- Home
- Entertainment
- Karthika Deepam 2 Today Episode April 6: కార్తీక్‌ని బ్లాక్ మెయిల్ చేసిన జ్యోత్స్న.. స్ట్రాంగ్ కౌంటర్‌తో ఛాలెంజ్
Karthika Deepam 2 Today Episode April 6: కార్తీక్‌ని బ్లాక్ మెయిల్ చేసిన జ్యోత్స్న.. స్ట్రాంగ్ కౌంటర్‌తో ఛాలెంజ్
Karthika Deepam 2 Today Episode April 6: కార్తీక్‌ని గట్టిగా ఇరికించింది జ్యోత్స్న, పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్ మెయిల్. అంతేకాదు దీపని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగింది. దీంతో కార్తీక్ కూడా తగ్గలేదు. ఆమెకి గట్టిగా ఇచ్చిపడేశాడు.

కార్తీక దీపం సోమవారం ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు(సోమవారం) ఎపిసోడ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. జ్యోత్స్న కుట్రలు, కార్తీక్ తెలివి, కుటుంబంలో పెరుగుతున్న అనుమానాలు అన్నీ కలిపి సీరియల్‌ని ఆసక్తికరంగా మార్చాయి. ఇక ఏప్రిల్ 6 ఎపిసోడ్ హైలైట్స్ ఇలా ఉన్నాయి
జ్యోత్స్న తన అసలు స్వభావాన్ని బయటపెడుతూ దాసుపై తీవ్రంగా విరుచుకుపడుతుంది. “నువ్వు నాకు సరైన జీవితం ఇవ్వలేవు” అంటూ అవమానిస్తూ, గతంలో జరిగిన బిడ్డ మార్పిడి విషయాన్ని గుర్తుచేస్తుంది. తనకు ఈ ఇంటి వారసత్వం తప్ప మరేమీ అవసరం లేదని స్పష్టం చేస్తుంది.
కార్తీక్‌పై అనుమానాలు
దాసు నిజం చెప్పడానికి సిద్ధమవుతాడు. కానీ జ్యోత్స్న అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. “నేను చనిపోతాను… నా చావుతో ఈ ఇంట్లో మరింత విషాదం జరుగుతుంది” అంటూ అతన్ని భయపెడుతుంది. చివరకు దాసు నిస్సహాయంగా వెనక్కి తగ్గిపోతాడు.
ఇక కాంచనకు కార్తీక్ ప్రవర్తనపై అనుమానం మొదలవుతుంది. కేక్ కటింగ్ సమయంలోనూ, భోజన సమయంలోనూ అతని టెన్షన్ ఆమెకు గమనించకుండా ఉండదు. దీప కూడా ఏదో దాచిపెడుతున్నట్లు చెప్పడంతో కుటుంబంలో ఉత్కంఠ పెరుగుతుంది.
కార్తీక్, జ్యోత్స్న మధ్య సవాల్
మరోవైపు జ్యోత్స్న, కార్తీక్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమవుతుంది. జ్యోత్స్న అతన్ని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, “నన్ను పెళ్లి చేసుకుంటే నేను మారిపోతాను” అని చెబుతుంది. కానీ కార్తీక్ మాత్రం దీప తప్ప మరెవరినీ తన భార్యగా ఊహించుకోలేనని స్పష్టం చెప్తాడు.
దీపని చంపేస్తానంటూ జ్యోత్స్న బెదిరింపులు
దీనితో జ్యోత్స్న అసలు విలన్ అవతారం ఎత్తుతుంది. “నిజం బయటపెడితే ముందు దీపను చంపేస్తా” అంటూ బెదిరిస్తుంది. దీప గర్భంలో ఉన్న బిడ్డను కూడా టార్గెట్ చేస్తూ ఆమె క్రూరత్వాన్ని చూపిస్తుంది. తానే కాదు, దీప కడుపులో బిడ్డ కూడా ఉంది. నేను పోతూ దీపతోపాటు ఆమె బిడ్డని కూడా చంపేస్తానని, ఒక్క ప్రాణం తీస్తే బోనస్ గా మరో ప్రాణం పోతుందని హెచ్చరిస్తుంది.
నీకు భయం ఏంటో చూపిస్తా అంటూ జ్యోత్స్నకి కార్తీక్ సవాల్
కార్తీక్ కూడా వెనక్కి తగ్గకుండా సవాల్ విసురుతాడు. “నీకు భయం ఏమిటో నేర్పిస్తా” అంటూ జ్యోత్స్నను కౌంటర్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఈ ఛాలెంజ్ కథను మరింత ఉత్కంఠగా మారుస్తుంది.
ఇదిలా ఉంటే జ్యోత్స్నకు పెళ్లి సంబంధాలు చూడాలని కుటుంబ పెద్దలు నిర్ణయిస్తారు. ఆమె మాత్రం తన డ్రామాతో అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది.
దీపకి దిష్టి తీసిన కార్తీక్
ఎపిసోడ్ చివర్లో కార్తీక్ అనూహ్యంగా దీపకు, ఆమె కడుపులో ఉన్న బిడ్డకు దిష్టి తీస్తాడు. దీంతో కాంచన, దీప ఇద్దరికీ అతనిపై కొత్త అనుమానాలు మొదలవుతాయి. ఎప్పుడూ లేని విధంగా కార్తీక్ ఇలా చేయడం అందరిని షాక్ కి గురి చేసింది.
ఉత్కంఠ భరితంగా సాగిన కార్తీక దీపం ఎపిసోడ్
మొత్తంగా సోమవారం కార్తీక దీపం ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. జ్యోత్స్న బ్లాక్ మెయిల్, కార్తీక్ కౌంటర్, దీప అయోమయం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. మరోవైపు కాంచన అనుమానాలు సీరియల్‌పై ఆసక్తిని పెంచాయి. నెక్ట్స్ ఏం జరగబోతుందనే ఉత్కంఠని రేకెత్తించాయి.

