- Home
- Entertainment
- Devatha: తల్లితండ్రుల ముందు రాధ అందాన్ని పొగిడిన మాధవ.. అమ్మవారికి బోనం సమర్పించనున్న రుక్మిణి!
Devatha: తల్లితండ్రుల ముందు రాధ అందాన్ని పొగిడిన మాధవ.. అమ్మవారికి బోనం సమర్పించనున్న రుక్మిణి!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోని మాధవ (Madhava) ఇంట్లో బోనాల సందడి మొదలవుతుంది. ఇక రాధ కోసం ఎదురు చూడగా అదే సమయంలో రాధ (Radha) అక్కడికి వస్తుంది. రాధ అందాన్ని చూసి మాధవ అందరి ముందు బాగుంది అని కాంప్లిమెంట్ ఇవ్వటంతో రాధ కోపంగా చూస్తుంది.
ఆ తర్వాత జానకి (Janaki) గుడికి వెళ్దాం అని బోనం ఎత్తుకోమని రాధను అనడంతో రాధ గుడికి రాను అని గట్టిగా చెప్పేస్తుంది. మొత్తానికి రాధ ఇంట్లోనే ఉండగా వారంతా గుడికి వెళ్తారు. ఇక గుడి దగ్గర దేవుడమ్మ (Devudamma) కుటుంబం కూడా వారికి ఎదురవటంతో వెంటనే దేవి అమ్మ ఏది అని అడుగుతుంది.
దాంతో జానకి (Janaki) తను ఎప్పటిలాగానే రాను అన్నదని అనడంతో వెంటనే దేవుడమ్మ అదేంటి అంటూ ప్రశ్నలు వేస్తుంది. ఆ తర్వాత ఆదిత్య తన పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి అందరిని గుడి లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక రాధ (Radha) ఇంట్లో అమ్మవారి ముందు బాధలు పంచుకొని ఆ బోనం ను పొలం దగ్గరున్న అమ్మవారికి సమర్పించాలి అనుకుంటుంది.
మరోవైపు గుడిలో ఆదిత్య (Adithya) అమ్మవారి ముందు తన భార్య, కూతురు గురించి దండం పెట్టుకుంటాడు. వారిని ఎలాగైనా తన ఇంటికి వచ్చేలా చేయమని కోరుకుంటాడు. అప్పుడే మాధవ (Madhava) వచ్చి నువ్వు అనుకున్న కోరిక తీరదు అంటూ షాక్ ఇస్తాడు. అయినా కూడా ఆదిత్య సహనంతో మాట్లాడుతాడు.
ఎలాగైనా తన కూతురు తన ఇంటికి వస్తుంది అని గట్టిగా చెబుతాడు. కానీ రాధ (Radha) మాత్రం రాదు అంటూ.. చిన్నయి (Chinmai) తట్టుకోలేదు అని అనటంతో వెంటనే ఆదిత్య.. నీ కూతురి స్వార్థం .. నా కన్నా కూతురిని నా నుండి దూరం చేయటం సరైనది కాదు అంత గట్టిగా మాట్లాడుతాడు.
ఆ తర్వాత రాధ (Radha) బోనం తీసుకొని పొలంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. ఇక అదే సమయంలో అక్కడికి భాగ్యమ్మ (Bhagyamma) వచ్చి.. బోనం ఈ అమ్మవారికి ఎలా సమీర్పిస్తావు.. ఈ బోనం గంగమ్మకు సమర్పించాలి అని.. అనడంతో అందరి ముందర నేను ఎలా వెళ్లాలి అంటూ..
నీకు తెలిసినా కూడా ఇలా ఎందుకు అంటున్నావు అని తన తల్లిని ప్రశ్నిస్తుంది రుక్మిణి (Rukmini). కానీ భాగ్యమ్మ వినకుండా నువ్వు కచ్చితంగా అక్కడే బోనం సమర్పించాలి అని.. అక్కడ ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి రాధ (Radha) మొహానికి పసుపు పెడుతుంది.