Devatha: నీ ప్రాణం నా చేతిలోనే పోతుంది.. మాధవకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాధ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో మాధవ(madhava) ట్రోపిని తీసుకొని ఇంట్లోకి వెళ్లడంతో రామ్మూర్తి దంపతులు అది చూసి సంతోష పడుతూ ఉంటారు. దేవి గెలిచింది అని ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు దేవి, రాధ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడగగా వాళ్ళు కొంచెం షాక్ లో ఉన్నారు అని అంటాడు మాధవ. మరొకవైపు దేవుడమ్మ,దేవి(devi) రాకపోవడంతో ఆదిత్యను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వేస్తూ ఉండగా ఆదిత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.
ఆయన గురించి నాకు తెలిసింది అని బాధపడుతున్నావా. నిన్ను మస్తు బాధ పెట్టిండని, నాకు తెలిస్తే బాధపడతానని చెప్పలేదు కదా అని అనగా వెంటనే రాధ(radha) నువ్వు అనుకుంటున్నా విధంగా మీ నాన్న చెడ్డవాడు కాదమ్మా అని అనడంతో వెంటనే దేవి ఎందుకమ్మా అలా అబద్ధాలు చెబుతున్నావు అని అంటుంది దేవి. దేవి వాళ్ళ నాన్న గురించి రాధ(radha) ని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అప్పుడు రాధ ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది.
ఆ తర్వాత రాధ అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. మరొకవైపు మాధవ(madhava) జరిగిన విషయాన్ని తలుచుకొని ఆనంద పడుతూ ఉంటాడు. తానే గెలిచాను అని సంతోష పడుతూ ఉండగా ఇంతలోనే రాధ(radha)అక్కడికి వస్తుంది. అప్పుడు ఏమీ తెలియనట్టుగా ఏం జరిగింది అని అడగడంతో రాధ కోపంతో విరుచుకుపడుతుంది. పసిపిల్ల మనసులో వాళ్ళ నాన్న గురించి అంత గలీజ్ గా చెబుతావా అని అడగగా ఏం చేయాలో చెప్పు అంటూ అంటూ మాధవ నీచమైన బుద్ధితో మాట్లాడుతాడు.
అప్పుడు రాధ(radha) కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు మాధవ నేను ఆ తప్పు చేయడానికి కారణం నువ్వు. నా కూతురికి తల్లి కావాలి నాకు నువ్వు కావాలి అనడంతో రాధ కోపంతో మాధవ పై చేయి ఎత్తుతుంది. నీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను నేను ఎటువంటి దాన్ని అయినా కూడా నీ బుద్ధి మారదా అని కోపడుతుంది రాధ. కానీ మాధవ(madhava)మాత్రమే ఎంత తిట్టినా కూడా తన బుద్ధిని మార్చుకోకుండా అలాగే మాట్లాడుతాడు. ఇంకా ఇంట్లో ఉండడం నాది తప్పు ఇప్పుడే నా బిడ్డను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని అంటుంది రాధ. ఏదో ఒక రోజు నువ్వు చేసే తప్పులకు నేను చంపేస్తాను అని బెదిరిస్తుంది రాద.
అప్పుడు రాధ(radha)కు లేనిపోని అనుమానాలు ప్రశ్నలు వేస్తాడు మాధవ. దాంతో రాధ ఆలోచనలో పడుతుంది. కానీ మాధవ(madhava)మాత్రం నీ మీద ఇంకా ఇష్టం పెరిగింది అంటూ మాట్లాడుతూ ఉండగా రాధా కోపంతో చీదరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దేవుడమ్మ దంపతులు పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సత్య వస్తుంది. ఆదిత్య బాధగా కనిపిస్తున్నాడు అమెరికాకు కూడా వచ్చేలా కనిపించడం లేదు అని అంటుంది సత్య.