గా ఉండేవారం. ఆయన కూడా చాలా సరదాగా ఉండేవారు మాతో అని జయసుధ అన్నారు.
జయసుధను అత్తా అని పిలిచేవారు..
.శోభన్ బాబు జయసుధతో చాలా క్లోజ్ గా ఉండేవారు.. ఆయన ఆమెను సరదాగా అత్తా అని పిలిచేవారట. సహజనటి అంటే శోభన్ బాబుకు చాలా అభిమానమట. జయసుధతో శోభన్ బాబు చాలా సినిమాలు చేశారు. అందులో హిట్ సినిమాలే ఎక్కువ. ఇక ఆయన సెట్ లో కాని.. బయట కాని అత్తా అంటు జయసుధను పిలిచి ఏడిపించేవరాట. ఈ విషయాన్ని స్వయంగా జయసుధ ఓ సందర్భంలో వెల్లడించారు. జయప్రద హోస్ట్ గా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు.
శోభన్ బాబు వారసులు ఎందుకు రాలేదు?
ఇక శోభన్ బాబు బాలరామకృష్ణులు సినిమా తరువాత ఏ ఇతర సినిమాలు చేయలేదు. క్యారెక్టర్ రోల్స్ కూడా చేయలేదు. సంపాధించిన డబ్బును ఎప్పటికప్పుడు రియల్ ఎస్టైట్ లో ఇన్వెస్ట్ చేసిన ఆయన.. 10 వేల కోట్ల వరకూ ఆస్తులను సంపాదించాడని తెలుస్తోంది. అంతే కాదు ఆయన కొడుకులు ఎవరిని ఆయన ఇండస్ట్రీలకి తీసుకురాలేదు. శోభన్ బాబు హీరోగా మాత్రమే సినిమాలు చేశారు. ఆతరువాత ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఎంత మంది ఎన్ని కోట్లు ఇస్తామన్నా.. ఆయన పాత్రలు చేయడానికి ఒప్పుకోలేదు.
రిటైర్మెంట్ తరువాత శోభన్ బాబు..
గొప్ప గొప్ప పాత్రలెన్నో వచ్చినా.. ఇంటిదాకా వెళ్ళి బ్రతిమలాడినా శోభన్ బాబు నో అనేసేవారు. దానికి కారణం.. తన అభిమానులు తనను హీరోగా.. అందాల నటుడిగా మాత్రమే చేశారని.. ఆతరువాత ముసలి పాత్రలు, నాన్న పాత్రలు, తాత పాత్రలు తాను చేయనని.. సోగ్గాడిగా ఇలాంటి పాత్రలు చేసి.. తన అభిమానులను నిరాశ పరచలేదనని ఆయన అనేవారట. ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చినా.. శోభన్ బాబు మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా కొనసాగిన శోభన్ బాబు.. 2008 లో తన 71 ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో మరణించారు.

